twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పులిహోర చేయలేదని నామినేట్ చేశాడు.. ఇదెక్కడి న్యాయం.. భోరుమని ఏడ్చిన మోనాల్ గజ్జర్

    |

    బిగ్‌బాస్ హౌజ్‌లో 13వ వారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ మధ్య ఎమోషనల్‌గా వాగ్వాదం జరిగింది. అఖిల్ అనుసరిస్తున్న తీరుపై మోనాల్ ఒక్కసారిగా భగ్గుమన్నది. నీవు మైండ్‌తో ఆడుతున్నావు. నేను హార్ట్‌తో ఆడుతున్నావు అనే పాయింట్‌పై వారిద్దరూ గొడవ పడ్డారు. అయితే వారి మధ్య జరిగిన గొడవ ఏం జరిగిందంటే...

    అఖిల్‌తో వాగ్వాదం తర్వాత

    అఖిల్‌తో వాగ్వాదం తర్వాత

    అఖిల్‌తో వాగ్వాదం తర్వాత మోనాల్ భోరుమని ఏడుస్తూ కిచెన్‌లోకి పరుగులు పెట్టింది. ట్యాప్ వద్దకు వెళ్లి ముఖంపై నీళ్లు చల్లుకొంటూ భోరున ఏడ్చింది. ఆమె వెనుకనే హారిక దేత్తడి పరుగెత్తుకొంటూ వచ్చి ఆమెను సముదాయించే ప్రయత్నం చేసింది. అయినా అరియానా వెక్కివెక్కి ఏడ్చింది. ఆ సందర్భంగా వాళ్లు చేస్తే రైట్.. నేను చేస్తే తప్పు అంటూ మండిపడింది.

    నా ఫ్యామిలీ కోసం బిగ్‌బాస్‌కు

    నా ఫ్యామిలీ కోసం బిగ్‌బాస్‌కు

    నేను ఒకరి కోసం ఇక్కడికి రాలేదు. ఒకరి ఫీలింగ్స్ గురించి పట్టించుకోదలచుకోలేను. నా ఫ్యామిలీ కోసం బిగ్‌బాస్‌లో గేమ్ ఆడటానికి వచ్చాను. ఎఫర్ట్స్ పెట్టడం వల్లే ఇక్కడ ఉన్నాను. ఇంటిలోకి వచ్చిన తర్వాత మూడు వారాలు ఎంత మెంటల్ టెన్షన్ అనుభవించానో నాకు తెలుసు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అంటూ హారికతో మోనాల్ బాధను పంచుకొన్నది.

    కెప్టెన్ ఉండరని చెప్పడంతో

    కెప్టెన్ ఉండరని చెప్పడంతో

    ఇంటికి ఇక కెప్టెన్ ఉండడు అని బిగ్‌బాస్ చెప్పినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. బాత్రూంలోకి వెళ్లి ఏడ్చాను. కెప్టెన్సీ అనేది నా హోప్. నేను మంచి గేమ్ కోసం ఎంతగా ప్రిపేర్ అయ్యాను. నామినేట్ అయినప్పుడు ఎంతో బాధపడ్డానో నాకు తెలుసు. ప్రతీ వారం నామినేట్ అయ్యాను. అలా నామినేట్ అయితే నా మానసిక స్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అని మోనాల్ అన్నారు.

    వాళ్లు నామినేట్ చేస్తే చిరునవ్వుతో

    వాళ్లు నామినేట్ చేస్తే చిరునవ్వుతో

    టాస్క్ ఆడటం ఒక్కటే గేమ్ కాదు. ఇంటి నియమాలను పాటించడం కూడా గేమ్‌లో ఓ భాగమే. వాళ్లు నామినేట్ చేస్తే నేను స్మైల్‌తో అంగీకరిస్తాను. కానీ నేను నామినేట్ చేస్తే మాత్రం నన్ను టార్గెట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. 12 వారాలపాటు జర్నీ చేసిన తర్వాత ఒక్కొక్కరితో కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని చెబితే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నారు అంటూ హారికతో మోనాల్ ఎమోషనల్‌గా మారింది.

    నేను ప్రామిస్ బ్రేక్ చేయలేదు

    నేను ప్రామిస్ బ్రేక్ చేయలేదు

    నీ గేమ్ నీవు ఆడు.. నా గేమ్ నేను ఆడమని అఖిల్‌ నాతో అన్నాడు. నా గేమ్ నేను ఆడుతుంటే ప్రామిస్ బ్రేక్ చేసిందని అంటున్నాడు. ఇక అవినాష్ ప్రతీ వారం నన్ను నామినేట్ చేస్తున్నాడు. పులిహార చేయలేదని నామినేట్ చేశాడు. ఇది కరెక్టా అంటూ హారికతో తన బాధను చెప్పుకొన్నది.

    మోనాల్‌కు హారిక దేత్తడి ఓదార్పు

    మోనాల్‌కు హారిక దేత్తడి ఓదార్పు

    భోరుమని ఏడుస్తున్న మోనాల్‌ను హారిక దేత్తడి ఓదార్చింది. నీకు కొన్ని పాయింట్ల మీద క్లారిటీ ఉంది. నీ గేమ్ నీవు ఆడు. పులిహోరా చేయకపోతే నామినేట్ చేస్తాడా? అంటూ హరిక నవ్వుల్లో మునిగిపోయింది. దాంతో మోనాల్ కూడా కాస్త ఊరట చెంది మళ్లీ నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నది.

    Recommended Video

    TFC President Narayan Das Narang Thanks To CM KCR ఇండియా ఫిలిం హబ్‌గా హైదరాబాద్..!!
    అనూహ్యంగా హరిక, అఖిల్ నామినేట్

    అనూహ్యంగా హరిక, అఖిల్ నామినేట్

    ఇక 13వ వారం కోసం జరిగిన ఎలిమినేషన్‌లో ఐదుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. అఖిల్, హారికకు సమానంగా పాయింట్స్ రావడంతో టై జరిగింది. అయితే వారిద్దరి కూడా నామినేట్ చేస్తూ బిగ్‌బాస్ నిర్ణయం తీసుకొన్నారు. దాంతో అనూహ్యంగా వారిద్దరూ నామినేషన్‌లోకి రావడం షాక్ తగిలినంత పనైంది.

    English summary
    Bigg Boss Telugu 4s 13 week nominations list: As per Latest report, Abijeet, Akhil, Monal, Harika, Avinash has been nominated for elimination. In this occassion, Heat Arguments went between contestants. Monal Gajjar bursts over Akhil Sarthak and Mukku Avinash amid 13th nomination process
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X