Naga Panchami: పంచమి తల్లి కాబోతుందా.. పౌర్ణమికి మోక్ష చావు తప్పదా.. ఏం జరగబోతుంది?
Naga Panchami November 18th Episode: నాగ పంచమి సీరియల్ రోజుకో రకమైన ట్విస్టుతో దూసుకు వెళ్తుంది. అద్భుతంగా సాగుతూ అందరినీ తెగ ఆశ్చర్యపరుస్తోంది. అయితే నిన్నటి ఎపిసోడ్ లో మోక్ష నాగ సాధువు దగ్గరకు వెళ్లడం అందరికీ తెలిసిందే. తనకోసం ఎంతగానో కష్టపడుతున్న భార్య పంచమి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఈక్రమంలోనే పంచమి పాముగా మారకుండా ఉండేందుకు ఏం చేయాలని అడగ్గా.. ఈ సృష్టిలో ప్రతీ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని నాగ సాధువు చెప్పాడు. అలాగే పంచమి పాముగా మారకూడదు అంటే ఆమె గర్భం దాల్చాలి అని వవరించాడు. ఆమె గర్భం దాలిస్తే.. లోపల మావ జాతి శిశివు ఉన్నందున ఆమె పాములా మారలేదని చెప్పాడు.
అలా అని ఇష్టరూప ధారిని నాగకన్య అయిన పంచమితో శారీరకంగా కలిస్తే.. ఓ వ్యక్తి ప్రాణాలు పోక తప్పవని నాగ సాధువు వివరించాడు. ఇలా చెప్పడంతోమోక్ష ఏం చేయాలా అని ఆలోచిస్తూ.. ఆయన వద్ద నుంచి సెలవు తీసుకొని వచ్చేస్తాడు. ఇదంతా ఇలా ఉండగా.. కరాళీ తన క్షుద్ర శక్తులతో మోక్ష ఇంటికి పంపిన భటులను సుబ్బు ఓ ఆట ఆడుకుంటాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా... సుబ్బు వెనక నుంచి పిలుస్తాడు. పిలుపు వినిపించగానే ఆ రెండు శక్తులు తీవ్రంగా భయపడిపోతాయి. ఎవరు అది అనగానే సుబ్బు వారికి కనిపిస్తాడు.

ఈక్రమంలోనే నీవెవరిని ప్రశ్నిస్తే.. పసిబాలుడిని అంటూ సుబ్బు చెప్పగా.. మేము ఎవరికీ కనిపించం కదా మరి నీకెలా కనిపిస్తున్నాం అంటూ వాళ్లు అడుగుతారు. మీరు ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను... వంట గదలో పాత్రలు చిందవవందర చేయాలని చూడడం, అలాగే బీరువాలోని డబ్బు, నగలను గదంతా పడేయడం అన్నీ చూశానని సుబ్బు అంటాడు. దానికి కరాళీ భటులు ఇద్దరూ భయపడిపోతారు. అదంతే ఏమీ లేదు. ఇదెదో శక్తిలా ఉందని అంటూనే స్వామి వారిపై పగ తీర్చుకోవాలనుకుంటారు. మా శక్తిని నువ్వు తట్టుకోలేవంటూ సవాల్ విసురుతారు. ఏదీ చూపించడి అనగా నోట్లోంచి మంటలు ఊదుతారు.
సుబ్బు వాటిని వారిపైకే పంపిస్తాడు. ఇలా భయపడిపోతూ చాలా సేపు తిరిగి వారి ప్రాణాలు కాపాడుకుంటారు. ఆ తర్వాత సుబ్బు పైకి తన చేతిలో ఉన్న బళ్లాలను లేపగా... స్వామి వారి శక్తికి అవి లేవకుండా అలాగే ఉండిపోతాయి. ఇక ఆ తర్వాత వాటితో ఒకరినొకరు కొట్టుకుంటారు. చాలా సేపు ఇలా జరిగాక.. అక్కడి నుంచి పారిపోతారు. మళ్లీ కరాళీ చెంతకు చేరుతారు. ఇదంతా ఇలా ఉండగా... పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లి స్వామి వారిని ప్రార్థిస్తుంది. తన భర్తను ఎలాగైనా సరే కాపాడాలని.. నాగులను ఆపే శక్తి ఒక్క సుబ్రహ్మణ్య స్వామికే ఉందని అంటుంది.
అలా దర్శనం చేసుకొని వచ్చి కూర్చుంటుందో లేదో ఓ పాము వస్తుంది. ఆ పాము ఫణీంద్రగా మారి పంచమి దగ్గరకు వస్తుంది. ఆమె భయపడిపోతుండగానే.. వచ్చే పౌర్ణమికి నీ భర్తను చంపి నిన్ను నాగ లోకం తీసుకెళ్లడం, నిన్ను పెళ్లాడడం జరగుతుందని మరోసారి అంటాడు. దీనికి కోపం తెచ్చుకున్న పంచమి కొట్టేందుకు చేయి లేపుతుంది. కానీ ఫణీంద్ర మాత్రం నవ్వుతూ నీవేం చేసిన పౌర్ణమి వరకే.. ఇక ఆ తర్వాత నాగలోకానికే వస్తావు అనగా.. నేను రాను నా తల్లితోనే ఆ బంధం పోయింది... ఇక జన్మంతా ఇక్కడే అంటుంది. ఈక్రమంలోనే మోక్ష గుడికి వస్తాడు. పంచమి దర్శనం అయిందా అని అడుగుతాడు. పక్కనే ఉన్న ఫణీంద్రను చూసి మీరెవరూ అనగా.. నేను పంచమికి దూరపు బంధువును అని అంటాడు.

తన పేరు చెప్పగా.. పదండి మా ఇంటికి వెళ్దామని మోక్ష చెబుతాడు. కానీ అతడు మాత్రం తాను మరెప్పుడైనా వస్తానని చెప్పి వెళ్లిపోగా.. వీరిద్దరూ దేవుడిని మొక్కుకొని ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత కరాళీ వద్దకు భటులు వచ్చి అక్కడేదో శక్తి ఉంది మేము ఉండలేకపోయామని చెబుతారు. ఏంటా శక్తి అనగా తెలీదు కానీ పసి పిల్లాడు.. అమోఘమైన శక్తులు ఉన్నాని అంటారు. వీరు భయపడ్డారంటే ఏదో పెద్ద శక్తే అయి ఉంటుంది.. తాను మరిన్ని శక్తులు సంపాధించి తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అంటుంది. అయితే శక్తుల కోసం ఈసారి మహంకాళిని కాకుండా ఎవరైనా గ్రామ దేవతలను కొలవాలనుకుంటుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.
అలాగే రేపటి ఎపిసోడ్ పంచమి, మోక్షలకు పెళ్లి రోజు వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలు తెస్తారు. ఇదే విషయాన్ని పంచమి, మోక్షలకు కూడా చెబుతారు. ఇంకెప్పుడు నాకో బుల్లి మనవరాలినో, మనవడినో ఇవ్వమని శబరి అడుగుతుంది. సేర అని మోక్ష చెబుతూనే.. శబరికి మాట ఇవ్వు పంచమి అంటూ చేతిలో చేయి వేస్తాడు. ఇక ఉదయం వేలవగానే పంచమి వాంతులు చేసుకుంటూ కనిపిస్తుంది. అది చూసిన శబరి.. పంచమి తల్లి అవుతోందనుకొని మురిసిపోవడం, పక్కనే ఉన్న మోక్ష కూడా చాలా ప్రేమగా ఛూడడం కనిపిస్తుంది. మరి ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











