పర్సనల్ ప్రాబ్లమ్‌ గురించి మోనాల్ షాకింగ్ కామెంట్స్: ఏకంగా 21 గంటలు అదే పని అంటూ రివీల్ చేసింది

మోనాల్ గజ్జర్.. కొంత కాలంలో తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతూ.. హాట్ టాపిక్ అవుతోన్న పేరు. దీనికి కారణం బిగ్ బాస్ షోలో పాల్గొనడం.. అందులో ఊహించని విధంగా వ్యవహరించడం అని అందరికీ తెలుసు. గతంలో హీరోయిన్‌గా పని చేసినా దక్కని గుర్తింపు.. ఈ షో ద్వారా ఆమెకు లభించింది. ఈ కారణంగానే వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా సోషల్ మీడియా ద్వారా తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి వెల్లడించింది. అంతేకాదు, ఏకంగా 21 గంటలు అదే పని అంటూ మేటర్ రివీల్ చేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఆ హీరోతో రెండు సినిమాలు.. మళ్లీ ఇప్పుడిలా

ఆ హీరోతో రెండు సినిమాలు.. మళ్లీ ఇప్పుడిలా

చిన్న వయసులోనే సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది మోనాల్ గజ్జర్. అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన ఆమె.. ఆ తర్వాత 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి'తో పాటు పలు చిత్రాల్లోనూ నటించింది. అయినప్పటికీ గురింపు దక్కించుకోలేకపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.

ఇద్దరితో చెట్టాపట్టాలు.. ఆమె తీరుతో విమర్శలు

ఇద్దరితో చెట్టాపట్టాలు.. ఆమె తీరుతో విమర్శలు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే మోనాల్.. యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇలా చాలా రోజులు అతడితో క్లోజ్‌గా కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా వ్యవహరించింది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మోనాల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.

ఆ తర్వాత రెచ్చిపోయింది... హౌస్‌లో రొమాన్స్

ఆ తర్వాత రెచ్చిపోయింది... హౌస్‌లో రొమాన్స్

అఖిల్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోందని హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా ఫిక్సైపోయారు. అందుకు అనుగుణంగానే తరచూ ఏదో ఒక కామెంట్స్ చేస్తూ వచ్చారు. దీంతో మోనాల్ గజ్జర్.. అతడి ప్రేమలో మునిగిపోయింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో ఈ జంట తెగ హల్‌చల్ చేసి హైలైట్ అయింది.

 బిగ్ బాస్ వల్ల భారీగానే.. ఓ షో.. మరో సినిమా

బిగ్ బాస్ వల్ల భారీగానే.. ఓ షో.. మరో సినిమా

అంచనాలు లేకుండానే బిగ్ బాస్ షోలోకి వచ్చిన మోనాల్ గజ్జర్.. పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీంతో ఆమె మొత్తంగా రూ. 50 లక్షలు పైగానే ముట్టాయని తెలిసింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఓంకార్ 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

అఖిల్‌తో కలిసి అలా వస్తోంది.. ప్రేమికుల రోజే

అఖిల్‌తో కలిసి అలా వస్తోంది.. ప్రేమికుల రోజే

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

పర్సనల్ ప్రాబ్లమ్‌ గురించి మోనాల్ కామెంట్స్

పర్సనల్ ప్రాబ్లమ్‌ గురించి మోనాల్ కామెంట్స్

మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ద్వారా ఈ అమ్మడు తరచూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తుంటుంది. అలాగే, తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన పర్సనల్ ప్రాబ్లమ్ గురించి ఓ వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా తన కష్టం గురించి అందరికీ రివీల్ చేసేసింది.

ఏకంగా 21 గంటలు అదే పని చేశానంటూ రివీల్

ఏకంగా 21 గంటలు అదే పని చేశానంటూ రివీల్

'డ్యాన్స్+' షో కోసం మోనాల్ గజ్జర్ ఏకంగా 21 గంటలు షూటింగ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది. 'ఆ షో కోసం 21 గంటలు షూట్ చేశాను. అయినా ఎంత ఫ్రెష్‌గా ఉన్నానో చూడండి. నా కష్టాన్ని ముఖంలో కనిపించకుండా చేస్తున్నాను. ఇప్పుడు నాకు నిద్ర బాగా వస్తోంది. హోటల్‌కు వెళ్లిన వెంటనే అదే పని చేయాలి' అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X