Naga Panchami 24th February: అలా చేస్తే పంచమి, మోక్షలు కలిసినా ఏం కాదట.. మెడికల్‌గా ప్రూవ్!
Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మేఘనను ఇంట్లోంచి పంపిస్తే సమస్య తొలగిపోతుందని భావించిన మోక్ష.. ఆమె వద్దకు వెళ్లి నువ్వు ఇంట్లోంచి వెళ్లిపో అని అంటాడు. కానీ మేఘన మాత్రం.. నాక్కూడా వెళ్లిపోవాలనే ఉంది, కానీ నన్ను పోకూడదని పంచమి ఒట్టు వేయించుకుందని చెబుతుంది. నా మీద ఒట్టు వేయించుకుంటే నేను వెళ్లిపోయేదాన్ని కానీ.. పంచమి తన తల మీద నా చేయి పెట్టించుకుంది.. అందుకే వెళ్లలేకపోతున్నానని వివరిస్తుంది.
అయినా నీకు ఇష్టం లేకుండా నా మెడలో తాళి కట్టలేవు కదా చూద్దాం అంటూ మేఘన అంటుంది. అవును కదా అని పంచమి మోక్ష నువ్వు పంచమిని ఏమైనా చూశావా ఉదయం నుంచి కనిపింట్లేదని అంటాడు. దానికి మేఘన ఉదయం బయటకు వెళ్తుండగా చూశాను అని చెప్పుకొస్తుంది. ఇదంతా విన్న మోక్ష సరే అని చెప్పి బయటకు వస్తాడు. ఇక మేఘనను మోక్షను ఎలాగైనా సరే పెళ్లికి ఒప్పించాలి, అప్పుడే నా పని సులువు అవుతుందంటూ మనసులో అనుకుంటుంది. దానికోసం ఓ ప్లాన్ కూడా వేయాలని ఆలోచిస్తుంది.

ఇక ఆ తర్వాత పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లడం.. స్వామి వారిని దర్శించుకోవడం కనిపిస్తుంది. నాకు నాగలోకం కూడా శత్రువుగా మారింది.. నువ్వే నా భర్తను కాపాడాలి స్వామి అంటూ కోరుతుంది. ఫణీంద్ర కూడా తన భర్తను చంపుతానని బెదిరిస్తున్నాడని, అలాగే కరాళీ కూడా ఎప్పుడు ఏం చేస్తుందో తెలీదని ఆవేదన చెందుతుంది. కళ్లు మూసుకోగానే ఆమెపై నెమిలి పించం పడుతుంది. ఆ తర్వాత సుబ్బు వచ్చి పంచమితో మాట్లాడతాడు. నీకు ఆ స్వామి వారే కావాలని ఈ పింఛాన్ని ఇచ్చినట్లు ఉన్నారని సుబ్బు చెబుతాడు. దీన్ని దాచుకో ఎలాంటి సమస్యా ఉండదని వివరిస్తాడు.

ఆ తర్వాత మోక్ష గుడికి వస్తాడు. నేను అనుకున్నాను.. నువ్వు ఇంట్లో లేవంటే ఇక్కడే ఉండి ఉంటావని అంటాడు. సుబ్బు వెంటనే సమయానికి వచ్చావు, పంచమిని బాగా అర్థం చేసుకున్నావు అంటూ మోక్షకు చెబుతాడు. స్వామి వారికి కష్టాలు చెప్పుకుంటే, సుబ్బుతో మాట్లాడితే నాకు చాలా హాయిగా అనిపిస్తుందని అంటుంది. ఆ తర్వాత సుబ్బు మాకు పని ఉందంటూ.. మోక్షను తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇంట్లో మేఘన కనిపిస్తుంది. ఆమెకు పంచమి ఇచ్చిన వార్నింగ్ ను గుర్తు చేసుకుంటూ మరింత కోప్పడుతుుంది.

ఆ తర్వాత నంబూద్రీ ఆత్మను రప్పించుకోగా.. ఇద్దరూ మోక్ష, పంచమిల గురించి మాట్లాడుకుంటారు. మోక్షను పెళ్లి చేసుకుని వెంటనే అడ్డు తొలగించుకోవాలని చెబుతుంది. అప్పటి వరకు పంచమికి అనుమానం రాకుండా ప్లాన్ చేయాలని అంటుంది. పంచమి చాలా అడ్డంకిగా ఉందని మోక్షను బలి ఇవ్వాలంటే కష్టమేనని వివరిస్తుంది. అందుకే వీలయినంత త్వరగా పంచమిని చంపెయ్యమని తన అన్న నంబూద్రీకి చెప్పగా.. నేను ఏదో ఒక పథకం ఆలోచిస్తానని అంటాడు. ఆ తర్వాత మేఘన తనలో తాను నవ్వుకుంటుంది.
ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలు విడాకులు ఇస్తానంటూ ఇంట్లోంచి వెళ్లిపోయేందుకు బయటకు వస్తారు. అంతోలనే కుటుంబ సభ్యులు అంతా వచ్చి ఏమైందని అడగ్గా.. ఆస్తి పంచుకుని వేరు కాపురాలు పెడదామని అంటున్నారని చెబుతారు. పంచమి ఉన్న ఇంట్లో మేము ఉండమని ఖరాఖండీగా చెప్పేస్తారు. ఆస్తులు ఎలాగూ ఇవ్వరని మేము కోర్టుకు వెళ్తున్నామని చెబుతారు. గేటు దాటితే తాట తీస్తానని, నిజంగానే కోర్టుకు వెళ్తే ప్రాణాలు తీస్తానని అంటుంది. ఆ తర్వాత శబరి అందరికీ గట్టి వార్నింగ్ ఇస్తుంది, పంచమి, మోక్షలను దూరం చేస్తే ఇంట్లో వాళ్లందరూ ఇంటికీ, ఆస్తికి దూరం కావాల్సిందేనని, అయ్యేలా చేస్తానని అంటుంది.
ఆ తర్వాత నేను మా అత్తకంటే రెండు ఆకులు ఎక్కువే చదివాను.. అంటూ వైదేహి చెప్పి ఇంట్లోంకి పదమని వివరిస్తుంది. ఇలా చిత్ర, జ్వాలలు ఇంట్లోకి వెళ్లగా.. భర్తలు కూడా వారి వెంటే వెళ్తారు. ఆ తర్వాత పంచమి.. కరాళీ అంతు చూసేందుకు వెళ్తానని అంటుంది. వద్దు అవసరం లేదని, తాను ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం కలిస్తే సమస్యే ఉండదని అంటారు. అందుకోసం శాస్త్రవేత్తల వద్దకు వెళ్లి తన విషాన్ని టెస్ట్ చేయించి.. తనతో కలిస్తే తనకు ఏం కాకుండా చేయొచ్చా అని అడుగుతాడు. అది సాధ్యమని చెప్పగానే పంచమి, మోక్షలు ఇద్దరూ తెగ సంబురపడిపోతారు.
Photo Credits: Disney+Hotstar


Click it and Unblock the Notifications











