Bigg Boss 6: బిగ్ బాస్‌లోకి బుల్లెట్ పిల్ల.. అంత రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ!
బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని షో ఇది. అంతలా ఈ కార్యక్రమం ఐదారేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ సత్తా చాటుతోంది. అదే సమయంలో ఇండియాలోనే ఏ షోకూ రాని విధంగా రేటింగ్‌ను సొంతం చేసుకుంటోంది. దీంతో దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది. ఫలితంగా నిర్వహకులు రెట్టించిన జోష్‌తో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే త్వరలోనే ఆరో దానిని కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆరో సీజన్‌లో పాల్గొనబోయే ఓ సెలెబ్రిటీ వివరాలు లీక్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

అప్పటి నుంచే ఆరో సీజన్ స్టార్ట్
తెలుగులో బిగ్ బాస్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుని రికార్డుల మీద రికార్డులను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని కూడా మొదలు పెట్టేందుకు నిర్వహకులు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేయబోతున్న ఈ సీజన్ సెప్టెంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు.

ప్రోమోలతో అంచనాలు భారీగా
బిగ్ బాస్ షో ఐదు సీజన్లను ఒక దానికి మించి ఒకటి అన్నట్లుగా రెస్పాన్స్‌ను అందుకున్నాయి. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన ప్రోమోలు కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో వీటికి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. ఈ సీజన్‌పై అంచనాలన్నీ రెట్టింపు అయిపోయాయి.

అన్నీ కంప్లీట్.. దానిపైనే ఫోకస్
అతి త్వరలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే షోను నడిపించే హౌస్ సెట్ వర్కును నిర్వహకులు పూర్తి చేసేశారట. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారని తెలిసింది. మొత్తంగా ఈ సీజన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగిసిపోయింద. ఇప్పుడు నిర్వహకులు ప్రీమియర్ ఎపిసోడ్‌పై ఫోకస్ చేశారని టాక్.

15 మంది కంటెస్టెంట్లు ఎంపిక
ఎంతో గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో మొదలు పెట్టారు. ప్రారంభంలో ఆన్‌లైన్ ద్వారా ఇంటర్వ్యూలు చేశారు. తర్వాత నేరుగా మాట్లాడి డీల్స్ చేసుకున్నారు. ఇలా ఈ సీజన్ కోసం 15 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ఇద్దరు కామన్ పీపుల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

జాగ్రత్త పడినా లీక్ అవుతూనే
బిగ్ బాస్ షోలో ప్రతీది సీక్రెట్‌గానే ఉంటుంది. కానీ, కంటెస్టెంట్ల ఎంపిక నుంచి ఎలిమినేషన్ వరకూ అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరో సీజన్‌లో అలా జరగకూడదని నిర్వహకులు భావించారు. ఇందులో భాగంగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ ఇప్పటికే ఆరో సీజన్‌లో పాల్గొనే ఎంతో మంది పేర్లు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ షోలోకి బుల్లెట్ పిల్ల
ఎంతో క్రేజీగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌లో లేడీ కంటెస్టెంట్లను ఎక్కువగా తీసుకు రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతో మంది అమ్మాయిల పేర్లు కూడా బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఆరో సీజన్‌లోకి 'బుల్లెట్ బండి' పాటను ఆలపించి ఫేమస్ అయిన ప్రముఖ గాయని మోహన భోగరాజును తీసుకున్నారని తెలిసింది.

రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇచ్చి
ఫేమస్ సింగర్ మోహన భోగరాజు తెలుగులో వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నిర్వహకులు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి మరీ షోలోకి తీసుకు వస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఆమెను నేరుగా హౌస్‌లోకి పంపించరని.. వైల్డ్ కార్డ్ ద్వారా తీసుకు వెళ్తారని కూడా ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











