అడ్డంగా దొరికిపోయిన అఖిల్ మోనాల్: వెనుక నుంచి అలా చేయడంతో కేకలు.. ఊహించని పని చేసి షాకిచ్చిన జంట
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఇది దాదాపు నాలుగేళ్లుగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. గేమ్ పరంగానే కాదు.. అందులో పాల్గొన్న కంటెస్టెంట్లు ఫేమస్ అవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతోంది. ఇప్పటికే ఎంతో మంది బిగ్ సెలెబ్రిటీలుగా ఎదిగిపోయారు కూడా. అయితే, అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మాత్రం జంటగా ఎనలేని గుర్తింపును అందుకున్నారు. షో తర్వాత కూడా బంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కలవగా ఊహించని సంఘటన జరిగింది. ఆ సంగతులు మీకోసం!

ముందు అతడితో... తర్వాత అఖిల్‌తో ట్రాక్
బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు సర్వ సాధారణం అన్న విషయం తెలిసిందే. గత సీజన్లలోనూ ఇలాంటివి చాలా కనిపించాయి. నాలుగో సీజన్‌లో ఆరంభంలోనే మోనాల్ గజ్జర్ - అభిజీత్ మధ్య ప్రేమాయణం సాగుతుందని అంతా అనుకున్నారు. అదే సమయంలో ఆమె అఖిల్‌తోనూ చనువుగా ఉండడంతో ట్రైయాంగిల్ లవ్ అని టాక్ వినిపించింది. కానీ, ఆ తర్వాత అఖినాల్ జోడీ అయ్యారు.

తెలిసిన తర్వాత హౌస్‌లో రొమాన్స్‌తో రచ్చ
అఖిల్ సార్థక్‌తో మోనాల్ గజ్జర్ ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు అటు బిగ్ బాస్ హౌస్‌తో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయిపోయాయి. అందుకు అనుగుణంగానే హౌస్‌లో వీళ్లిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లు కనిపించేవారు. అదే సమయంలో ప్రేమను వ్యక్తపరిచేలా వ్యవహరించారు. అంతేకాదు, తరచూ ముద్దులు, హగ్గులు ఇస్తూ హౌస్‌లోనే రచ్చ చేసేవారు.

బిగ్ బాస్ షోతో ప్లస్.. ఆమెకలా.. అతడిలా
బిగ్ బాస్ షో పుణ్యమా అని అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ జోడీ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నారు. అదే సమయంలో వీళ్లిద్దరూ ఆట పరంగానూ సత్తా చాటారు. దీంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకున్నారు. అంతేకాదు, సినిమా, షోలు, వెబ్ సిరీస్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. మోనాల్ వరుస షూట్లతో బిజీగా ఉంటే అఖిల్ సన్నద్ధం అవుతున్నాడు.

అక్కడే కాదు.. ఇక్కడ కూడా హాట్ టాపిక్
బిగ్ బాస్ హౌస్‌లో దాదాపు వంద రోజుల పాటు జంటగా హల్‌చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం.. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం వంటి వాటితో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. దీంతో ఈ జంట బయట కూడా ట్రెండింగ్ అవుతోంది.

జంటగా ప్రకటించారు.. వాలంటైన్స్ డే గిఫ్ట్
ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

అడ్డంగా దొరికిపోయిన అఖిల్.. మోనాల్
బిగ్ బాస్ హౌస్‌లో జంటగా రచ్చ రచ్చ చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్.. బయట కూడా అదే పంథాను ఫాలో అయిపోతున్నారు. తరచూ కలుస్తూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జంటగా కనిపించి హైలైట్ అయిన ఈ జోడీ.. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. అంతేకాదు, ఓ ఊహించని పని చేసి అడ్డంగా బుక్కైపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వెనుక నుంచి అలా చేయడంతో కేకలు
తాజాగా అఖిల్.. మోనాల్ ఓ చోట కలిశారు. ఆ సమయంలో అద్దం ముందు నిల్చుని సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు. అప్పుడు 'నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం లేదు. నిన్ను చాలా మిస్ అవుతున్నా' అంటూ అఖిల్‌ను మోనాల్ వెనుక నుంచి గట్టిగా కొట్టింది. దీంతో నొప్పి తాళలేక అతడు కేకలు వేశాడు. ఇదంతా ఆ వీడియోలో రికార్డ్ అవగా.. దాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు అఖిల్.


Click it and Unblock the Notifications











