టీవీలో పరువు తీయకండి.. క్యారెక్టర్ డామేజ్ చేయకండి: అఖిల్, అభిజిత్ ఫైట్‌పై మోనాల్ భోరున ఏడుస్తూ

బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియనే ప్రధానంగా సాగింది. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. అఖిల్, అభిజిత్, సోహైల్, మోనాల్, సోహైల్ పంచాయితీ పెట్టుకొన్నారు. ఓ దశలో మోనల్ భోరున విలపించింది. 30వ రోజున ఇంటిలో జరిగిన విషయాలు ఇవే..

అభిజిత్‌తో అఖిల్‌ వాగ్వాదం

అభిజిత్‌తో అఖిల్‌ వాగ్వాదం


నామినేషన్ ప్రక్రియలో భాగంగా ముందుగా అఖిల్ సార్థక్ ముందుకొచ్చి అభిజిత్, అమ్మా రాజశేఖర్‌ను నామినేట్ చేశారు. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా అఖిల్‌కు, అభిజిత్‌కు మధ్యగొడవ ప్రారంభమైంది. మోనాల్ గురించి, ఒకరికొకరు తమ యాటిట్యూబ్‌పై గొడవ పడ్డారు. ఒకరిపై మరొకరు మండిపడుతూ నువ్వెంత.. నువ్వెంత అనే రేంజ్‌లో మాటలు రువ్వుకొన్నారు.

అరియానా, దివి, కుమార్ సాయి నామినేట్ చేస్తూ

అరియానా, దివి, కుమార్ సాయి నామినేట్ చేస్తూ


అఖిల్ తర్వాత అరియానా నామినేషన్‌లో పాల్గొంటూ అఖిల్ సార్థక్, అమ్మా రాజశేఖర్‌ను నామినేట్ చేశారు. ఆ తర్వాత యాంకర్ లాస్య నామినేషన్ ప్రక్రియలో మాట్లాడుతూ దివి వద్యా, నోయల్ సీన్‌ను నామినేట్ చేశారు. ముక్కు అవినాష్ ప్రక్రియలో పాల్గొంటూ అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌ను నామినేట్ చేయగా, సుజాత రంగంలోకి దిగి అఖిల్ సార్థక్, అరియానాను నామినేట్ చేశారు. కుమార్ సాయి విషయానికి వస్తే నోయల్ సీన్, అరియానాను నామినేట్ చేశారు. సోహైల్ సయ్యద్ ర్యాన్ నామినేషన్‌లో పాల్గొంటూ అభిజిత్, నోయల్ సీన్‌ నామినేట్ చేశారు.

మోనాల్‌ను టార్గెట్ చేసిన హారిక దేత్తడి

మోనాల్‌ను టార్గెట్ చేసిన హారిక దేత్తడి

సుజాత, లాస్య‌ను మెహబూబ్, నోయల్ సీన్, అభిజిత్‌ను గంగవ్వ, అఖిల్ సార్థక్, అరియానాను అమ్మా రాజశేఖర్, అఖిల్ సార్థక్, మోనాల్ గజ్జర్‌ను హారిక దేత్తడి, లాస్య, సోహైల్‌ను దివి వద్యా నామినేట్ చేశారు. హారిక, అవినాష్‌ను మోనాల్ నామినేట్ చేశారు. సోహైల్, అఖిల్ సార్థక్‌ను అభిజిత్ నామినేట్ చేశారు. చివర్లో నోయల్ సీన్ రంగంలోకి దిగి.. సోహైల్, అమ్మా రాజశేఖర్ మాస్టర్‌ను నామినేట్ చేయడంతో ప్రక్రియ ముగిసింది.

నన్ను అరేయ్ అంటావా?

నన్ను అరేయ్ అంటావా?

నామినేషన్ ప్రక్రియలో ముఖ్యంగా అఖిల్, అభిజిత్ మధ్య గరం గరంగా చర్చ జరిగింది. మోనల్ విషయంలో నీవు అలా మాట్లాడావని అఖిల్ అంటే, నన్ను అరేయ్ అంటావా అంటూ అభిజిత్ గొడవ పడ్డారు. హారిక విషయంలో కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక చివర్లో అభిజిత్‌కు సోహైల్‌కు మధ్య గొడవ జరిగింది. చదువు గురించి వారిద్దరి మధ్య జగడం జరిగింది. నేను చదువకోకపోయినా ఇక్కడి వచ్చాను అంటూ అఖిల్ సమర్థించుకొన్నారు.

సోహైల్ మధ్యలో దూరి

సోహైల్ మధ్యలో దూరి

మోనల్, దివిల గురించి ఘాటుగా మాట్లాడుకొన్నారు. ఇక నోయల్ నామినేట్ చేయడానికి వచ్చిన సమయంలో సోహైల్ ఏదో విషయంలో తలదూర్చడంతో నేరుగా సోహైల్‌ను నామినేట్ చేశాడు. ఇక సుజాత నామినేట్ చేసే సమయంలో అఖిల్‌పై మండిపడింది. బిగ్‌బాస్ చెప్పిన విషయాన్ని సరిగ్గా వినకుండా లగ్జరీ బడ్జెట్ టాస్క్‌ను నాశనం చేశావు. నీ కారణంగా అందరూ ఇబ్బంది పడ్డారు అంటూ అఖిల్‌పై సుజాత ఫైర్ అయింది.

లాస్యను దివి నామినేట్ చేస్తూ

లాస్యను దివి నామినేట్ చేస్తూ

ఇక లాస్యను దివి నామినేట్ చేస్తూ.. తిండి, వంట విషయంలో తప్పుపట్టారు. అలాగే ప్రతీసారి పప్పు వండటం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. నీకు ఇష్టమని వండితే మాకు ఇబ్బంది ఉంటుందని దివి అనగా... లాస్య కోపంతో ఊగిపోయారు. ఫ్రిజ్‌లో చల్లటి పప్పు తినకుండా వేడి చేసుకొని తింటే మోషన్స్ కావు అంటూ లాస్య చెప్పారు. ఇలా రకరకాల విషయాలపై ఇంటి సభ్యుల మధ్య జబర్దస్త్‌గా వాగ్వాదం జరిగింది.

అభిజిత్, అఖిల్ మీకు ఏమైనా సమస్య ఉంటే

అభిజిత్, అఖిల్ మీకు ఏమైనా సమస్య ఉంటే

తన గురించి అభిజిత్, అఖిల్ గొడవపడటంతో మోనల్ ఎమోషనల్ అయ్యారు. నేషనల్ టెలివిజన్ ఛానెల్‌లో నా పరువు తీయకండి. నా క్యారెక్టర్ నాశనం చేయకండి. మీ ఇద్దరికి ఏదైనా సమస్య ఉంటే మీరు కూర్చొని మాట్లాడుకోండి. అంతేగానీ నా గురించి అనవసరంగా మాట్లాడుకోవద్దు అంటూ భోరున ఏడుస్తూ ఆవేశంగా మాట్లాడింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Abhijeet, Sohel Fight | Silver Coins Task Made Housemates Furious
నామినేట్ అయింది వీరే

నామినేట్ అయింది వీరే

బిగ్‌బాస్ హౌస్‌లో ఐదో వారంలో నామినేట్ అయిన వారిలో అఖిల్ సార్థక్, నోయల్ సీన్, అభిజిత్, సయ్యద్ సోహైల్, అమ్మా రాజశేఖర్, మోనాల్ గజ్జర్, లాస్య, అరియానా, సుజాత ఉన్నారు. అఖిల్ సార్థక్‌ను ఎక్కువ మంది నామినేట్ చేయడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X