భర్తతో టెలివిజన్ సీరియల్ నటి విడాకులు.. షాకింగ్‌గా అసలు విషయం బయటపెట్టి..!

మొగలి రేకులు సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైన నటి శిరీష. ఆమె ఇద్దరు అక్కలు కూడా సీరియల్ యాక్టర్స్ నే. వారి సపోర్ట్ తో శిరీష ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సీరియల్ తోనే శిరీష మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈ సీరియల్ తరువాత రాములమ్మ అనే సీరియల్ తో స్టార్ గా మారిపోయింది. శిరీష అంటే టక్కున గుర్తుకుపెట్టకపోవచ్చు కానీ, రాములమ్మ సీరియల్ హీరోయిన్ అని చెప్పగానే ఎవరైనా గుర్తుపడతారు అంతలా ఆమె ఫేమస్ అయ్యింది.

రాములమ్మ తరువాత వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. స్వాతిచినుకులు, మనసు మమత, పున్నాగ, చెల్లెలి కాపురం లాంటి సీరియల్స్ చేసి మెప్పించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే శిరీష.. నవీన్ వల్లభనేనిని వివాహమాడింది. పెళ్లి తరువాత కూడా నటనను కంటిన్యూ చేసింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. పెళ్లి తరువాత భర్తతో కలిసి ఎన్నో షోస్ లలో కూడా పాల్గొంది. ఎలాంటి కలతలు లేని వీరి కాపురంలో విబేధాలు రావడం మొదలయ్యింది.

Mogali Rekulu serial actress sireesha Clarity on Her Divores with husband Naresh

ఆరేళ్ళ తరువాత ఈ జంట విడాకులు ప్రకటించారు. ఈ మధ్యనే శిరీష తన విడాకులను అధికారికంగా ప్రకటించింది. "నా అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. నేను, నవీన్ భార్యాభర్తలుగా విడిపోయాం. మా కంట్రోల్ లో లేని కొన్ని పరిస్థితుల కారణాంగా మేము ఇద్దరం విడిపోవడం జరిగింది.ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని అర్థం చేసుకుని మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాం. వీలైతే సపోర్ట్ చేయండి కానీ మమ్మల్ని విమర్శించకండి. నాకు నవీన్ పై ఇప్పటికీ గౌరవం ఉంది. నేను ఒక సెలబ్రెటీ అయినందున ఈ విషయం మీతో చెప్పడం అవసరం అనిపించింది. అందుకే షేర్ చేస్తున్నాను. అర్థం చేసుకోండి" అంటూ రాసుకొచ్చింది.

ఇక చెల్లెలి కాపురం సీరియల్ తరువాత శిరీషకు అంత పెద్ద పాత్రలు రాలేదనే చెప్పాలి. ఈటీవీ లోఒక సీరియల్ చేస్తున్నా కూడా ఆమె ఆ సీరియల్ లో నటిస్తుంది అన్న విషయం కూడా ఎవరికి తెలియలేదు. అయితే విడాకుల తరువాత శిరీష సీరియల్స్ ను పక్కన పెట్టి వెబ్ సిరీస్ లపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లు ఎంత ఫేమస్ అవుతున్నాయో అందరికి తెల్సిందే. శిరీష బావ.. బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ కుమార్ కొత్తగా నవరస క్రియేటివ్ వర్క్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించి అందులో వెబ్ సిరీస్, ఆల్బమ్స్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.

Mogali Rekulu serial actress sireesha Clarity on Her Divores with husband Naresh

ఇక అందులో భాగంగానే శిరీష, రజిత, సౌజన్యలతో కలిసి 3 డెవిల్స్ అనే సిరీస్ ను తెరకెక్కించాడు. 5 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతుంది. ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రధానపాత్రల్లో నటించిన ఈ కామెడీ సిరీస్ సూపర్ గా ఉందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే కాకుండా ముందు ముందు ఆమె మరికొన్ని వెబ్ సిరీస్ లో నటించనుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సిరీస్ లతో పాటు ప్రైవేట్ సాంగ్స్ లో కూడా కనిపించనుందని సమాచారం. మరి ఈ సిరీస్ లతో శిరీష ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X