Naga Panchami: మేనకలా మారిపోయిన కరాళీ.. మోక్షను వశపరుచుకునేందుకేనా.. పంచమి ఏం చేయబోతుంది?
Naga Panchami December 16th Episode: నాగ పంచమి సీరియల్ రోజురోరుజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. గత ఎపిసోడ్ లోనే అద్భుతైన ట్విస్ట్ ఇవ్వగా... తాజాగా రాబోయే ఎపిసోడ్ లోనూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా నాగ దేవత ప్రత్యక్షం అవ్వడం ఇక నీకు నాగ లోకానికి ప్రవేశం లేదని పంచమితో చెప్పడం చూపిస్తారు. ఇది ఎవరూ ఊహించలేరు. అలాగే తన తల్లిని చంపిన వాడిని చంపకుండా అతడిని కాపాడే ప్రయత్నం చేస్తూ... నాగ లోకాన్ని మోసం చేస్తున్న పంచమికి నాగ దేవత శాపం ఇచ్చింది. అంతేకాకుండా ఆమె పాముగా మారిపనప్పుడు జనాలు చూసి కర్రలతో కొట్టి చంపుతారని కూడా హెచ్చరించింది. ఇదంతా రేపటి ఎపిసడ్ లో కనిపించబోతుండా.. ఈరోజుటి ఎపిసోడ్ మరింత రవసత్తరంగా ఉంది.
ముఖ్యంగా మోక్ష తన కుటుంబ సభ్యులకు ఐదు తలల పాము గురించి వివరిస్తూ కనిపిస్తాడు. ఐదు తలల పాము తనని చంపాలనుకుందని అంటాడు. ఆ పామును చూస్తేనే చాలా భయమేసిందని అంటాడు. ఐదు తలల పాము అనగానే కుటుంబ సభ్యులు అంతా భయంతో నోరెళ్లబెడతారు. మరోవైపు నాగ సాధువు ఐదు తలల పాము కనిపించడం కూడా చాలా అదృష్టం బాబు అని అంటాడు. ఆ తర్వాత మోక్ష... ఆ పాము ప్రతీ పౌర్ణమికి వచ్చి నన్ను చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటుందని అంటాడు. దానికి కుటుంబ సభ్యులు చాలా బాధ పడతారు. పంచమియే నన్ను కాపాడుతూ వస్తుందని అంటాడు.

ఆ శివయ్యే నన్ను కాపాడేందుకు పంచమిని మన ఇంటికి పంపించాడని చెబుతున్నాడు. అవునంటూ శబరి చెప్పడం... మోక్షను జీవితాంతం కాపాడే బాధ్యత నీదే అంటూ మోక్ష చేయిని పంచమి చేతుల్లో పెడుతుంది. ఇక ఆ తర్వాత మోక్ష పిన్ని ప్రతీ పౌర్ణమికి యాగం చేయిద్దామని అనగా.. అవసరం లేదని నాగ సాధువు అంటాడు. పంచమికి ఆ శివయ్యే ఏదో ఒక దారి చూపిస్తాడు... దాన్ని గుర్తెరిగి ఫాలో అయితే మోక్షను కాపాడుకోవచ్చని అంటాడు. ఆ తర్వాత సుబ్బు, మోహిని ఎక్కడ ఉన్నారని అడగ్గా... సుబ్బు వాళ్ల ఇంటికి వెళ్లిపోయాడని చెబుతుంది. ఆ తర్వాత మోహిని ఈ అడవిలో ఎన్నెన్నో మూలికలు దొరుకుతాయని చెప్పి వెళ్లిపోయిందని పంచమి వివరిస్తుంది.
ఇక ఆ తర్వాత కరాళీ ధ్యానం చేసుకుంటూ కనిపిస్తుంది. ముఖ్యంగా పంచమి తనపై దాడి చేయడం గుర్తు తెచ్చుకుంటుంది. ఆ తర్వాత మహాకాళి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది. అవేవీ ఫలించకపోయేసరికి ప్రాణాలు తీసుకోవాలనుకుంటుంది. కొండ పైనుంచి దూకబోతుండగా.. మహాకాళి ప్రత్యక్షం అవుతుంది. ఇలా పదే పదే నేను చనిపోయేందుకు ప్రయత్నించడం, నువ్వు కాపాడడం వద్దు తల్లీ నేను చనిపోతానని కరాళీ అంటుంది. కానీ మహాకాళి మాత్రం నీకింకా ఆయుష్షు ఉంది.. అందుకే రాత్రి ఐదు తలల పాము నుంచి తప్పించుకోగలిగావు అంటుంది. అలాగే ఇదే చివరి సారి అంటున్నావు కాబట్టి ఈ రూపంతో నీవు ఏదీ సాధించలేకపోతున్నావు కాబట్టి నీకు ఓ వరం ఇస్తానని వివరిస్తుంది.
మోక్షను వశ పరుచుకునేందుకు నీకో రూపం ప్రసాదిస్తాను.. అది రూపం మాత్రమే. ఒక్కసారి మాత్రమే ఆ రూపం నీకు వస్తుంది. అలాగే వద్దు అనుకున్నప్పుడు యాధా ప్రకారం నీ రూపంలోకి వచ్చేస్తావు. నీకు ఎందమైన అంతరూపం కావాలో, ఎలా ఉంటే మోక్షను వశపరుచుకోగలవో ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ నీ మనసులో తలుచుకుంటే నీకు ఆ రూపం వస్తుందని చెప్పి మాయమైపోతుంది. ఇక ధ్యానం చేసి చాలా అందంగా ఉండే రూపాన్ని పొందుతుంది. మేనక లాంటి రూపం కావాలనుకున్నాను వచ్చేసింది.. పంచమి వచ్చేస్తున్నాను.. ఇక నువ్వు మోక్షను మరిచిపో అంటుంది.
ఇక ఆ తర్వాత ఫణీంద్ర నాగ దేవతకు తాన యజ్ఞాన్ని ఎలా చెడగొట్టకుండా ప్రయత్నాలు చేశారో వివరిస్తాడు. శాయశక్తులా ప్రయత్నించినా... ప్రాణాలకు తెగించి కూడా లోపలికి వెళ్లాలనుకున్నాం.. కానీ వెళ్లలేకపోయామని చెబుతుంది. మోక్షను కాపాడేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే ఆమె పాములా మారిపోతుందని అంటాడు. ఆమె భూలోకంలో ఉన్నంత కాలం ఆమెను నాగ లోకానికి తీసుకురాలేమని అంటుంది. తన భర్తను కాపాడుకోవడానికి నా ముందు భయం నటిస్తుందే తప్ప ఆమెకు ఏమాత్రం భయం కానీ భక్తి కానీ నాపై లేవంటూ నాగ దేవత చెబుతుంది. దీన్ని క్షమించంకూడదని చెబుతుంది.
పంచమిని మూర్చబోయేలా చేసి తీసుకొస్తానని ఫణీంద్ర అనగానే... అలా అయితే మోక్షను పంచమి ఎలా చంపుతుందని అంటుంది. అసలు ఆమె ఆలోచన ఏంటో నేను క్షుణ్ణంగా తెలుసుకని ఓ నిర్ణయం ప్రకటిస్తను.. దాన్ని అంతా ఫాలో అవుదా అని అంటుంది. ఆ తర్వాత నాగులు వెళ్లిపోతారు. నాగ దేవత కూడా మాయమైపోతుంది. మరోవైపు చిత్ర, జ్వాలలు తమ భర్తలు చాలా సంతోషంగా ఫోన్లు మాట్లాడుతుంటే ఫీలైపోతారు. మోక్ష ప్రాణాలతో బయటపడ్డాడని అందుకే వీళ్లు అలా ఉన్నారని అనుకుంటారు. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











