Bigg Boss OTTలోకి ఈసారి మరో మోడల్.. హీరోగా ఎంట్రీ ఇస్తూనే బిగ్ బాస్ లోకి?

బిగ్ బాస్ తదుపరి ఓటీటీ సీజన్ మరికొద్దిరోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పాల్గొనబోతున్నారు వారు వీరేనంటూ రోజుకు ఒకరి పేరు తెర మీదకు వస్తోంది. తాజాగా టాలీవుడ్ హీరో, మోడల్ అనిల్ రాథోడ్ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనబోతున్నారు అని తెలుస్తోంది. అసలు ఆయన ఎవరు? తెలుగులో ఏం సినిమాలు చేశారు? అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

బిగ్ బాస్ ఓటీటీ

బిగ్ బాస్ ఓటీటీ

తెలుగులో బిగ్ బాస్ విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ దాదాపు ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని మూడవ సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. ఐదవ సీజన్ ఫినాలే రోజున కొత్తగా బిగ్ బాస్ ఓటీటీ ప్రవేశపెడుతున్నామని దానికి కూడా తానే హోస్ట్ గా వ్యవహరిస్తున్నా అని నాగార్జున అధికారికంగా ప్రకటించారు.

మోడల్ కం హీరో

మోడల్ కం హీరో

నాగార్జున ప్రకటన చేసినప్పటి నుంచి అందరికీ బిగ్ బాస్ ఓటీటీ మీద ఆసక్తి మరింత పెరిగింది. ఇప్పటికే అందుతున్న సమాచారం మేరకు దాదాపు ఏడుగురు పాత బిగ్ బాస్ సీజన్ల నుంచి కంటెస్టెంట్ లను ఈ సీజన్లో కూడా ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే అరియానా, అఖిల్ సార్థక్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. ఇప్పుడు అనిల్ రాథోడ్ అని ఒక మోడల్ కం హీరో కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని తెలుస్తోంది.

మరింత పేరు వస్తుందని

మరింత పేరు వస్తుందని

అయితే ఇప్పటికే తెలుగులో ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల ద్వారా ఆయనకు పెద్దగా పేరు రాలేదు ఈ బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరింత పేరు వస్తుందని ఆయన భావిస్తున్నాడు.హైదరాబాద్ కి చెందిన అనిల్ రాథోడ్ ముందుగా మోడలింగ్ లో ప్రవేశించి మంచి విజయాలు అందుకున్నారు. అనేక అవార్డులు సాధించిన తర్వాత నటన మీద ఆసక్తి కలగడం తన సినీ రంగ ప్రవేశం చేశారు.

అవార్డులు

అవార్డులు

మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఆయన TAA ద్వారా బెస్ట్ మోడల్ ఆఫ్ ది ఇయర్, మిస్టర్ తెలంగాణ 2015 మరియు బెస్ట్ మోడల్ - రుబారు మిస్టర్ ఇండియా 2021 వంటి అనేక అవార్డులను కూడా గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ గోవా, బ్రైడల్ ఫ్యాషన్ వీక్, పూణే ఫ్యాషన్ వీక్ మరియు గ్లామ్ ఫ్యాషన్ వీక్ వంటి సర్వల్స్ బ్రాండ్‌లు మరియు అంతర్జాతీయ షోల కోసం అనిల్ ర్యాంప్ వాక్ చేశారు.

Recommended Video

Radha Madhanam movie director prabhathand actress nitya Sri exclusive interview part 2
Mr.మజ్నుతో

Mr.మజ్నుతో

2019లో, అనిల్ తన నటనా జీవితాన్ని "Mr.మజ్ను" చిత్రం ద్వారా ప్రారంభించారు. అదే ఏడాది "వెంకీ మామ" చిత్రంలో కూడా నటించాడు. చేసినవి చిన్న పాత్రలు కావడంతో అసలు గుర్తింపు దక్కలేదు. 2022లో, అనిల్ "సుగ్రీవ" మరియు "అరే ఓ సాంబ" సినిమాలు చేస్తున్నాడు. బిగ్ బాస్ ఓటీటీ నిర్వాహకులు అనిల్ రాథోడ్ ను సంప్రదించగా అనిల్ రాథోడ్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని దాదాపుగా ఇప్పటికే అగ్రిమెంట్లు కూడా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 27వ తారీకు నుంచి మొదలు కాబోతున్న ఈ సీజన్ కు సంబంధించి ఫిబ్రవరి 15 నుంచి క్వారెంటైన్ కూడా మొదలు కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X