కాళ్లకు పట్టీలను తొడిగేశాడు.. వామ్మో మోనాల్ అఖిల్ రొమాన్స్ వేరే లెవెల్
బిగ్ బాస్ షోలో మోనాల్ అఖిల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ ఇద్దరి రొమాన్స్, హగ్గులు, కిస్సులు అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ షోలో మోనాల్ అఖిల్ ట్రాక్ ఎంతగానో వైరల్ అయింది. బయటకు వచ్చాక కూడా అదే కెమిస్ట్రీని మెయింటైన్ చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ ఉత్సవం అనే కొత్త షోతో బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ రచ్చ చేసేందుకు రెడీ అయ్యారు. నేటి సాయంత్రం ఆరు గంటలకు రాబోతోన్న ఈ ప్రోగ్రాంలో నాల్గో సీజన్ కంటెస్టెంట్లు రచ్చ చేయబోతోన్నారు.

నోయల్ హారిక అలా..
నోయల్ హారిక లాస్యలు ఈ ఉత్సవంలో సందడి చేశారు. హారిక బాక్సింగ్ ఆడేందుకు రెడీ కాగా.. అమ్మ రాజశేఖర్ కౌంటర్ వేయడం.. దానికి నోయల్ రివర్స్ కౌంటర్ వేయడం అందరికీ తెలిసిందే. నోయల్ పాడిన, రాసిన మారదే మారదే ప్రేమ అనే పాట కూడా బాగానే క్లిక్ అయ్యేలా ఉంది.

అరియానా అవినాష్ ఇలా..
ఇక అరియానా అవినాష్‌లు మాత్రంరెచ్చిపోయి పర్ఫామెన్స్ చేసినట్టు కనిపిస్తోంది. తరగతి గది దాటి కదిలిన కథలు అనే పాటకు అదిరిపోయేలా డ్యాన్స్ చేశారు. ఈ ఇద్దరిని అలా చూస్తే నిజంగానే ప్రేమికులా? అనే అనుమానం వచ్చేలా ఉంది.

తాజాగా మోనాల్..
ఇక ఇదే బిగ్ బాస్ ఉత్సవంలో అఖిల్ మోనాల్ కూడా బాగానే రెచ్చిపోయారు. గంగవ్వను మధ్యలో పెట్టి కథను బాగానే నడిపించినట్టున్నారు. గంగవ్వకు చీర పెట్టిన మోనాల్ ఆశీర్వాదం తీసుకుంది.. ఈ చీర ఎప్పుడు కట్టుకుంటావ్ అని శ్రీముఖి అడిగి మళ్లీ ఆమె సమాధానం చెప్పింది. మోనాల్ పెళ్లిలో కట్టుకుంటావ్ కదా అని శ్రీముఖి అంటే అప్పటికి అఖిల్ వేరే కొనిస్తాడని గంగవ్వ కౌంటర్ వేసింది.

కాలికి పట్టీలు..
మోనాల్ కోసం అఖిల్ తన గొంతును మరోసారి సవరించారు. తన గాత్రంలో ఒకే ఒక లోకం నువ్వే అనే పాటను ఆలపించి ఫిదా చేసేశాడు.ఆ తరువాత మోనాల్ కాళ్లకు పట్టీలు కట్టి అందరినీ కట్టిపడేశాడు. మొత్తానికి ఈ ఇద్దరి రొమాన్స్ బిగ్ బాస్ ఉత్సవానికి హైలెట్ అయ్యేలా ఉంది.


Click it and Unblock the Notifications











