Naga Panchami 7th March: మోక్ష, పంచమిలు కలవడం కష్టమేనా.. మేఘన ఏం చేయబోతుంది?

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మోక్ష శాస్త్రవేత్తలకు ఫోన్ చేస్తాడు. తాను చెప్పిన పని ఎక్కడి వరకు వచ్చిందని అడగ్గా.. చాలా రకాల బ్లడ్ శాంపిల్స్ తో టెస్టులు చేశామని అయినా ఎలాంటి ఫలితం లేదని అంటారు. ఏదో ఒకటి చేసి త్వరగా కనుక్కోమంటూ మోక్ష చెబుతాడు. అందుకు వైద్యులు కూడా సరేనని చెబుతారు. ఇక ఆ తర్వాత పంచమి, మేఘనలు ఓ చోట మాట్లాడుకుంటూ కనిపిస్తారు.

ముఖ్యంగా పంచమి.. మేఘను నీకు మోక్ష బాబుతో సగం పెళ్లి అయిపోయింది... ఇక పెళ్లి కూడా జరిగితే నా బాధ్యత తీరిపోతుందని చెబుతుంది. అలాగే మీ ఇద్దరికీ పెళ్లి జరిగిన వెంటనే.. మోక్ష బాబు నీ మెడలో తాళి కట్టిన వెంటనే నేను మీకు కనిపించకుండా పోతానని అంటుంది. ఇంతలోనే అక్కడకు మోక్ష వస్తాడు. చాలా కోపంగా ఇదంతా అబద్ధం అని అంటాడు. మేఘనకు.. పంచమి నా భార్య ఇప్పడు, ఎప్పడికీ అంటూ వివరిస్తాడు. అది చూసి షాక్ అయిన మేఘన ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోతుంది.

Moksha Trying to Keep Panchami in Bhulokam on Naga Panchami March 7th 2024 Episode

పంచమిని పూర్తిగా ఇక్కడే ఉంచుకునేందుకు నేను ఏర్పాట్లు చేస్తున్నానని అవి సక్సెస్ అయితే పంచమి నాతోనే ఉంటుందంటూ మేఘనకు వివరిస్తాడు. ఆ తర్వాత ఆమె అక్కడ నుంచి వెళ్లగా... పంచమిని దగ్గరకు తీసుకుని ఆమె చేతులను తన గుండెలపై పెట్టుకుంటాడు. నా ప్రేమ నీకు తెలియట్లేదా ఇక్కడే ఉండిపో పంచమి అంటూ చెప్పుకొస్తాడు. అదంతా వింటూనే పంచమి మోక్షతో మరోసారి ప్రేమలో పడిపోతుంది. ఇక ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది.

నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా మోక్ష, మేఘనల నిశ్చితార్థాన్ని చూపించారు. అన్నీ ఏర్పాట్లు చేసి కుటుంబ సభ్యులు అంతా ఒక్క చోట ఉండగా.. మోఘ, మేఘనలు రెడీ అవుతూ ఉంటారు. ఈక్రమంలోనే పంతులు అమ్మాయి, అబ్బాయిలను తీసుకు రమ్మని చెబుతాడు. దీంతో వైదేహి వెళ్లే ప్రయత్నం చేస్తుండగా.. నేను తీసుకువస్తానంటూ పంచమి వెళ్తుంది. తానే దగ్గర ఉండి మోక్ష, మేఘనలను తీసుకు వస్తుంది. అందంగా పెళ్లి డ్రెస్ లో ముస్తాబైన ఈ జంట చాలా అందంగా కనిపిస్తారు.

వైదేహి చాలా సంతోషంగా చూస్తుండగా.. మిగతా వాళ్లు అందరూ ఇష్టం లేకపోయినా అక్కడే ఉంటారు. పూజపై వారిద్దరినీ కూర్చొమని చెప్పిన పంతులు.. ఆ తర్వాత అమ్మాయి తరఫున ఎవరు తాంబూళాలు తీసుకుంటారని అడుగుతాడు. పంచమి నేను తీసుకుంటానని అనగా.. దంపతులు అయితే బాగుంటుందని చెబుతుంది. ఆ తర్వాత వైదేహి జ్వాల, ఆమె భర్తను తాంబూళాలు తీసుకోవాలని చెబుతుంది. కానీ అతడు కోపంగా చూస్తుండగా.. నంబూద్రీ ఆత్మ జ్వాలలోకి ప్రవేశిస్తుంది.

ఆ తర్వాత జ్వాల నా చెల్లెలు పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తానంటూ వెళ్లి ఆమె పక్కన చేరుతుంది. ఇలా ఈ జంట తాంబూళాలు తీసుకుంటారు. ఆ తర్వాత మోక్ష, మేఘనలు దండలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకునే సమయంలో వాళ్లు ఇచ్చిన ఉంగరాన్ని మేఘన కావాలనే కింద పడేస్తుంది. అప్పటికే తాను మంత్రశక్తులను ఉంగరంలోకి పంపించిన దాన్ని తీసి మోక్షకు తొడుగుతుంది. ఇక ఆ తర్వాత పంచమి సంతోషంగా తన బాధ్యత తీరిపోతుందంటూ మురుస్తూ బయటకు వస్తుంది.

బయటకు వచ్చాకా ఫణీంద్ర కనిపిస్తాడు. పంచమికి సారీ చెప్పి.. నీ ఇష్టం ఉన్నప్పుడే నీవు నాగలోకం రా... నేను అస్సలే బలవంత పెట్టను అంటూ వివరిస్తాడు. నీలో ఈ మార్పుకు కారణం ఏంటని అడగ్గా.. ఓ దైవసంభూతుడు నాకు జ్ఞానోదయం చేసాడని అంటాడు. మనం నాగలోకం వెళ్లే సమయం త్వరలోనే ఉందని.. మోక్ష, మేఘనలకు పెళ్లి జరిగిన వెంటనే మనం నాగలోకం వెళ్లిపోదామని అంటుంది.

Moksha Trying to Keep Panchami in Bhulokam on Naga Panchami March 7th 2024 Episode

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X