ఐటమ్ సాంగ్‌కు మోనాల్ రెమ్యూనరేషన్ లీక్: 3 నిమిషాలకే బిగ్ బాస్ బ్యూటీ అంత తీసుకుందా!

మోనాల్ గజ్జర్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనడానికి తోడు, బయటకు వచ్చిన తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుండడమే. హౌస్‌లో ఉన్నప్పుడు అభిజీత్, అఖిల్ సార్థక్‌తో కలిసి లవ్ ట్రాకులు నడుపుతున్నట్లు రచ్చ చేసిన ఈ బ్యూటీ.. ఎలిమినేషన్ తర్వాత అవకాశాల మీద అవకాశాలు దక్కించుకుంటోంది. ఇటీవలే ఓ సినిమా ఐటమ్‌ సాంగ్‌కు ఓకే చెప్పిన మోనాల్ గజ్జర్.. దాని కోసం భారీగా ఛార్జ్ చేసిందని ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఆమె ఎంత తీసుకుంది? వివరాల్లోకి వెళితే...

ఏమాత్రం క్రేజ్ లేకున్నా బిగ్ బాస్ ఆఫర్

ఏమాత్రం క్రేజ్ లేకున్నా బిగ్ బాస్ ఆఫర్


తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘సుడిగాడు', ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది మోనాల్ గజ్జర్. దాని తర్వాత మరో చిత్రంలోనూ కనిపించింది. అయినప్పటికీ ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. దీంతో టాలీవుడ్‌కు దూరమై.. ఇతర భాషల సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది.

హౌస్‌లో ట్రైయాంగిల్ లవ్‌తో ఫుల్ ఫేమస్

హౌస్‌లో ట్రైయాంగిల్ లవ్‌తో ఫుల్ ఫేమస్

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగు పెట్టింది మోనాల్ గజ్జర్. అప్పటి నుంచే అందరితో మంచిగా మెలుగుతూ వచ్చింది. ఆ క్రమంలోనే అభిజీత్‌కు బాగా దగ్గరైంది. కొన్నాళ్ల పాటు అతడితో ట్రావెల్ చేసిన తర్వాత.. మరో కంటెస్టెంట్ అఖిల్ సార్థక్‌తో క్లోజ్ అయింది. ఒకేసారి ఇద్దరితో ట్రాక్స్ నడుపుతున్నట్లు చూపించడంతో ట్రైయాంగిల్ లవ్‌గా ఇది కనిపించింది.

అతడికి హగ్గులు ముద్దులతో రచ్చ రచ్చ

అతడికి హగ్గులు ముద్దులతో రచ్చ రచ్చ

రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో ప్రేమలో పడిపోయింది. నాగార్జున ముందే తన మనసులో A ఉన్నాడని చెప్పి షాకిచ్చింది. అప్పటి నుంచి అతడితోనే ఉంటూ అతడి కోసమే ఆడుతూ హైలైట్ అయింది. అలాగే, నామినేషన్స్ నుంచీ కాపాడుతూ వచ్చింది. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోయింది. దీంతో ఆమె బాగా పాపులర్ అయిపోయింది.

చివరి మెట్టుపై బోల్తా.. బయట మరోలా

చివరి మెట్టుపై బోల్తా.. బయట మరోలా

పలుమార్లు నామినేషన్స్‌లో ఉన్న సేఫ్ అవుతూ వచ్చింది మోనాల్ గజ్జర్. దీంతో మంచి మంచి కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఆ సమయంలో బిగ్ బాస్‌పై విమర్శలు కూడా చెలరేగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫినాలేకు ఒక వారం ముందు ఆమె ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందీ గుజరాతీ భామ.

డ్యాన్స్ షోతో పాటు ఐటమ్ సాంగ్ కూడా

డ్యాన్స్ షోతో పాటు ఐటమ్ సాంగ్ కూడా


బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్‌తో మోనాల్ గజ్జర్ స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికైంది. ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న ఈ షో ఇప్పటికే ప్రారంభం అయింది. దీని తర్వాత ఆమె.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ తెరకెక్కిస్తోన్న ‘అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ చేస్తోంది. ఈ విషయాన్ని ఇటీవలే మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆ సాంగ్‌కు మోనాల్ రెమ్యూనరేషన్ లీక్

ఆ సాంగ్‌కు మోనాల్ రెమ్యూనరేషన్ లీక్


మోనాల్ గజ్జర్ స్పెషల్ సాంగ్ చేస్తుండడంతో అందరి దృష్టంతా ‘అల్లుడు అదుర్స్' మీదే పడింది. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా కోసం చాలా మంది వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ కోసం ఆమె తీసుకున్న రెమ్యూనరేషన్ లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మూడు నిమిషాల ఈ పాట కోసం బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ ఏకంగా రూ. 15 లక్షలు తీసుకుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X