Bigg Boss 7 Teluguలో మొగలి రేకులు హీరో.. అత్యధిక పారితోషికం.. రోజుకు ఎంతో తెలిస్తే?

బుల్లితెరపై అనేక షోలు వచ్చినప్పటికీ అత్యధికంగా పాపులారిటీ సంపాందించుకున్న వాటిలో బిగ్ బాస్ ఒకటి. ఈ రియాలిటీ షో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటుంది. ఎన్ని సీజన్లు వచ్చినా తర్వాతి సీజన్ పై ఆసక్తి పెంచేలా చేస్తున్నారు మేకర్స్. అందుకు ప్రధాన కారణం బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్.

ఎవరెవరూ ఎప్పుడెప్పుడూ వస్తారనే క్యూరియాసిటీ పెంచుతూ తమ షో వైపుకు దృష్టి మరలుస్తున్నారు. ఇప్పటికీ పాపులర్ సీరియల్ నటీనటులు బిగ్ బాస్ తెలుగు 7లోకి అడుగు పెట్టనుండగా 'మొగలి రేకులు' హీరో ఎంట్రీ అంతకుమించి అనేలా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 Bigg Boss Telugu 7

గాల్లోకి ఎగురుతూ: ఇటీవల విడుదలైన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ (Bigg Boss Telugu 7) ప్రోమోతో రియాలిటీ షో సందడి మొదలైంది. ఈ ఏడో సీజన్ కు కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి "కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్" అంటూ కొత్త క్యాప్షన్ తో సీజన్ 7ను ప్లాన్ చేశారు మేకర్స్. ప్రోమోలో నాగార్జున చిటికి వస్తే వస్తువులన్నీ గాల్లోకి ఎగిరాయి. దీంతో ఇంట్రెస్ట్ పెరిగింది.

 Bigg Boss Telugu 7

చూడని టాస్కులు: అయితే ఇప్పటికీ ఆరు సీజన్లు చూసిన కంటెస్టెంట్స్ ఎన్నో ప్లాన్స్ వేసుకుని వస్తున్నారని, కానీ వాటన్నింటికి మించి ఈ ఏడో సీజన్ ఉండనుందని ఓ సందర్భంగా నాగార్జున తెలిపారు. అలాగే ప్రోమోలో వచ్చే కంటెస్టెంట్స్ ను పాపం పసివాళ్లు అంటూ సంబోధించారు. అంటే బిగ్ బాస్ తెలుగు 7లో ఇంతకుముందు చూడని టాస్కులు చూడనున్నట్లు తెలుస్తోంది.

అప్పుడే స్టార్ట్: ఫేక్ ఎలిమినేషన్స్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 అట్టర్ ప్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీంతో ఏడో సీజన్ పై జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఓట్లు, ఎలిమినేషన్స్ లో మార్పులు చేయనున్నారట. అంతేకాకుండా లైవ్ టెలీకాస్ట్ తీసేస్తున్నట్లు ఇటీవల ఎక్కువగా ప్రచారం అయింది. ఇక దీన్ని జూలై నెలాఖరునా, లేదా ఆగస్టు ఫస్ట్ వీక్ లో ప్రారంభిస్తారని టాక్ నడిచింది. కానీ సెప్టెంబర్ లోనే ప్రసారం చేయనున్నారు.

సీరియల్ బ్యూటిలు: బిగ్ బాస్ షోలోకి సుమారు 20 మంది వరకు కంటెస్టెంట్స్ వచ్చి పాల్గొంటారు. దాదాపుగా కంటెస్టెంట్స్ ఫైనలైజ్ అయ్యారని టాక్ వస్తోంది. కానీ, ఇంకా బెటర్ మెంట్ కోసం వడపోతలు కూడా చేస్తున్నారట. ఇప్పటికే వీళ్లలో కొంతమంది జంటలు ఉన్నారు. అలాగే బేబి హీరోయిన్ వైష్ణవి, బుల్లెట్ భాస్కర్, శ్వేతా నాయుడు, విష్ణుప్రియ, శోభా శెట్టి పాల్గొననున్నట్లు సమాచారం.

 Bigg Boss Telugu 7

భారీ పారితోషికం: తాజాగా బిగ్ బాస్ తెలుగు 7లోకి మొగలి రేకులు హీరో ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. తెలుగు బుల్లితెర ప్రపంచంలో మొగలి రేకులు సీరియల్ ఎలాంటి చరిత్ర సృష్టించిందో తెలిసిందే. ఇందులో ఆర్కే నాయుడు, మున్నా అని తండ్రీకొడుకుల పాత్రలో నటించి విపరీతమైన ఆదరణ పొందాడు సాగర్. ఇక అతని ఎంట్రీ ఇస్తే వయసుతో సంబంధం లేకుండా టీవీలకు అతుక్కుపోతారనే ఆలోచనతో భారీ పారితోషికం ఇచ్చి సాగర్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.

Mogalirekulu Sagar Entry

రోజుకే అంతా: సాగర్ కు బిగ్ బాస్ లో పార్టిస్ పేట్ చేసేందుకు ఒక రోజుకు రూ. 70 నుంచి 80 వేల వరకు ఇవ్వనున్నట్లు టాక్. అంటే వారానికి ఎంత లేదన్న రూ. 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఇతర సీరియల్ నటీనటుల కంటే సాగర్ కే ఎక్కువగా బీబీ మేకర్స్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. జబర్దస్త్ టాప్ టీమ్ లీడర్ బుల్లెటు భాస్కర్ కు వారానికి రూ. 2.50 లక్షలకు డీల్ ఓకే అయిందని సమాచారం.

 Bigg Boss Telugu 7

సినిమాలతో ప్లాప్: మరి భారీ రెమ్యునరేషన్ తో బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగు పెట్టనున్న సాగర్ ఏ మేరకు అలరిస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే సాగర్ సీరియల్స్ పక్కన 2016లో సిద్ధార్థ్ అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. కానీ, ఆ సినిమా అంతగా అలరించలేదు. అనంతరం ఐదేళ్ల తర్వాత 2021లో షాదీ ముబారక్ అనే చిత్రం చేశాడు. దిల్ రాజు విడుదల చేసిన ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X