అతడితో బ్రేకప్‌ కారణంగా డిప్రెషన్‌లోకి.. అందుకే టాలీవుడ్ వదిలేశా.. మోనాల్ గజ్జర్ సెన్సేషనల్‌గా

బిగ్‌బాస్ తెలుగు 4 రియాలిటీ షోలో నాలుగు నెలలపాటు ప్రేక్షకులకు వినోదాన్ని, అందాలను పంచిన బ్యూటీ మోనాల్ గజ్జర్ గతవారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు. ఎలిమినేషన్ తర్వాత హైదరాబాద్‌లోనే ఉంటున్న మోనాల్ మంగళవారం చిల్కూరు బాలాజీని దర్శించుకొన్నారు. అనంతరం మీడియా ఛానెల్స్‌తో మాట్లాడుతూ..

 సుడిగాడు సినిమాతో ఎంట్రీ

సుడిగాడు సినిమాతో ఎంట్రీ

టాలీవుడ్‌లో నా మొదటి సినిమా ఒక కాలేజ్ స్టోరి. 2012లో రిలీజైన నా మొదటి సినిమా సుడిగాడు. ఆ తర్వాత మలయాళంలో ఆఫర్ వచ్చింది. ఆ సినిమా తర్వాత తమిళంలో ఒక సినిమా చేశాను. 2015లో మళ్లీ బ్రదర్ ఆఫ్ బొమ్మాలి అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత నా సినిమాలను ఆచితూచి ఎంచుకొవాలని అనుకొన్నాను అని మోనాల్ తెలిపింది.

6 సంవత్సరాల రిలేషన్‌షిప్‌ బ్రేకప్

6 సంవత్సరాల రిలేషన్‌షిప్‌ బ్రేకప్

2015లో ఓ సంఘటన కారణంగా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. ఆరేళ్ల రిలేషన్‌షిప్ బ్రేకప్ అయింది. దాంతో నేను మానసికంగా చాలా దారుణమైన పరిస్థితులను అనుభవించాను. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ కారణంగా ఆ బాధలో ముగినిపోయాను. ఆ బాధ ఎంతలా ఉందంటే దానిని అనుభవిస్తేనే తెలుస్తుంది. అందుకే గుజరాత్ వెళ్లిపోయాను. దక్షిణాదికి మళ్లీ రావొద్దని అనుకొన్నాను అని మోనాల్ వెల్లడించింది.

నా బాయ్‌ఫ్రెండ్ దక్షిణాదికి చెందిన వాడు..

నా బాయ్‌ఫ్రెండ్ దక్షిణాదికి చెందిన వాడు..

నా బాయ్‌ఫ్రెండ్ సౌత్ ఇండియన్. అతడు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన వాడు. ఆ బ్రేకప్ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ సమయంలో గుజరాత్‌లో నాకు ఆఫర్లు వచ్చాయి. దాంతో గుజరాత్‌లో బిజీ అయ్యాను అని మోనాల్ చెప్పింది.

బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి

బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి

మలయాళం సినిమా కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే అతడితో నాకు అఫైర్ ఏర్పడింది. ఆ తర్వాత మేమిద్దరం 6 సంవత్సరాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. కొన్ని కారణాల వల్ల మేము విడిపోయాం. డిప్రెషన్ నుంచి బయట పడటానికి చాలా సమయం పట్టింది. ఆ తర్వాత గుజరాత్‌కు వెళ్లి 7 సినిమాలు చేశాను. ఆ తర్వాత కొన్ని మలయాళ సినిమాలు చేశాను. హిందీలో ఒక సినిమా చేశాను. అది జనవరి 7న రిలీజ్ కానున్నది అని మోనాల్ తెలిపింది.

 బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత

బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీతోనే బిజీగా ఉన్నాను. ఎవరితో పెద్దగా మాట్లాడలేదు. కానీ ఒక బిగ్‌ ప్రాజెక్ట్‌ నా ముందుకు వచ్చింది. త్వరలోనే ఆ వివరాలు చెబుతాను. ఇంకా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా నార్మల్ కాలేదు. కాస్త సమయం పడుతుంది అని మోనాల్ తెలిపింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Slams Trollers
నాలుగు నెలలపాటు బిగ్‌బాస్‌లో

నాలుగు నెలలపాటు బిగ్‌బాస్‌లో

బిగ్‌బాస్ అనేది ఓ మైండ్ గేమ్. సైకాలాజికల్‌గా చాలా కష్టపడాల్సి వస్తుంది. నాలుగు నెలలుగా ఇంటిలోనే ఉన్నాను. బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మామూలు పరిస్థితికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ తర్వాత నేను నా కెరీర్ ప్లాన్ చేసుకొంటానని మోనాల్ పేర్కొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X