Naga Panchami Today: వ్రతం పూర్తి చేసిన పంచమి.. ఫలితం ఏమిటంటే?

Naga Panchami October 17th Episode: మోక్ష బాగు కోసం పంచమి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఓవైపు నంబూద్రీ కరాళీలు సృష్టించిన సమస్యలను దాటుకొని, చిత్ర, జ్వాలల ప్రయత్నాలను తిప్పికొట్టి పంచమి ఎట్టకేలకు వ్రతం పూర్తి చేసింది. పాలకావిడి మోసుకుంటూ వెళ్లిన పంచమికి కరాళీ భటులు... దారిలో ముళ్ల కంపలు వేశారు. అయినా వాటన్నిటినీ భరిస్తూనే పంచమి సుబ్రహ్మణ్య స్వామి గుట్టకు చేరుకుంది. తీసుకెళ్లిన పాలతో స్వామి వారికి అభిషేకం చేసింది. ఈక్రమంలోనే ఉపవాసం ఉండి పూజ చేయడం వల్ల కళ్లు తిరిగి పడిపోతుంది.

మరోవైపు నంబూద్రీ.. మోక్ష ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తాడు. పంచమి చేసిన వ్రతం వల్ల మోక్ష బాగు అవుతాడు. కానీ నంబూద్రీ తాను చేసిన పూజ వల్లే మోక్ష బాగయ్యాడని అంటాడు. అలాగే మోక్ష కుటుంబ సభ్యులు కూడా నంబూద్రీ వల్లే నీవు బాగయ్యావంటూ చెబుతారు. మరోవైపు పంచమి కళ్లు తరిగి పడిపోయి ఉండడం చూపిస్తారు. ఆ తర్వాత సుబ్బు వచ్చి పంచమి మొహంపై పాలు చల్లుతాడు. ఈక్రమంలోనే కళ్లు తెరిచి చూస్తుంది. పూజ పూర్తి చేశానో లేదోనని తెగ టెన్షన్ పడుతుంది. కానీ సుబ్బు మాత్రం.. నీ పూజ పూర్తి అయింది, నీ వల్ల స్వామి సంతృప్తి చెందాడని చెబుతాడు.

Naga Panchami October 17th Episode

ఆ తర్వాత పంచమి ఇంటికి వెళ్తానని అంటుంది. కానీ నిన్ను కుటుంబ సభ్యులు వద్దు అన్నారు కదా అంటూ వివరిస్తాడు. అయినప్పటికీ మోక్ష బాగును తాను చూడాలని పరుగున వస్తుంది. ఆ తర్వాత బాగైన మోక్షను కుటుంబ సభ్యులు అంతా దగ్గరకు తీసుకుంటారు. మోక్ష బాగయ్యాడంటూ సంబర పడిపోతారు. ఈక్రమంలోనే మోక్ష.. పంచమి ఏదని ప్రశ్నించగా.. తన వల్లే నీవు పిచ్చి వాడివి అయ్యావంటూ ఫైర్ అవుతారు. పంచమి గురించి చెప్పకుండా నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారు. కానీ శిశిర మాత్రం పిన్ని గురించి నేను చెబుతానంటూ మోక్ష బయటకు తీసుకువస్తుంది.

అలా బయటకు వచ్చి కూర్చున్నప్పుడు.. మోక్ష పిచ్చి వాడిగా ఉన్నప్పుడు.. పంచమి చూపించిన ప్రేమను వీడియోగా తీస్తుంది. దాన్ని చూపించగా మోక్ష కంటతడి పెడతాడు. అప్పుడే పంచమి ఇంటికి వస్తుంది. పంచమిని చూసిన మోక్ష... వెంటనే వెళ్లి ఆమెను హగ్ చేసుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది. అయితే రేపటి ఎపిసోడ్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి పంచమిని ఇంట్లోంచి వెళ్లిపోవాలని అంటారు.

Naga Panchami October 17th Episode

నీవల్లే మోక్ష ఇలా అయ్యాడు.. ఇంకా నీవు ఇంట్లోనే ఉంటే మోక్ష ప్రాణాలకే ప్రమాదం అని మోక్ష తల్లి అంటుంది. చిత్ర, జ్వాలలు కూడా వంత పాడతారు. మరోవైపు పంచమి.. తన భర్త మోక్షకు ప్రాణగండం ఉందని, తాను లేకపోతే అతని ప్రాణాలకే ప్రమాదం అని అంటుంది. కానీ మోక్ష తల్లి పంచమి మెడ పట్టుకొని బయటకు గెంటాలని చూడగా.. మోక్ష అడ్డుకుంటాడు. పంచమి గురించి తప్పుగా మాట్లాడితే తల్లి, తండ్రి, అన్న, వదిన అని కూడా చూడనంటూ వార్నింగ్ ఇస్తాడు. ఇక ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X