Naga Panchami: నంబూద్రీని బతికించేందుకు కరాళీ క్షుద్రపూజలు.. మోక్ష ఏం చేయబోతున్నాడంటే?

Naga Panchami November 7th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అందరినీ ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా పంచమి గురించి తెలుసుకున్న మోక్ష ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా పంచమి జన్మ రహస్యం తెలుసుకున్న మోక్ష.. పంచమితోనే తన జీవితం ఏంటని తేల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈక్రమంలోనే పంచమి దగ్గరకు వెళ్లిన మోక్ష.. ఒకప్పుడు నీ రూపం నా గుండెల్లో ఉండేది. కానీ నా ముందే నువ్వు పాము నుంచి మనిషి రూపంలోకి మారడం చూసిన నాకు... నిన్ను చూస్తేనే భయం వేస్తుందని చెప్పాడు.

పాము రూపం చూశాకా.. నీ అసలు రూపం నా గుండెల్లో బద్ధలు అయిందని మోక్ష తెలిపాడు. అలాగే దాన్ని ఎంతగా అతికించి చూద్దామన్నా అది తన వల్ల కావట్లేదని... జీవితాంతం ఇలాగే ఉండడం కష్టం అంటూ వివరిస్తాడు. వాస్తవానికి నేను నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానంటూ చెప్పుకొస్తాడు. అది వింటుకున్న పంచమి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కానీ మోక్ష మాట్లాడినదానికి ఏమాత్రం అడ్డు చెప్పదు. అయితే పూర్తిగా ఏం జరిగిందో తెలియాలంటే మాత్రం ఈరోజుటి ఎపిసోడ్ చూడాల్సిందే. ఇదంతా ఇలా ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Moksha Talking With Panchami About Their Future on November 7th Episode Number 193 in Naga Panchami Telugu Serial

నిన్నటి ఎపిసోడ్ మొదలు కావడమే... మోక్ష, పంచమి గురించి తెలుసుకుంటూ కనిపిస్తాడు. పంచమి కారణ జన్మురాలని, ఆమె ఏదో ఒక కార్యం చేసేందుకు మనిషి జన్మలో పుట్టిందని స్వామీజీ వివరిస్తాడు. అలాగే ఆమె మనిషి రూపంలో పుట్టి సాంబయ్య చెంతకు చేరిందని... 18 ఏళ్ల వరకు పంచమి జీవితం చాలా హాయిగా సాగిందని తెలిపాడు. కానీ అప్పుడు నాగరాణి, నాగులు వచ్చి ఆమెను పాములా మారేలా చేశారని... తన కర్తవ్యాన్ని గుర్తు చేశారని వెల్లడించాడు. అదంతా విన్న మోక్ష.. మరి ఇప్పుడెలా, పంచమిని పూర్తిగా పాములా మారకుండా ఏం చేయాలేమా అని ప్రశ్నిస్తాడు.

ఏమీ చేయలేమని.. పంచమి నిన్ను చంపితేనే ఆమెకు నాగ లోక ప్రవేశం ఉంటుందని స్వామీజి వెల్లడించాడు. అలాగే ఆమెకు నిన్ను చంపే ఉద్దేశం లేకపోవడం వల్లే.. నాగలోకానికి వెళ్లలేకపోతుందని, ఈక్రమంలోనే నాగ దేవత ఆమెకు ఓ శాపం ఇచ్చందని అంటాడు. ప్రతీ పౌర్ణమికి పంచమి పాములా మారి మిమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తుందని వివరిస్తాడు. ఇదంతా తెలుసుకున్న మోక్ష ఇంటికి వస్తాడు. అప్పుడే శిశిర బంగ్లా గోడపై నిల్చొని చెట్టు కొమ్మల్లో ఇరుక్కుపోయిన కాగితపు విమానాన్ని అందుకునే ప్రయత్నం చేస్తుంది. ఓవైపు సుబ్బు, మరోవైపు చిత్ర వద్దని వారిస్తున్నా వినకుండా అందుకునే ప్రయత్ం చేయబోయి కింద పడుతుంది.

ఈక్రమంలోనే చిత్ర ఏడ్వడం, శిశిర స్పృహ తప్పడం.. కుటుంబ సభ్యులంతా వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. కానీ సుబ్బు తన చేతిలో ఉన్న నెమలి ఈకతో టచ్ చేయగానే లేచి నిల్చుటుంది. అంతా హ్యాపీగా ఫీలవుతూనే.. చిత్ర సుబ్బుపై నిందలు వేస్తుంది. అతడి వల్లే తన బిడ్డకు ఇలా అయిందంటూ గొడవ చేస్తుంది. అతడిని పంపించేయాలని ఏడుస్తుంది. దీంతో మోక్ష ఆమెను ఇంటికి పంపించి వేయాలని చెబుతాడు. మరోవైపు చిత్ర, జ్వాలలు సుబ్బు గురించి నీచంగా మాట్లాడతాడు. పంచమి వద్దని చెబుతున్నా వినకుండా ఇంట్లోంచి పంపించేయాలని వార్నింగ్ ఇస్తారు.

Moksha Talking With Panchami About Their Future on November 7th Episode Number 193 in Naga Panchami Telugu Serial

ఇదంతా విన్న సుబ్బు.. పంచమి నీవేం చేయాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. దీనికి పంచమి ఏమీ అనదు. అర్థం చేసుకున్న సుబ్బుయే.. నువ్వు ఇంట్లోకి వెళ్లు, మన చేతుల్లో ఏం చేసే సామర్థ్యం లేనప్పుడు కాలమే సమాధానం చెబుతుందని వివరిస్తాడు. పంచమిని ఇంట్లోకి పంపి వెళ్లిపోతాడు. మరోవైపు కరాళీ నంబూద్రీని బితికించేందుకు పూజలు చేస్తూ కనిపించింది. అంతలోనే నంబూద్రీ ఆత్మ రాగా.. మహంకాళి అమ్మవారు తనను భయపెట్టిన విషయం చెబుతుంది. నాగమణి దక్కించుకుంటే మహంకాళి కంటే నీకు ఎక్కువ శక్తులు వస్తాయనే భయంతోనే ఆమె అలా చెప్పిందని నంబూద్రీ కరాళీకి చెబుతాడు. ఇంతటితో నిన్నటి ఎపిసోడ్ పూర్తయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X