Naga Panchami: పంచమిని బాగా చూసుకోమంటూ కుటుంబ సభ్యులకు మోక్ష అప్పగింతలు.. ఏం జరగబోతుంది?
నాగ పంచమి పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. అదిరిపోటే ట్విస్ట్ లతో అంతకు మించినఎమోషన్స్ పండించడంలో సఫలం అవుతున్నారు సీరియల్ నిర్వాహకులు. తాజా ఎపిసోడ్ లో పంచమి, మోక్షల పెళ్లి రోజును ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈక్రంలోనే పూజ చేసి వారిద్దరికీ మళ్లీ పెళ్లి చేశారు. ముఖ్యంగా దండలు మార్చుకున్నారు. ఈక్రమంలోనే పూజ అనంతరం భర్త పాదాలకు దండం పెట్టుకున్న పంచమి.. దీర్ఘసుమంగళీ భవ అని దీవించమంటే... మోక్ష మాత్రం చాలా సేపు ఆలోచించి మరీ సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాడు. అందరూ షాకింగ్ గా చూశారు.
ముఖ్యంగా మోక్ష తాను ఉన్నా లేకున్నా భార్యను చక్కగా చూసుకోవాలని చెబుతూ.. మోక్షకు పంచమి బాధ్యతలను అప్పగించాడు. మీరే ఆయన తనను చక్కగా చూసోకావలని చెప్పగా.. కుటుంబ సభ్యులు అంతా ఏడుస్తూ కనిపించారు. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో మాత్రం ముందుగా కుటుంబ సభ్యులు అంతా కలిసి నిర్వహించిన డ్యాన్స్ లో పాల్గొన్నారు. అంతా తమకు వచ్చిన చీటీలు తీసుకుంటూ డ్యాన్స్ చేయగా... పంచమికి మాత్రం కావాలనే చిత్ర, జ్వాలలు నాగిని డ్యాన్స్ ఇచ్చారు. పాట ప్లే చేయగానే పంచమి కూడా నాగిని డ్యాన్స్ చేసింది.

అది చూసిన అందరూ తెగ టెన్షన్ పడిపోయారు. చాలా కోపంగా చూస్తూ అలా స్టెప్పులు వేయడంతో మోక్ష కూడా భయపడిపోయి.. వెంటనే పంచమి వద్దకు పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు. పంచమి కుటుంబ సభ్యులతో పాటు నేను నీకు కూడా చెప్పానంటూ వివరిస్తాడు. నువ్వు తరచుగా బాధ పడుతూ నన్ను బాధ పెట్టకు అని చెబుతాడు. నేను ఉన్నన్ని రోజులు నీతో చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నానని చెప్పుకొస్తాడు. దానికి పంచమి భర్తకు ఏమైపోతుందోనని టెన్షన్ గా చూస్తుంది. అంతలోపే అతడు గదిలోంచి వెళ్లిపోతాడు.
మోక్ష వెళ్లగానే.. యువరాజు ఫణీంద్ర ప్రత్యక్షం అవుతాడు. మోక్ష నిన్ను తాకాలనుకోవడం, పిల్లల్ని కనాలనుకోవడం సరికాదని... అలాంటి ప్రయత్నం చేసే ఈరోజే నేను అతడిని కాటేసి చంపేస్తానని అంటాడు. అలాంటి పిచ్చి పనులు ఏవీ చేయకపోతే పౌర్ణమి వరకు ఉంటాడు.. అప్పుడు నీ చేతిలో చస్తాడు, నిన్ను తాకాడు అంటే ఈరోజే నా చేతిలో చస్తాడని అంటాడు. పంచమి అలా చేయద్దంటూ హెచ్చరించగా... మోక్షను చంపాకే నేను మిమ్మల్ని నాగ లోకానికి తీసుకెళ్తానని.. మీ పవిత్రతకు ఏమాత్రం ఆటంకం కల్గినా నేను సహించనని వివరిస్తాడు. అలాగే నాగలోకానికి వెళ్లాకా మనిద్దరికి పెళ్లి అని యువరాజు చెప్పగా.. ఎన్ని జన్మలు ఎత్తినా అది మాత్రం జరగదని పంచమి ఫైర్ అవుతుంది.
యువరాజు వెళ్లిపోగానే.. చిత్ర, జ్వాలలు గదిలోకి వస్తారు. మోక్షను చనిపోవడం గురించి ఇంట్లో వాళ్లకు పెద్దగా బెంగ లేదని.. నువ్వు కూడా అంతగా టెన్షన్ పడొద్దని పంచమికి చెబుతారు. అతడు చనిపోతాడని అంతా ఎప్పుడో ఫిక్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడేం జరిగినా మనం ఏమీ చేయలేమంటూ వివరిస్తారు. ఇక ఆ తర్వాత మోక్ష.. తనలో తాను మాట్లాడుకుంటూ కనిపిస్తాడు. పంచమిని తల్లి చేసి చావడం కంటే.. కార్తీక పౌర్ణమి రోజు ఆమె నుంచి తప్పించుకుంటే మరికొంత కాలం అయినా బ్రతకొచ్చు కదా అంటూ ఆయన అంతరాత్మ చెబుతుంది. కానీ మోక్ష మాత్రం నా చావు తథ్యం, పంచమికి పిల్లలు పుడితేనైనా తాను సంతోషంగా ఉంటుందని అంటాడు. కానీ అంతరాత్మ మాత్రం పంచమి నీ చావును అస్సలే ఒప్పుకోదని అంటాడు.
ఇక ఆ తర్వాత భర్త మాటలను తలుచుకుంటూనే పంచమి బాధ పడుతూ కనిపిస్తుంది. పెళ్లి రోజు కోసం పట్టుబట్టలు కట్టుకొని ముస్తాబై మరీ దిగులుగా ఉంటుంది. అప్పుడే మోక్ష వచ్చి పంచమి కళ్లు మూస్తాడు. మోక్ష బాబు అని ఆమె పిలవగానే నీకోసం ఎరవరిని తీసుకు వచ్చానో చూడంటూ తన తల్లిని చూపిస్తాడు. వెంటనే పంచమి తల్లి వద్దకు పరిగెత్తి హత్తుకుంటుంది. నన్ను చిన్న పిల్లని చేసి కడుపులో పెట్టేసుకో అమ్మా... అప్పుడైనా భయాలు, బాధలు ఉండవు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కొన్నాళ్లే ఈ కష్టాలు అంటూ తల్లి ఊరడించినా ఆమె మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఇలా ఈరోజుటి ఎపిసోడ్ పూర్తవుతుంది.


Click it and Unblock the Notifications











