ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే

బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో ఎన్ని ట్రాకులు నడిచాయో అందరికీ తెలిసిందే. అయితే అందులో ఎన్ని ట్రాకులు నడిచినా అన్నీ కూడా మోనాల్ కేంద్రంగానే నడిచాయి. ముందుగా మోనాల్ అభిజిత్‌తో ట్రాకు నడిపింది. ఆ తరువాత అఖిల్ వచ్చాడు. మధ్యలో ఇద్దరితో కొన్ని రోజులు బాగానే ఉంది. అయితే చివరకు మాత్రం అఖిల్ ప్రాణ స్నేహితుడిలా మారిపోయాడు. అఖిల్ మోనాల్ మధ్య ఏదో ఉందని అందరూ కామెంట్లు చేస్తుంటారు. కానీ తామిద్దరం మంచి ఫ్రెండ్స్అని చెబుతూ ఉంటారు.

PICS: ఇండియన్ కపుల్స్.. వైరల్ ఫోటోషూట్

Recommended Video

Bigg Boss Telugu 4: Bigg Boss show was once again criticised for its elimination process
ఎలిమినేట్ అయ్యాక..

ఎలిమినేట్ అయ్యాక..

బిగ్ బాస్ నుంచి మోనాల్ ఎలిమినేట్ అయ్యాక అసలు విషయం తెలుసుకుంది మోనాల్. అఖిల్‌తో తన రిలేషన్ ఎలా వచ్చింది.. అభిజిత్ ఫాలోయింగ్ ఎలా ఉంది.. సోహెల్‌కు మెహబూబ్ ఎలా సపోర్ట్ చేస్తున్నాడో అన్నింటిని మోనాల్ గమనించింది. అలా చివరి వరకు అఖిల్‌కు మోనాల్ సపోర్ట్ చేసింది.

బయట కూడా..

బయట కూడా..

బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టే బయట కూడా అఖిల్ మోనాల్ మరింత సన్నిహితంగా ఉంటున్నారు. మిడ్ నైట్ కాల్స్, గిఫ్ట్స్, బయట పార్టీలంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే వీరిద్దరి ట్రాకును ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నట్టున్నారు.

సుమ స్పెషల్ షో..

సుమ స్పెషల్ షో..

స్టార్ట్ మ్యూజిక్ అనే కొత్త షోను సుమ హెస్ట్ చేయబోతోంది. ఇది వరకు ఆ షోను ఝాన్సీ, శ్రీముఖి హోస్ట్ చేశారు. ఇప్పుడు ఇక సుమ వంతు వచ్చింది. మొత్తానికి సుమ స్టార్ట్ మ్యూజిక్ షోను హోస్ట్ చేయబోతోంది. మొదటి ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్టుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి ఆటలు ఆడించేసింది.

 అఖిల్ పాట..

అఖిల్ పాట..

ఇక ఈ స్టార్ట్ మ్యూజిక్ షోలో పాటలు పాడే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. అందులో భాగంగా అఖిల్ పాట పాడేశాడు. ఏమై పోతావే అంటూ ఎంతో ఎమోషనల్‌గా పాట పాడితే ఇక ఎడిటింగ్ టీం డైరెక్షన్ టీం ఊరికే ఉంటుందా? అక్కడే అసలు డ్రామా మొదలుపెట్టేశారు.

మోనాల్ వస్తుందా?

మోనాల్ వస్తుందా?

ఇక అఖిల్ అంతగా ఎమోషనల్ అవ్వడంతో ఆ షోలో మోనాల్ వచ్చినట్టుంది. మొదటగా వాయిస్ వినిపించింది. మోనాల్ వచ్చావా? అంటూ అఖిల్ ఆత్రుతగా అడగడం, అఖిల్ కళ్లకు గంతలు కొట్టి ఇంకేదో డ్రామా చేశారు. మొత్తానికి ఈ ట్రాక్‌ను ఇలా సుమ కూడా వాడేసింది. ఇద్దరి మధ్య ఏమీ లేకపోయినా కూడా ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు చాలానే ప్రయత్నం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X