వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెట్టాలని చూసిన మోనాల్: కెమెరాల ముందు అడ్డంగా బుక్కైపోయింది
మోనాల్ గజ్జర్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. హీరోయిన్‌గా చేసిన సమయంలోనూ దక్కని పాపులారిటీ ఇప్పుడు ఆమె సొంతమైంది. దీనికి కారణం బుల్లితెరపై ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోలో పాల్గొనడమే. అందరిలాంటి కంటెస్టెంటే అయినా ఈమె ఎక్కువగా గుర్తింపు తెచ్చుకోడానికి హౌస్‌లో వ్యవహరిస్తున్న తీరే కారణం. మరీ ముఖ్యంగా పలువురు కంటెస్టెంట్లతో ఆమె ట్రాకులు నడపడం హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో ఇద్దరు కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టాలని చూసి మరోసారి అడ్డంగా బుక్కైపోయింది. ఆ వివరాలు మీకోసం!

లవ్ ట్రాకులతో బాగా పాపులర్
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆరంభంలోనే మోనాల్ గజ్జర్ బాగా పాపులర్ అయిపోయింది. దీనికి కారణం హౌస్‌లోని కంటెస్టెంట్లు అభిజీత్, అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలే. మొదట్లో అభితో చనువుగా తిరుగుతూ కనిపించిన ఆమె.. అదే సమయంలో అఖిల్‌తోనూ క్లోజ్‌గా ఉంది. దీంతో వీళ్ల ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ ఉందని జోరుగా ప్రచారం జరిగింది.

గేమ్ విషయంలో కనపడలేదు
బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎవరో ఒకరితో మాట్లాడుతూ కనిపించిన మోనాల్.. క్రమంగా అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయినట్లు అర్థం అయిపోయింది. ఎప్పుడైతే అతడికి చేరువ అయిందో... అప్పటి నుంచి గేమ్‌పై ఫోకస్ తగ్గించేసింది. దీంతో ఏ టాస్కులోనూ ఆమె పాత్ర పెద్దగా కనిపించలేదు. ఈ విషయంపై ఆమెను చాలా మంది నామినేట్ కూడా చేసేశారు.

ఇద్దరి మధ్య దూరం పెంచాలని
అఖిల్ సార్థక్.. మోనాల్‌తో కాకుండా సోహెల్ రియాన్‌తో చాలా క్లోజ్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకానొక సందర్భంలో వీళ్లిద్దరి మధ్య దూరం పెరిగింది. దీనికి కారణం మోనాల్ గజ్జర్ చెప్పిన మాటలే అని అందరికీ తెలుసు. ఈ విషయాన్ని హోస్ట్ నాగార్జున అఖిల్‌కు వీడియో రూపంలో వివరించాడు. దీంతో మోనాల్‌పై వాళ్లిద్దరూ దారుణంగా ఫైర్ అయ్యారు కూడా.

సొంతంగా గేమ్ ఆడి నిలిచింది
వీడియోలు చూసిన తర్వాత నుంచి అఖిల్.. మోనాల్‌ను దూరం పెడుతూనే వస్తున్నాడు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ రోజురోజుకూ పెరుగుతూనే వచ్చింది. ఆ సమయంలో మోనాల్ కూడా అఖిల్‌తో కలిసి కాకుండా సొంతంగా గేమ్ ఆడాలని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్కులో అతడికి పోటీగా ఉన్న హారికకు మద్దతు ప్రకటించి గెలిపించింది.

చిచ్చు పెట్టాలని ప్రయత్నాలు
అఖిల్ - సోహెల్ మధ్య చిచ్చు పెట్టి చెడ్డ పేరును మూటగట్టుకుంది మోనాల్ గజ్జర్. దీంతో ఆమెపై ఆ ఇద్దరు కంటెస్టెంట్లతో పాటు బయట ఉన్న ఫ్యాన్స్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆమె తీరు మారలేదు. తాజా ఎపిసోడ్‌లో అఖిల్ - సోహెల్ మధ్య చిచ్చు పెట్టేందుకు మరోసారి ప్రయత్నించింది మోనాల్. కానీ, ఆమెకు పెద్ద షాక్ తగిలింది.
Recommended Video

మరోసారి అడ్డంగా బుక్కైందిగా
అఖిల్‌తో మాట్లాడుతూ.. ‘సోహెల్ మంచోడే. నువ్వంటే చాలా ఇష్టం. కానీ అతడు సొంతంగా ఆడతాడు. నిన్ను లెక్కచేయడు' అని చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది. దీనికి ‘ఇక్కడ సొంతంగా గేమ్ ఆడడానికే కదా వస్తారు. సోహెల్‌తో నేను ఎలా ఉంటానో.. వాడు నాతో అలానే ఉంటున్నాడు. నాకు సొంత తమ్ముడు లాంటోడు. వాడి గురించి ఏమీ చెప్పొద్దు' అంటూ రిప్లై ఇచ్చాడు అఖిల్.


Click it and Unblock the Notifications











