షాకింగ్.. బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ రెమ్యునరేషన్ 12 కోట్లు!

Recommended Video

షాకింగ్.. బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ రెమ్యునరేషన్ 12 కోట్లు!

ప్రముఖ నటుడు మోహన్ లాల్ బిగ్ బాస్ హోస్ట్ గా మారాడు. మోహన్ లాల్ హోస్ట్ గా వ్యవహరించిన మలయాళం బిగ్ బాస్ ఆదివారం నుంచి ప్రారంభమైంది. దిగ్గజ నటుడు తొలి సారి హోస్ట్ గా మారడంతో మలయాళీ బిగ్ బాస్ పై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు తమిళ భాషల్లో రెండవ సీజన్ సాగుతుండగా మలయాళంలో తొలి సీజన్ నిన్ననే ప్రారంభమైంది. మోహన్ లాల్ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

12 కోట్ల రెమ్యునరేషన్

12 కోట్ల రెమ్యునరేషన్

మలయాళీ బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ మొత్తాన్ని పారితోషకంగా ఆర్జిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మీడియాలో సర్కులేట్ అవుతున్న కథనాల ప్రకారం మోహన్ లాల్ ఈ షో కోసం 12 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి వాటికి నేను కొత్త

ఇలాంటి వాటికి నేను కొత్త

ఇలాంటి రియాలిటీ షోలకు తాను కొత్త అని మోహన్ లాల్ అన్నారు. మలయాళం బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మలయాళీ అభిమానుల అభిరుచికి అనుగుణంగా ఈ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తానని మోహన్ లాల్ తెలిపారు.

ఇతర షోలని గమనించా

ఇతర షోలని గమనించా

బిగ్ బాస్ షో రెండవ సీజన్స్ తెలుగు, తమిళ భాషల్లో కొనసాగుతున్నాయి. ఆ షోలని తాను గమనించానని మోహన్ లాల్ తెలిపారు. కొంత అవగాహన కోసం మాత్రమే వాటిని చూశానని, మలయాళం బిగ్ బాస్ లో తన సొంత పంథా లోనే హోస్టింగ్ చేస్తానని మోహన్ లాల్ తెలిపారు.

తెలుగు, తమిళ భాషల్లో

తెలుగు, తమిళ భాషల్లో నాని, కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన కమలే కొనసాగుతున్నారు. తెలుగులో తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్టింగ్ చేయగా, రెండవ సీజన్ కోసం నాని ఎంపికయ్యాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X