Naga Panchami: పంచమి జన్మరహస్యం తెలుసుకున్న మోక్ష.. నాగలోకానికి పంపిస్తాడా, తనతోనే ఉంచుకుంటాడా?

Naga Panchami November 3rd Episode: నాగ పంచమి సీరియల్ అత్యద్భుతంగా సాగుతోంది. రోజురోజుకూ ఈ సీరియల్ లో చోటు చేసుకునే సంఘటనలతో ప్రేక్షకుల మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఒక్క రోజుటి ఎపిసోడ్ కూడా మిస్ అవకుండా సీరియల్ ను చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా పంచమియే పాము అని మోక్షకు తెలిసిపోయిన విషయం అందరికీ తెలిసిందే. తన కళ్ల ముందే పాము పంచమిగా మారడం చూసిన మోక్ష భయంతో గజగజా వణికిపోతున్నాడు. పంచమిని తాకేందుకు కూడా వెనకడుగు వేస్తున్నాడు. ఈక్రమంలోనే ఆమె గురించి పూర్తిగా తెలుసుకునేందుకు స్వామి దగ్గరకు వెళ్తాడు. ఆయనే పంచమి గురించి అసలు నిజం చెప్పేస్తాడు.

పంచమి జన్మ రిత్యా పాము అని మోక్షకు వివరిస్తాడు. అయితే నిన్ను చంపితే తప్ప పంచమికి నాగ లోక ప్రవేశం లేదని చెబుతాడు. మిమ్మల్ని చంపితేనే.. నాగ దేవత పంచమిని నాగ లోకానికి రానిస్తుందని అంటాడు. అయితే తనను చంపకపోతే.. పంచమి మళ్లీ నాగలోకానికి వెళ్లే అవకాశమే లేదా అని మోక్ష అడుగుతాడు. అందుకు స్వామి లేదని చెబుతాడు. ఇది మీ ఇద్దరి జీవన్మరణ సమస్య అని స్వామీజీ చెప్పగా.. మోక్ష కూడా మేమిద్దరమే ఈ విషయం తేల్చుకుంటామని అంటాడు. ఇదంతా ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

Moksha Knows The Secret of Panchamis Birth November 3rd Episode Number 191 in Naga Panchami Telugu Serial

అయితే నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా పంచమి తన తల్లితో మాట్లాడడం చూపిస్తారు. తల్లికి కూడా తన గురించి నిజం తెలిసిపోయిందని పంచమికి తెలుస్తుంది. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తన వద్దకు రావాలని తల్లి చెప్పగా.. పంచమి సరే నంటుంది. అప్పటి వరకు నీవు టెన్షన్ పడొద్దని చెబుతుంది. ప్రస్తుతం తాను బాగానే ఉన్నానని.. ఎలాంటి సమస్య లేదని వివరిస్తుంది. శివయ్యే మనకు అండగా ఉంటాడు, నీవు నా వద్దకు వచ్చెయ్ అని పంచమి తల్లి చెబుతుంది. ఇక ఆ తర్వాత పంచమి మోక్షకు ఫోన్ ఇవ్వబోతుండగా.. అతడు భయపడిపోతాడు. పంచమిని ముట్టుకునేందుకే గజగజా వణికిపోతాడు.

ఈక్రమంలోనే పంచమి తాను ఊరెళ్లిపోతానని అంటుంది. నేను ఈ లోకంలో ఉండడానికే అర్హురాలిని కాదని, ఇక్కడ ఉండి అందరికీ సమస్యలు తేవడం కంటే తాను వెళ్లిపోవడమే మంచిదని చెబుతుంది. ఇందుకు మోక్ష నీవలా వెళ్లిపోతాననడం కరెక్టు కాదని, ఉండాలా, వద్దా అని తేల్చాల్సింది తానేనని అంటాడు. తనకు అసలు విషయాలు బోధపడే వరకు.. ముఖ్యంగా నేను చెప్పే వరకు నీవు ఇక్కడే ఉండాలంటూ పంచమితో అంటాడు. ఇక ఆ తర్వాత చిత్ర, జ్వాలలు కలిసి ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తారు. కుటుంబ సభ్యులు అందరినీ పిలిచి రాత్రి మళ్లీ మన ఇంటికి పాము వచ్చిందని వివరిస్తారు.

Moksha Knows The Secret of Panchamis Birth November 3rd Episode Number 191 in Naga Panchami Telugu Serial

మోక్షను చంపేందుకే వచ్చిందని మేము రాత్రి ఎవరికీ చెప్పలేదనగా.. మోక్ష తల్లి వారిని తిడుతుంది. నిజంగానే మీకు మోక్ష మీద ప్రేమ ఉంటే రాత్రే వాడికి పిలిచి చెప్పాల్సింది అని శబరి చెబుతుంది. ఇక తర్వాత మోక్ష కూడా పాము వచ్చినప్పుడు ఇంట్లో పంచమి లేదని అంటాడు. పైన కెళ్లి ఉంటుందేమే అంటూ వివరిస్తాడు. తనపై పాముకు ఎందుకు అంత కోపమో తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు వివరిస్తాడు. పాముల్లో ఇంత పగ ఉంటుందని రాత్రే తెలిసింందంటూ వివరిస్తాడు. అప్పుడే పంచమికి కూడా తాను మోక్షను చంపబోయినట్లు అర్థం అవుతుంది. ఇంతటితో నిన్నటి ఎపిసోడ్ పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X