Naga Panchami January 2nd: మోక్షను కాపాడబోయే పంచమి ఆత్మహత్య.. ఫణీంద్ర ఏం చేయబోతున్నాడు?
నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ఈ సీరియల్ సాగుతుండగా.. చాలా మంది ఆసక్తిగా ప్రతి రోజూ వచ్చే ఎపిసోడ్ లను చూస్తున్నారు. అయితే ముక్కోటి ఏకాదశి రోజు మోక్షను పాము కాటేసి చంపబోతుండగా.. అతడిని కాపాడాల్సిన పంచమియే ఆత్మహత్య చేసుకోబోతుంది. ముఖ్యంగా పంచమిని ఆమె అత్తగారు ఇంట్లోంచి వెళ్లగొట్టడంతో ఏం చేయాలో పాలుపోక.. మరోసారి సుబ్రహ్మణ్య స్వామి గుట్టకు బయలు దేరుతుంది. అడవిలోంచి అర్ధరాత్రి పరుగులు పెడుతూ వెళ్తుంది. ఏడుస్తూ వెళ్తూ కనిపించింది.
సుబ్రహ్మణ్య స్వామి వారి గుహకు వెళ్లగానే ఆయన పాదాలపై పడుతుంది. తన జీవితమే నాశనం అయిందని.. ఏం చేయాలో పాలుపోని పరిస్థికి వచ్చినట్లు స్వామి వారికి వివరిస్తుంది. తన జీవితం అంతా అంధకారం అయిపోయిందని.. ఇక తాను బతికి ఉండి ఎలాంటి ఉపయోగం లేదంటూ స్వామి వారి పాదాలపై తలను కొట్టుకుంటుంది. స్వామీ నీలో ఐక్యం చేసుకో అంటూ వేడుకుంటుంది. తలను విపరీతంగా స్వామి వారి పాదాలకు వేసి కొట్టుకోగా.. పంచమి స్పృహ తప్పి పడిపోయింది. అయితే ఆమె స్పృహ తప్పి పడిపోయిందా.. ప్రాణాలు కోల్పోయిందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే పంచమి ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్న ఫణీంద్ర.. మేఘన వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాడు. యువరాణి కనిపించట్లేదని చెప్తాడు. పంచమిని ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేస్తాడు. ఈక్రమంలోనే మేఘన నీకు మంత్ర శక్తులు తెలుసు కదా ఓసారి పంచమి ఎక్కడ ఉందో చూడు అని అంటాడు. ఈక్రమంలోనే మేఘన రూపంలో ఉన్న కరాళీ అంజనం వేసుకుని చూడగా.. అడవి, చెట్లు, పొదలు కనిపిస్తాయి. దీంతో ఫణీంద్ర భయపడిపోతాడు. యువరాణి ఆత్మహత్య చేసుకుందా అని అడగ్గా.. తాను చనిపోయి ఉంటే ఇలా కనిపించేది కాదని అంటుంది. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో మనం చూడవచ్చు.
ఇక నిన్నటి ఎపిసోడ్ లో పంచమి ఇంట్లోంచి వెళ్లిపోయిన విషయం తెలుసుకున్న మోక్ష విపరీతంగా ఏడుస్తాడు. తన బిడ్డ, బార్య అయిన పంచమిని ఇంట్లోంచి వెళ్లగొట్టి నా ప్రాణాన్ని తీస్తున్నావంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తాడు. తనను గండాల నుంచి కాపాడుకుంటూ వస్తుందే పంచమి అని.. తను లేకపోతే ప్రాణం ఉన్నా తాను చనిపోయినట్లేనని తల్లితో చెబుతాడు. పంచమి మాయలో పడి ఇలా చెప్పట్లేదని.. తనకోసం ప్రాణ త్యాగం చేసేందుకు ముందు వరుసలో ఉండే పంచమియే తన ప్రాణం అని అర్థం అయ్యేలా చెబుతాడు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అంటూ తల్లిని అంటాడు.

అదంతా విన్న కుటుంబ సభ్యులు కూడా పంచమిని ఇంట్లోంచి పంపించి పెద్ద తప్పే చేశావు వైదేహిపై ఫైర్ అవుతారు. ముఖ్యంగా మోక్ష తండ్రి.. క్షమించరాని పాపం చేశావు అనగా.. వైదేహి కన్నీరు పెట్టుకుంటుంది. మరోవైపు జ్వాల భర్త.. పంచమియే నీ కూతురు అయితే ఇలాగే చేసేదానివా అమ్మా అంటూ అడగ్గా సమాధానం చెప్పలేక మోక్ష తల్లి మరింత ఏడుస్తుంది. ఇలా మనిషికో మాట అంటూ అంతా అక్కడి నుంచి వెళ్లిపోతారు. మోక్ష మాత్రం ఓ చోట కుప్పకూలిపోయి కంటతడి పెడుతూ కనిపిస్తాడు.


Click it and Unblock the Notifications











