అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్: సిగ్గుతో ముఖం చాటేసి.. కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ!

బిగ్ బాస్ షో తెలుగు బుల్లితెరపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లు విపరీతమైన ఫాలోయింగ్‌ను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఒంటరిగా కాకుండా జంటగా పాపులర్ అవుతున్నారు. అలాంటి వారిలో నాలుగో సీజన్ కంటెస్టెంట్లు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ జంట ఒకటి. సాదాసీదాగా ఎంట్రీ ఇచ్చిన వీళ్లిద్దరూ వచ్చేటప్పుడు మాత్రం జోడీగా మారారు. అప్పటి నుంచి తరచూ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వీళ్లిద్దరూ ఓ చోట కలిశారు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

అలా మొదలైన ప్రేమ... జంటగా మారారు

అలా మొదలైన ప్రేమ... జంటగా మారారు

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. మొదట అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం ప్రారంభించింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మోనాల్.. అఖిల్‌కు మాత్రం మరింత దగ్గరైపోయింది.

రెచ్చిపోయిన జోడీ.. అస్సలు తగ్గకుండానే

రెచ్చిపోయిన జోడీ.. అస్సలు తగ్గకుండానే


మొదట అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన మోనాల్ గజ్జర్.. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌ ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడంతో పాటు పొగుడుకోవడం వంటివి చేసింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. తద్వారా ఆమె హైలైట్ అయింది.

బయట కూడా రచ్చ.. తరచూ హాట్ టాపిక్

బయట కూడా రచ్చ.. తరచూ హాట్ టాపిక్

బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

ఇద్దరూ కలిసి ఒకచోట... ప్రేమికుల రోజునే

ఇద్దరూ కలిసి ఒకచోట... ప్రేమికుల రోజునే

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్

అలా కనిపించి షాకిచ్చిన అఖిల్.. మోనాల్


వీలు చిక్కినప్పుడల్లా కలుస్తూ రచ్చ చేస్తున్నారు అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్. ఇప్పటికే ఎన్నో సార్లు మీట్ అయిన ఈ జంట.. తాజాగా మరోసారి కలిసింది. ఈ విషయాన్ని వీళ్లిద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. అంతేకాదు, దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా వదిలారు. వీటిలో ఈ బిగ్ బాస్ జంట బాగా దగ్గరగా ఉండడం విశేషం.

Recommended Video

Sai Pallavi Effect, Love Story పై ఒక్కసారిగా పెరిగిన క్రేజ్ ! | Naga Chaitanya
కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ

కెమెరాకు చిక్కకుండా దాక్కున్న బ్యూటీ


ఈ మీటింగ్‌కు సంబంధించిన వీడియోను అఖిల్ సార్థక్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ఓ అద్దం ముందు నిల్చుని వీళ్లిద్దరూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. చాలా దగ్గరగా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని అందులో కనిపించారు. అయితే, ఆ సమయంలో మోనాల్ గజ్జర్ సిగ్గుతో తల దించుకుంది. అంతేకాదు, అతడి వెనుకకు వెళ్లి దాక్కుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X