Naga Panchami 21st February: పంచమిని నాగలోకం తీసుకెళ్లాలని ఫణీంద్ర.. వీళ్లేదంటూ మోక్ష గొడవ!

Naga Panchami: నాగపంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. సినిమాను మించిన ట్విస్ట్ లతో సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇంతకాలం స్నేహితుల్లా కలిసి ఉన్న మోక్ష, ఫణీంద్రల మధ్య మళ్లీ గొడవ చెలరేగింది. ముఖ్యంగా కరాళీ మహాంకాళి అమ్మవారిని ఆవాహనం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేస్తోంది. మరోవైపు మోక్ష తన భార్య పంచమిని కాపాడుకోవడానికి.. తనతోనే జీవితాంతం ఉంచుకనేలా చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే పంచమితో చాలా కోపంగా మాట్లాడుతూ కనిపించాడు.

ముఖ్యంగా ఇంట్లోంచి మేఘనను వెళ్లగొట్టమని పంచమికి గట్టిగా చెప్పాడు. తనను ఇంట్లోంచి వెళ్లగొడతేనే మంచిదని.. ముందు ఆ పని చేయమంటూ వివరించాడు. తాను ఒక్క దానిని మాత్రమే కాకుండా.. నాగలోకపు యువరాజు ఫణీంద్రను కూడా ఇంట్లోంచి పంపించి వేయాలని వివరించాడు. ఇదంతా విన్న పంచమి.. అయోమయంగా చూస్తుండగా.. ఫణీంద్ర పాముగా మారి గదిలో ఉండి వారు మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాడు. ముఖ్యంగా తనను ఇంట్లోంచి వెళ్లగొట్టాలని పంచమికి చెప్పింది విని ఆగ్రహానికి గురయ్యాడు.

 Moksha Fight With Phanindra on Naga Panchami February 21st Episode

ఇక వెంటనే ఫణీంద్ర పాము.. మనిషి రూపంలోకి మారి పంచమితో మాట్లాడుతూ కనిపించాడు. నేను అనుకుంటే నిన్ను ఇప్పుడే నాగలోకం తీసుకెళ్లగలను.. పదా వెళ్లిపోదాం అంటూ పంచమితో వివరిస్తాడు. ఇదంతా విన్న మోక్ష నున్ను ఎవరు నా భార్యను నాగలోకం తీసుకు వెళ్లడానికి అంటూ ఫైర్ అయ్యాడు. పంచమి నా భార్య.. తనకు నాగలోకానికి ఎలాంటి సంబంధం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదంతా చూస్తున్న ఫణీంద్ర మరింత కోపంతో ఊగిపోతున్నాడు. మరోవైపు పంచమి వారిద్దరికీ నచ్చజెప్పాలని చూస్తోంది. రేపటి ఎపిసోడ్ వస్తే తప్ప పూర్తిగా ఏం జరిగిందో తెలియదు.

ఇక నిన్నటి ఎపిసోడ్ లో పంచమిపైకి కరాళీ.. తన మంత్ర శక్తి ద్వారా తోడేళ్లను పంపడం.. పంచమి సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోగానే ఆయన వజ్రాయుధం వచ్చి పంచమిని కాపాడాడం చూపిస్తారు. ముఖ్యంగా అదే వజ్రాయుధం.. పంచమి గాయాలను మాన్చి.. ఆమెకు స్పృహ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత మాయం అయిపోగా.. పంచమి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తుంది. ఇక మరోవైపు మోక్ష తల్లి వైదేహి కుటుంబ సభ్యులు అంతా పంచమి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

పంచమిని ఇంట్లోంచి పంపించి వేయమని వైదేహి చెబుతుండగా.. అదెలా కుదురుతుంది.. మోక్ష, మేఘనల పెళ్లికి మేము ఒప్పుకోమంటూ మిగతా వాళ్లు చెబుతారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుతూ రచ్చ చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర, జ్వాలలు.. పంచమి మాకు నచ్చలేదు విడాకులు ఇవ్వమని మోక్షకు చెప్పగా.. నాక్కూడా మీరు నచ్చలేరు, ఇంట్లోంచి వెళ్లిపోండి.. విడాకులు నోటీసులు మీ ఇంటికి పంపిస్తాం అంటూ మోక్ష సమాధానం చెబుతాడు. ఇలా గొడవ జరుగుతునే ఉంటుంది.

 Moksha Fight With Phanindra on Naga Panchami February 21st Episode

మరోవైపు పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్లగా.. సుబ్బు కనిపిస్తాడు. మోక్షకు కరాళీ ఒక్కతే శత్రువు అని.. తన అడ్డు తొలగిస్తే ఇక మోక్ష చాలా హాయిగా, సంతోషంగా ఉంటాడని వివరిస్తుంది. ఇదంతా విన్న సుబ్బు అయితే నీ ప్రయత్నాలు నీవు చేయు అని అంటూ చెబుతాడు. కానీ నువ్వు ఇప్పుడు ఇన్ని కష్టాలు ఎదుర్కుంటున్నావంటే.. ముందు ముందు మరిన్ని పెద్ద కష్టాలు రాబోతున్నాయని అర్థం అని చెబుతాడు. అది విన్న పంచమి లోలోపల భయపడుతూనే.. కరాళీని ఎలా అడ్డుకోవాలా అని ఆలోచిస్తుంది.

మరోవైపు కరాళీ... తన మంత్ర శక్తులతో కంత్రి, తంత్రీలను రప్పిస్తుంది. మహాంకాళి పూజకు అన్నీ సిద్ధం చేయమని చెబుతుంది. వారన్నీ సిద్ధం చేయగా.. అక్కడకు వెళ్లి పూజకు పూనుకుంటుంది. అమ్మవారిని ఆవాహనం చేసుకుని నెక్ట్స్ట్ ఏం చేయబోతుందా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఏం జరగనుంది ముందు ముందు అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X