నా అఖిల్ కావు.. హగ్ ఇలా ఇస్తావా మోనాల్ ఫైర్.. నాకు మూడ్ లేదంటూ అఖిల్.. చిచ్చు పెట్టిన నాగ్
నాగార్జున హెస్ట్‌గా ఆదివారం వారాంతం ఎపిసోడ్ ముగిసన తర్వాత అఖిల్ ప్రవర్తన తీరు మారిపోయింది. మోనాల్‌తో ఎప్పుడూ చలాకీగా, చిలిపిగా కనిపించే ముభావంగా మారిపోయారు. వాష్ రూమ్‌కు పరుగెత్తుకొంటూ వచ్చిన మోనాల్ తన పక్కన ఎందుకు కూర్చోలేదు అంటూ అడిగింది. అందుకు అఖిల్ ఇచ్చిన సమాధానాలు ఏమిటంటే..

చిచ్చు పెట్టిన నాగ్
నాగార్జున వేదిక మీద నుంచి మాట్లాడుతూ.. అభిజిత్ నైస్.. మోనాల్ మీరు ఇద్దరు పక్కపక్కన కూర్చొన్నారు. చూడటానికి బాగుంది. ఇంట్లో పరిస్థితులు అన్నీ కుదురుకుంటున్నాయి అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత అఖిల్, సోహైల్‌కు మోనాల్ ఇద్దరితో మాట్లాడిన విషయాలను వారి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేసిన విషయాలను వీడియోలో చూపించారు. దాంతో తమ మధ్య విభేదాలకు కారణం ఎవరో తెలుసుకొన్నారు. ఆ తర్వాత మోనాల్‌పై అఖిల్ అయిష్టంగా వ్యవహరించారు.

అదో రకంగా ఎందుకు ఉంటున్నావు
అఖిల్ వాష్‌రూమ్‌లో వెళ్తుండగా ఒక్క నిమిషం అంటూ ఆపింది. నాతో ఎందుకు ఒ రకంగా ఉంటున్నావు అంటే, అదేమీ లేదు నార్మల్‌గానే ఉంటున్నాను. నీకు కంగ్రాట్స్ కూడా చెప్పాను కదా అని అడిగింది. అయితే నీ పక్కన హారిక ఉంది కదా అని అఖిల్ అంటే.. స్పేస్ ఉంది కూర్చోండానికి అంటూ మోనాల్ చెప్పింది.

హగ్ ఇవ్వు అంటూ మోనాల్
మోనాల్ ప్రశ్నలు వర్షం కురపిస్తుండంతో నా పక్కన ప్లేస్ ఉంది. నీవే వచ్చి కూర్చో వచ్చు కదా.. నీవెందుకు చేయలేదు అంటూ అఖిల్ కామెంట్ చేశారు. దాంతో రా.. హగ్ ఇవ్వు అని మోనాల్ అంటే.. ఇష్టం లేని వాడిగా హగ్ ఇచ్చాుడు. దాంతో మోనాల్ సహనం కోల్పోయింది. ఇలా నాకు హగ్ ఎప్పుడూ ఇవ్వలేదు. నన్ను ఇష్టపడే అఖిల్ ఇలా చేయడు అంటూ మోనాల్ ఆవేదన చెందినట్టు కనిపించింది.

నాకు మూడ్ లేదు అంటూ అఖిల్
అయితే అలాంటిదేమీ లేదు. నాకు మూడ్ బాగాలేదు. నాకు కొంచెం టైమ్ కావాలి అంటూ అఖిల్ సమాధానం చెప్పాడు. అంే నీకు స్పేస్ కావాలా? పీస్ కావాలా అంటూ మోనాల్ అడిగితే.. దీన్ని అంత సీరియస్‌గా తీసుకోనవసరం లేదు. కాస్త టైమ్ ఇస్తే అన్ని అర్ధమవుతాయి అంూ అఖిల్ సమాధానం ఇచ్చారు. అయినా మోనాల్ సంతృప్తి చెందలేదు.
Recommended Video

టేక్ ఇట్ ఈజీ అంటూ అఖిల్
దాంతో అఖిల్ ఈ వ్యవహారాన్ని ఇష్యూ చేయకు. దిన్న నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేయకు అని అఖిల్ సూచించాడు. నా పక్కన కూర్చోవాలని అనుకోలేదన్నాడు. నేను కూడా నా పక్కన కూర్చోవాలని అనుకోలేదు అని మోనాల్ చెప్పాడు. నీకు స్పేస్ కావాలా అంటే ఇంట్లో చాలా స్పేస్ ఉంది అని అఖిల్ అన్నాడు. టేక్ ఇట్ ఈజీ.. మళ్లీ కలుస్తా అంటూ అఖిల్ వెళ్లిపోయాడు.


Click it and Unblock the Notifications











