బిగ్‌బాస్ మలయాళం షో నిలిపివేత.. షాక్‌లో సెలబ్రిటీలు!
ప్రాణాంతక వ్యాధి కరోనావైరస్ కారణంగా బిగ్‌బాస్ మలయాళం రియాలిటీ షో సీజన్ 2 అర్ధాంతరంగా ముగిసింది. బిగ్‌బాస్ హౌస్‌కు, సెలబ్రిటీలకు ముప్పు ఉందనే భయాందోళనలతో ఈ షోను మధ్యలోనే ఆపివేశారు. మార్చి 20వ తేదీ రాత్రి హెస్ట్ సూపర్‌స్టార్ మోహనల్ లాల్ షోను నిలిపివేస్తున్నట్టు తెలియజేయగానే కంటెస్టెంట్లు షాక్ గురయ్యారు.
గత 75 రోజులకుపైగా హౌస్‌లో నివసిస్తున్న సెలబ్రిటీలకు కరోనావైరస్ విషయాన్ని వెల్లడించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. దేశంలోని పరిస్థితులను, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భయాందోళనలను వారికి మోహన్ లాల్ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల దృష్ట్యా షోను నిలిపివేయడానికి నిర్ణయం తీసుకొన్నామని వారికి మోహనల్ లాల్ చెప్పారు.

అనంతరం పది మంది సెలబిట్రీలకు ట్రోఫిని అందించి బిగ్‌బాస్ రియాలిటీ షో ముగిసినట్టు ప్రకటించారు. బిగ్‌బాస్ మలయళం సీజన్ 2 జనవరి 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా, కరోనావైరస్ ప్రమాదకరంగా మారడంతో ఈ రియాలిటీ షోను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎండెమాల్ షైన్ ఇండియా నిర్ణయం తీసుకొన్నది. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత షోను కొనసాగించే విషయంపై ప్రకటన చేస్తామని పేర్కొన్నది.
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృభిస్తుండటంతో రెండు రోజుల క్రితమే తమ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు, సాంకేతిక నిపుణులను తొలగిస్తూ నిర్ణయం తీసుకొన్నది. సిబ్బంది ఆరోగ్య కారణాల దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చింది.


Click it and Unblock the Notifications











