Naga Panchami: విరూపాక్ష సినిమా కంటే ఎక్కువ ట్విస్టులు, పంచమే పామని తెలుసుకున్న మోక్ష ఏం చేయబోతున్నాడు?

Naga Panchami November 2nd Episode: నాగ పంచమి సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ప్రతిరోజూ చోటు చేసుకునే ట్విస్టులు చూస్తుంటే విరూపాక్ష సినిమానే గుర్తుకు వస్తుంది. ఆ సినిమాకు మించిన ట్విస్టులతో సీరియల్ ను చాలా రసవత్తరంగా మలుస్తున్నారు. ఏమాత్రం సాగదీత లేకుండా అద్భుతమైన ఔట్ పుట్ ను అందిస్తున్నారు. ఇటీవలే పాముగా మారిన పంచమి.. తన శత్రువు నంబూద్రీని చంపడం, భర్త మోక్షను కూడా చంపేందుకు రావడం అద్భుతంగా ఉంది. అయితే పాము బారి నుంచి తప్పించుకున్న మోక్షకు తన భార్య గురించి అసలు విషయం తెలిసిపోయింది. పంచమియే పాము అని గుర్తించాడు. కళ్లారా పాము రూపంలోంచి ఆమె మనిషిగా మారడం చూసిన మోక్ష ఇప్పటికీ వణికిపోతూనే ఉన్నాడు.

అయితే ఈ విషయం మాత్రం పంచమికి ఇంకా తెలియదు. కుటుంబ సభ్యులు అందరూ పిలిచి పంచమి విషయం గురించి మాట్లాడగా.. మోక్ష ఓ నిర్ణయం తీసుకున్నాడు. మరో రెండ్రోజులు ఆగితే తనపై పగ బట్టిన పాము గురించి తెలుస్తుందని.. పౌర్ణమి రోజే తనపై ఓ పాము అటాక్ చేసినట్లు వివరిస్తాడు. ఆ పాముతోనే తన జీవితం ముడి పడి ఉందని.. అసలు విషయం తెలుసుకుని ఈ సమస్యలన్నింటికి చెక్ పెడతానని వివరిస్తాడు. మరోవైపు మోక్ష చెబుతున్న మాటలు విన్న పంచమికి తన గురించే మాట్లాడుతున్నట్లు అర్థం అవుతుంది. ఈక్రమంలోనే భయం భయంగా చూస్తూ ఉంటుంది. దీనంతటిని ఈరోజుటి ఎపిసోడ్ లో చూడవచ్చు.

Moksha Takes A Decision About Panchami in November 2nd Episode Number 190 in Naga Panchami Telugu Serial

అయితే నిన్నటి ఎపిసోడ్ లో.. చిత్ర, జ్వాలలు వచ్చి మోక్ష, పంచమిల గది తలుపులు కొడతారు. వారు చనిపోయి ఉంటారని భావించిన వీరిద్దరూ చాలా సేపు తలుపులు బాదుతూనే ఉంటారు. కానీ అప్పటికే పాము రూపంలోంచి పంచమి మనిషిగా మారడం చూసిన మోక్ష విపరీతంగా భయపడిపోతూ ఉంటాడు. ముందుగా పంచిమి లేపాలని చూస్తాడు. కానీ ఆలోపే పంచమి లేవడం, చిత్ర-జ్వాలలు తలుపులు కొట్టడం జరుగుతుంది. అయితే వెంటనే మోక్ష వెళ్లి తలుపులు తీస్తాడు. ఏమైంది పడుకోలేదా, ఇలా టెన్షన్ పడిపోతే ఎలా అంటూ మోక్షను అడిగిన చిత్ర, జ్వాలలు అక్కడి నుంచి వెళ్లిపోతారు.

నంబూద్రీ ఆత్మతో మాట్లాడిన కరాళీ: ఇక ఆ తర్వాత కరాళీ నంబూద్రీ శవాన్ని భద్రపరుస్తూ కనిపిస్తుంది. దివ్య లేపనాలు పూస్తూ.. మృతదేహం పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాగైనా సరే తనను అన్నను బతికించుకోవాలని కోరుకుంటుంది. ఈక్రమంలోనే నంబూద్రీ ఆత్మ కనిపించి.. నాగమణి మాత్రమే తనను కాపాడగలదని.. లోకంలోని మరే శక్తి తన ప్రాణాలను తిరిగి తీసుకు రాదని వివరిస్తుంది. అయితే ఏం చేసైనా, ఎంత మందిని చంపి అయినా సరే తన అన్నను బతికించుకుంటానని.. కరాళీ శపథం చేస్తుంది. అంతటితో నంబూద్రీ ఆత్మ వెళ్లిపోగా.. నాగమణిని సాధించేందుకు ఏం చేయాలా అని కరాళీ ఆలోచిస్తూ ఉంటుంది.

Moksha Takes A Decision About Panchami in November 2nd Episode Number 190 in Naga Panchami Telugu Serial

ఇకఆ తర్వాత మోక్ష పంచమిని, పామును గుర్తు చేసుకుంటూ భయపడిపోతూనే ఉంటాడు. ఏం చేయాలా అని ఆలోచిస్తాడు. ప్రాణంగా ప్రేమించిన భార్య పాము అని తెలిసి ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టాలా వద్దా అని కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పంచమి బయట నిల్చొని రాత్రి ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. మోక్ష ఉదయం లేవగానే తనను బయపడుతూ ఎందుకు చూశాడా అని అనుకుంటుంది. పాముగా మారానా, మరెందుకు మోక్షను చంపలేదని గుర్తుతెచ్చుకునే ప్రయత్ని చేస్తుంది. ఇంతలోపే మోక్ష పంచమి వద్దకు వచ్చి మీ అమ్మ ఫోన్ చేసిందని చెబుతాడు. ఫోన్ మాట్లాడిన తర్వత ఇద్దరూ వెళ్లిపోతారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X