Naga Panchami 30th January: మేఘననే పెళ్లి చేసుకుంటానంటున్న మోక్ష.. షాక్‌లో పంచమి!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతూ.. అనుక్షణం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. అయితే తాజా ఎపిసోడ్ లో మేఘన రూపంలో ఉన్న కరాళీ.. మోక్షను పెళ్లి చేసుకోవడానికి అదిరిపోయే ప్లాన్ వేసింది. ముఖ్యంగా నువ్వు పంచమినే పెళ్లి చేసుకో అని చెబుతుంది. మా అమ్మ ఒప్పుకోదు, నాకు పెళ్లి చేసే వరకు తను ఎవరి మాట వినదు అని మోక్ష అనగా.. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పండంటూ వివరిస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. ఆ తర్వాత పంచమితో ఉండచ్చని అంటుంది. పంచమికి అన్యాయం చేయద్దంటూ కళ్లబొల్లి మాటలు చెబుతుంది.

అవన్నీ విన్న మోక్ష సరేనని అంటాడు. అదే విషయాన్ని నేరుగా వెళ్లి కుటుంబ సభ్యులు అందరికీ వివరిస్తాడు. మోక్ష రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడం.. అందులోనూ మేఘనను అని చెప్పడంతో వైదేహి తెగ సంబుర పడిపోతుంది. ఇంట్లో వాళ్లంతా షాక్ కు గురవుతారు. ఇక ఆ తర్వాత ఆ విషయాన్ని మోక్షనే నేరుగా వెళ్లి పంచమికి చెబుతాడు. మీరు ఎవర్ని పెళ్లి చేసుకున్నా పర్లేదు కానీ మేఘనను మాత్రం వద్దని పంచమి చెబుతుంది. ఎందుకని మోక్ష అడగ్గా.. తాను కూడా నాలాగా ఓ నాగ కన్య అని అంటుంది. అయితే వెంటనే నేను కచ్చితంగా మేఘననే పెళ్లి చేసుకుంటానని మోక్ష చెబుతాడు. పంచమి షాక్ కు గురవుతుంది. ఇదంతా మనం ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

Moksha Decided to Marry Meghana on Naga Panchami January 30th Episode

ఇక నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా.. జ్వాలను తన భర్త పిలుస్తూ కనిపిస్తాడు. అప్పుడే నంబూద్రీ ఆత్మ వచ్చి ఆమెలోకి వెళ్తుంది. ఆ తర్వాత భర్తను తోసేసి మేఘన ధ్యానం చేసుకుంటూ ఉండగా.. నేరుగా ఆమె గదిలోకి వెళ్తాడు. అలా వెళ్లి తన చెల్లితో మాట్లాడతాడు. తన గురించి చెప్పి నువ్వు నన్న ఆవాహనం చేసుకుంటే తప్ప నీవు నన్ను చూడలేవని అంటాడు. అలాగే ఏదైనా ముఖ్య విషయం చెప్పాల్సి వస్తే ఇలా జ్వాలలోకి వచ్చి నిన్ను కలుస్తానని అంటాడు. అలాగే నా కళలను నేను ఎలాగూ నిజం చేసుకోలేకపోయాను నువ్వైనా చేసుకో అంటాడు. ఆ తర్వాత వెళ్లిపోతాడు.

ఇక తర్వాత మేఘను మోక్ష వద్దకు వెళ్లి పంచమిపై ప్రేమ నటిస్తూనే మోక్ష తననే పెళ్లి చేసుకుంటానని అందరితో చెప్పేలా చేస్తుంది. ఇక అక్కడి నుంచి ఆమె వెళ్లిపోగానే.. నాగ దేవతకు శేషరాజు కళలో కనిపిస్తాడు. నాగమణికి పుష్కర పూజ చేయాలని లేదంటే నాగలోకం అంతా అంధకారం అయిపోతుందని వివరిస్తాడు. వెంటనే నాగలోకపు యువరాణి వచ్చి ఆ పూజ చేస్తే తప్ప నాగలోకాన్ని ఎవరూ కాపాడలేరని అంటాడు. అందుకు నాగ దేవత త్వరలోనే యువరాణిని నాగలోకం తీసుకు వస్తామని పూజ కూడా చేయిస్తామని చెబుతుంది. త్వరలోనే పంచమిని నాగలోకం తీసుకు రావాలని ఆలోచిస్తుంది.

Moksha Decided to Marry Meghana on Naga Panchami January 30th Episode

ఇక దీని తర్వాత మోక్ష పంచమి వద్దకు వెళ్లడం చూపిస్తారు. నీకు నా మోహం కూడా చూడాలనిపించట్లేదా పంచమి అంటూ మోక్ష అడగ్గా.. పంచమి కన్నీరు పెట్టుకుంటుంది. నేను విషం, మీరు అమృతం.. మీరు ఒకరికి ప్రాణం పోయగలరు, నేను మాత్రం ప్రాణాలు తీస్తాను అంటూ చెబుతుంది. అలా ఏం లేదు పంచమి.. మనిద్దరం వేరైనా మన ప్రాణం ఒక్కటే అంటూ వివరిస్తాడు. అయినా ఆమె వినదు. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X