Pawan Kalyan జనసేనలోకి 'మొగలి రేకులు' హీరో.. పవన్ తో భేటీ.. ఫ్యామిలీ ఆడియెన్స్ ఓట్ల కోసమే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ సైతం జోరు చూపిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రజల సమస్యలపై కృషి చేస్తూ నాయకుడు అనిపించుకుంటున్నారు. త్వరలో హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ కల్యాణ్ రాబోయే ఎలక్షన్స్ కోసం సంసిద్దం అవుతున్నారు.
ఇక పవన్ కల్యాణ్ కు అభిమానులే కాకుండా ఆయన సిద్ధాంతాలు, ఆయనపై నమ్మకం ఉన్నవారు అనేకం. వారిలో కొంతమంది ఆయన స్థాపించిన జనసే పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒకప్పటి మొగలి రేకులు సీరియల్ లోని హీరో జనసేనలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తన మాటలతో ప్రత్యర్థులకు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సినిమాలతోనే కాకుండా పవర్ ఫుల్ స్పీచ్ తో కూడా అభిమానుల్లో జోష్ నింపుతారు. ఇటీవల ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో అలరించిన పవన్ కల్యాణ్ త్వరలో హరిహర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో ఎంతో యాక్టివ్ గా పాల్గొంటున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడిగా సభలు నిర్వహిస్తూ ప్రత్యర్థులను తనదైన వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నారు.

కొండగట్టులో పూజలు..
ఏపీలో వచ్చే ఎన్నికల సమరానికి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటినుంచే సంసిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగానే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం కోసం ప్రత్యేకంగా వారాహి వాహనాన్ని రెడీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో వారాహి ట్రయల్ నిర్వహంచిన పవన్ కల్యాణ్ రిజిస్ట్రేషన్ వంటి అన్నీ పనులు పూర్తి చేసి.. ఇటీవలే పూజలు చేయించారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదం అందుకున్నారు.

మర్యాదపూర్వకంగా కలిసి..
ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో చేరేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ బుల్లితెర సీరియల్ కథనాయకుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు ఆయన తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టే కారణం అయింది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను సాగర్ మర్యాదపూర్వకంగా కలిసి.. మొక్కను బహుకరించారు. దీనికి సంబంధించిన ఫొటోను ఇన్ స్టాలో పంచుకున్నారు.

నిరాడంబరమైన వ్యక్తితో..
పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటోను షేర్ చేసిన హీరో సాగర్.. "పవర్ ఫుల్ లీడర్ పవన్ కల్యాణ్ అన్నను కలవడంతో ఈరోజును ఎందో అద్భుతంగా మొదలు పెట్టాను. ఎంతో వినయపూర్వకమైన, నిరాడంబరమైన వ్యక్తితో కొంత సమయాన్ని గడపడం నాకు చాలా ఆనందంగా ఉంది. పీకే అన్నతో అద్భుతమైన భేటీ జరిగిందని భావిస్తున్నాను" అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతో పవన్ ను సాగర్ కలవడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ ఓట్లు..
ఇలా పవన్ కల్యాణ్ తో సాగర్ భేటీ కావడంతో త్వరలో ఆయన జనసేనలోకి చేరుతారని, ఆ పార్టీ తరఫున ప్రచారం నిర్వహిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మొగలి రేకులు సీరియల్ ద్వారా ఎంతో మంది ఫ్యామిలీ ఆడియెన్స్ ను సంపాదించుకున్నారు సాగర్. ఇప్పుడు ఆయనతో వాళ్ల ఓట్లు రాబట్టగలరని అప్పుడే అనేకరకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే సాగర్ జనసేన తరఫున ప్రచారం చేస్తారన్న వార్తల్లో ఎంత నిజం ఉందో ముందు ముందు తెలియాల్సి ఉంది.
ఏ నటుడికి రానంతగా పేరు..
ఇదిలా ఉంటే మొగలి రేకులు సీరియల్ లో ఆర్కే నాయుడు, మున్నా వంటి తండ్రీ కొడుకుల పాత్రలో ఏ బుల్లితెర నటుడికి రానంత పేరు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్కే నాయుడు అంటే తెలియని ఫ్యామిలీ ఆడియెన్స్ ఉండరు. సీరియల్ ను పక్కన పెట్టిన సాగర్ 2016లో సిద్ధార్థ్ అనే సినిమాతో వెండితెరపై సందడి చేశాడు. ఆ సినిమా అంతగా అలరించలేదు. సుమారు ఐదేళ్ల తర్వాత 2021లో షాదీ ముబారక్ అనే చిత్రంలో నటించారు. దిల్ రాజు విడుదల చేసిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications