Naga Panchami: హగ్గులు, కిస్సులు వద్దంటున్నావ్, ప్రేమ చూపిస్తున్నవ్ - పంచమిపై మోక్షకు డౌట్!

Naga Panchami October 22nd Episode: పాముల నేపథ్యంలో వస్తున్న ఏ సీరియల్ అయినా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తోంది. ముఖ్యంగా నాగపంచమి సీరియల్ కు అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. అదిరిపోయే ట్విస్టులు అంతకు మించిన ఎగ్జైట్ మెంట్ తో అదిరిపోయేలా ఎపిసోడ్స్ చేస్తున్నారు. వీటిని చూసేందుకు ప్రేక్షకులు కూడా తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో ముందుగా నంబూద్రీని చూపిస్తారు. అతను ఆనందంతో గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అక్కడకు వచ్చిన కరాళీ.. ఏంటి అన్నయ్య ఇంత సంతోషంగా ఉన్నావని ప్రశ్నిస్తుంది.

దానికి నంబూద్రీ... మన కోరిక తీరబోతుంది.. మనం అనుకున్నది సాంధించబోతున్నాం.. మోక్ష ఇంటికి వెళ్లిన గరుడు.. పంచమి నిజ స్వరూపాన్ని బయట పెడతాడు. ఆమె పాము అని అందరికీ తెలిసేలా చేస్తాడని అంటాడు. ఈక్రమంలోనే కరాళీ.. మనం పంచమిని అంత తక్కువ అంచనా వేయకూడదని చెబుతుంది. కానీ నేను పంపింది అలాంటి ఇలాంటి వాడిని కాదు, ఎన్నో శక్తులు కల్గిన గరుడిని అని చెప్పగా ఇద్దరూ తెగ సంబరపడిపోతారు. వెంటనే నంబూద్రీ గరుడని మంత్ర శక్తితో చూసి మాట్లాడతాడు.

Moksha gets suspicious of Panchami on October 22nd Episode Number 181 in Naga Panchami Telugu Serial

గరుడా.. పంచమికి విపరీతమైన కోపం తెప్పిస్తే ఆమె రూపం బయటపడుతుంది. పంచమి పాముగా మారుతుంది.. ఇంట్లో వాళ్ల అందరికీ ఆమె పాము అని తెలిసేలా చేయు అని అంటాడు. గరుడు సరే అని చెప్పి.. పంచమి కోసం వెతుకుతుంటాడు. ఈక్రమంలోనే శిశిరను కింద పడేస్తాడు. ఆపై కిచన్ లోకి వెళ్లి చిత్రతో గొడవ పడతాడు. అలా చివరకు గార్డెన్ లో ఉన్న పంచమి వద్దకు వెళ్లి.. నీవు పామని నాకు తెలుసు, నేను వచ్చింది నీకోసమే అని అంటాడు. ఈక్రమంలోనే గరుడ, పంచమిలు గొడవ పడతారు.

ఇద్దరి మధ్య పెద్ద ఫైటింగ్ యే జరుగుతుంది. అయితే గరుడ.. పంచమి మెడ పట్టుకొని పైకి లేపుతాడు. అది చూసిన మోక్ష వచ్చి అతడిని తీవ్రంగా కొడతాడు. పంచమిని కాపాడుకుంటాడు. అప్పటికే కుటుంబ సభ్యులు అందరూ అక్కడకు వచ్చేస్తారు. ఇక తన భార్యను ఎందుకు కొట్టావని మోక్ష గరుడను ప్రశ్నించగా... ఆమె పాము అని చెబుతాడు. కాటేసే కాలనాగు అంటూ ఫైర్ అవుతాడు. దీనికి మోక్ష.. ఇష్టం వచ్చినట్లుగా మాట్లడకు, తప్పు చేయడం, ఇలా తప్పించుకోవడం సరికాదని చెబుతూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. వారి వెనకాలే ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులు పంచమిపై ఫైర్ అవుతారు.

Moksha gets suspicious of Panchami on October 22nd Episode Number 181 in Naga Panchami Telugu Serial

నువ్వు నిజంగానే పామువు కదా... కాబట్టే నువ్వు పరిచయం అయినప్పటి నుంచి పాములు ఇంట్లో తిరుగుతున్నాయని అంటారు. పంచమి మాత్రం నోరు మెదపదు. శబరి, చిత్ర, జ్వాల, వారి భర్తలతో పాటు మోక్ష తల్లి కూడా పంచమిపై కోప్పడుతుంది. ఈక్రమంలోనే మోక్ష అక్కడకు వచ్చి ఎవరో ఏదో అన్నారని పంచమని ఇలా అడగడం సరికాదని చెబుతాడు. తనను తీసుకొని రూంలోకి వెళ్లిపోతాడు. అక్కడికి వెళ్లాక అతను నిన్ను పాము అని ఎందుకు అన్నాడని మోక్ష అడుగుతాడు.

పంచమి మాత్రం నోరు మెదపదు. అది చూసిన మోక్ష.. నేను దగ్గరకు వస్తే దూరంగా వెళ్తున్నావు, ప్రేమ చూపిస్తున్నావ్, ఎంత సహనం ఉందో.. అంతకు మించి నీలో ఉగ్రరూపం కనిపిస్తోంది.. నాకెదో అనుమానంగా ఉంది పంచమి అంటూ చెబుతాడు. ఇందుకు పంచమి.. నేను కారణం ఇప్పుడు చెప్పే పరిస్థితిలో లేను.. కానీ సమయం వస్తే మీకే తెలుస్తుందంటూ గది నుంచి బయటకు వచ్చేస్తుంది. మెట్లపై కూర్చొని కన్నీరు పెట్టుకుంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X