200 కోట్ల సినిమా మిస్.. మొగలిరేకులు నటుడు సాగర్ బిగ్ మిస్టేక్
బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన మొగలిరేకులు స్టార్ సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2006 లోనే ఆయన తెలుగు టెలివిజన్ పరిశ్రమలో సంచలనంగా మారారు. ఆయన నటనతో కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నారు. స్మాల్ స్క్రీన్ పైనే కాకుండా బిగ్ స్క్రీన్ పైన కూడా పలు చిత్రాల్లో నటించారు. అయితే ఆయనకు లాక్ డౌన్ ముందు కెరియర్ ను మలుపు తిప్పే సినిమా అవకాశం ఒకటి వచ్చింది. కానీ గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. దాంతో వెండితెరపై సక్సెస్ సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అవకాశం ఏంటి? ఎందుకు వదులుకోవలసి వచ్చింది అనే వివరాలను తాజాగా వెల్లడించారు..
బుల్లితెరపై సెన్సేషన్ గా..
తెలుగు టెలివిజన్ పరిశ్రమలో సాగర్ తొలుత అమృతం అనే సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆయన నటన, ఫిజిక్ కారణంగా 2006 నుంచి 2008 వరకు జెమినీ టీవీలో ప్రసారమైన చక్రవాకం సీరియల్ తో సెన్సేషన్ గా మారారు. జగన్ అనే పాత్రలో జీవించాడు. ఈ సీరియల్ 1237వ ఎపిసోడ్స్ తో ముగిసింది. ఆ తర్వాత 2008 నుంచి 2013 వరకు జెమినీ టీవీలో ప్రసారమైన మొగలి రేకులు సీరియల్ తో అలరించాడు. ఆర్కే నాయుడు పాత్రలో మరింతగా ఆకట్టుకున్నాడు. ఈ సీరియల్ 1368వ ఎపిసోడ్ తో పూర్తయింది. ఇక తర్వాత సీరియల్స్ కు ఫుల్ స్టాప్ పెట్టాడు.

వెండితెరపై ముఖ్య పాత్రల్లో..
చక్రవాకం, మొగలిరేకులు వంటి సీరియల్స్ తో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన సాగర్ వెండితెర పైన కూడా పలు చిత్రాల్లో మెరిశారు. సీరియల్స్ కంటే ముందే 2001లో మనసంతా నువ్వే అనే చిత్రంలో కనిపించారు. ఇక తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, సిద్ధార్థ, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, షాదీ ముబారక్ వంటి చిత్రాల్లో పలు కీలక పాత్రలు పోషించారు. కానీ ఆ సినిమాలేవి సాగర్ కు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేదు. ఇక ప్రస్తుతం ది 100 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోగా ఆయనకు ఇది తొలి చిత్రం. జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ ను భారీగా నిర్వహిస్తున్నారు. రీసెంట్ గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ చిత్రం ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం.
ప్రభాస్ ను నమ్మి.. రామ్ చరణ్ ను కోల్పోయి..
టీవీ సాగర్ ప్రస్తుతం హీరోగా లాంచ్ అవుతున్నారు. ఈ సందర్భంగా తన మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. కాగా తాజాగా తను కోల్పోయిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ గురించి తెలియజేశారు. రీసెంట్ ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడుతూ.. తొలుత ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ అని చెప్పి ఒక పాత్రలో నటించానని, కానీ షూటింగ్ కి వెళ్లిన తర్వాత తన పాత్రకు అసలు ప్రాధాన్యతే లేదని దాంతో చాలా బాధపడ్డాను అని చెప్పారు. ఇకపై అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నారంట.
ఆ తర్వాత గ్లోబల్ స్టార్, పవర్ స్టార్ రామ్ చరణ్ కుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న బ్లాక్ బస్టర్ ఫిలిం రంగస్థలంలో ఆది పినిశెట్టి నటించిన పాత్రలో నటించే అవకాశం వచ్చింది అంట. కానీ గతంలో ప్రభాస్ సినిమాతో జరిగిన అనుభవంతో అలాంటి పాత్రలు చేయనని చెప్పారంట. కానీ తీరా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆది పినిశెట్టి పాత్రకు భారీ ప్రశంసలు అందాయి. 60 కోట్ల రూపాయలతో నిర్మించిన ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 216 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేయడం విశేషం. సాగర్ ఆ పాత్ర కనుక చేసి ఉంటే ఇప్పుడు ఆయన బుల్లితెరపై స్టార్గా ఎదిగి ఉండేవారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











