న్యూడ్ MMS: లైఫ్ స్పాయిల్ అవుతుందని నటి ఆందోళన
ముంబై: హిందీ టీవీ నటి మోనా సింగ్ న్యూడ్ MMS ఇటీవల ఇంటర్నెట్, సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అది తన వీడియో కాదని, ఎవరో తన ఫేసును మార్ఫింగ్ చేసి నెట్లోకి వదిలారని మోనా సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోపై పరిశోధన జరిపిన డిజిటల్ ఎక్స్‌పర్ట్స్, సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్‌ఫర్ట్స్ ఆ వీడియో ఆమెది కాదని, వేరే న్యూడ్ వీడియోకు ఆమె ఫేసును మార్ఫింగ్ చేసారని తేల్చారు.
ఇటీవల ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ 'ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసారు. ఇలాంటి వీడియోలు ప్రచారంలోకి రావడం వలన కెరీర్, లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉందని, సమాజంలో ఎంతో మర్యాదగా జీవిస్తున్నానని, ఈ సంఘటన వల్ల తన కుటుంబానికి, స్నేహితులకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని' ఆమె చెప్పుకొచ్చారు.
'ఈ రోజు నాకు జరిగింది, రేపు ఎవరైనా ఇన్నోసెంట్ గర్ల్‌కు ఇలాంటి సంఘటన ఎదురైతే పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించారు. ఇలాంటి సీరియస్ మ్యాటర్లపై మీడియాకు అత్యుత్సాహం చూపకుండా సంయమనం పాటించాలని, నిజానిజాలు తెలుసుకోకుండా ఇలాంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సరికాదని' సూచించారు.
ఆ వీడియో నకిలీదే అని తేల్చి పోలీసులు ఆ వీడియోను ఎవరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారనే విషయమై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి పేరుతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఐపి అడ్రస్ ట్రేస్ చేస్తే గానీ ఈ చర్యకు పాల్పడింది ఎవరో తెలిసే అవకాశం లేదని, వివిధ కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
మోనా సింగ్ పలు హిందీ రియాల్టీ షోలలో, టీవీ సీరియల్స్ లో నటించే ఓ పాపులర్ నటి. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన '3 ఇడియట్స్' చిత్రంలో కూడా ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమో కరీనా కపూర్ అక్క పాత్రలో గర్భవతిగా నటించింది.


Click it and Unblock the Notifications











