షాకింగ్: మోనాల్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్.. బిగ్ బాస్ చరిత్రలోనే ఖరీదైన కంటెస్టెంట్‌గా రికార్డ్!

సాధారణ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ హీరోయిన్ మోనాల్ గజ్జర్. సాదాసీదా అమ్మాయిలా కనిపించినా.. ఆరంభంలోనే లవ్ ట్రాకులు నడిపిస్తూ హాట్ టాపిక్ అయిపోయింది. అప్పటి నుంచి తరచూ ఏదో ఒక వివాదంలో ఉంటూ హైలైట్ అవుతూ వచ్చింది. ఇక, గత వారం షో నుంచి ఎలిమినేట్ అయిన ఆమె... వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో కోసం మోనాల్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు లీకయ్యాయి. దీని ప్రకారం.. షో చరిత్రలోనే ఎక్కువ తీసుకున్న కంటెస్టెంట్‌గా రికార్డులకెక్కింది. ఆ వివరాలు మీకోసం!

ఇద్దరితో ట్రాకులు నడిపి హాట్ టాపిక్‌గా

ఇద్దరితో ట్రాకులు నడిపి హాట్ టాపిక్‌గా

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే మోనాల్ గజ్జర్ తరచూ వార్తల్లో నిలుస్తోంది. షో ఆరంభంలో అభిజీత్‌తో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించిన ఆమె.. కొద్ది రోజులకు అతడికి దూరమైంది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తో క్లోజ్ అయింది. అప్పటి నుంచి అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హైలైట్ అయింది. ఫలితంగా ట్రోల్స్‌కు కూడా గురైంది.

గొడవల్లో భాగం.. మోనాల్‌పై విమర్శలు

గొడవల్లో భాగం.. మోనాల్‌పై విమర్శలు

బిగ్ బాస్ హౌస్‌లో తన మార్క్ చూపించేందుకు ఎంతగానో శ్రమించింది మోనాల్ గజ్జర్. ఇందులో భాగంగానే తరచూ ఏదో ఒక గొడవలో భాగం అవుతూ వచ్చింది. అంతేకాదు, కొందరి మధ్య తగాదాలు పెట్టేలా వ్యవహరించింది. దీంతో ఆమెను కొందరు కంటెస్టెంట్లు నేరుగానే విమర్శించారు. అదే సమయంలో బయట ప్రేక్షకులు కూడా మోనాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

గ్లామర్.. లవ్ ట్రాకుల కోసమే ఉంచారు

గ్లామర్.. లవ్ ట్రాకుల కోసమే ఉంచారు

మిగిలిన కంటెస్టెంట్లతో పోలిస్తే మోనాల్ గజ్జర్ ఆట పెద్దగా ఆడదన్న టాక్ ఉంది. అంతేకాదు, టాస్కుల్లోనూ అంతగా శ్రమించదన్న పేరు ఉంది. దీంతో ఆమెను ఎలిమినేట్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ, చాలా రోజులు కొనసాగిస్తూ వచ్చారు. దీంతో గ్లామర్ షో, లవ్ ట్రాకులు నడుపుతున్న కారణంగానే ఆమెను షోలో కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి.

చివర్లో ఎలిమినేట్ అయిన హాట్ బ్యూటీ

చివర్లో ఎలిమినేట్ అయిన హాట్ బ్యూటీ

ఈ సీజన్‌లో మోనాల్ గజ్జర్‌కు బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడన్న ప్రచారం జోరుగా సాగుతూ వచ్చింది. అంతేకాదు, ఆమెను దత్త పుత్రికలా చూసుకుంటున్నాడన్న విమర్శలూ వచ్చాయి. దీంతో ఆమె ఫినాలేలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలోనే 14వ వారం చివర్లో మోనాల్‌ గజ్జర్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

మోనాల్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్

మోనాల్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్

నాలుగో సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఛానెల్ తర్వాత ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది మోనాల్ గజ్జర్. ఈ సందర్భంగా బిగ్ బాస్‌లో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలనూ బయట పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి.

బిగ్ బాస్ చరిత్రలోనే ఖరీదైన కంటెస్టెంట్‌

బిగ్ బాస్ చరిత్రలోనే ఖరీదైన కంటెస్టెంట్‌

తాజా సమాచారం ప్రకారం... మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో కోసం ఏకంగా రూ. 93 లక్షలు చార్జ్ చేసిందట. అంటే వారానికి సగటున ఆరున్నర లక్షలు. అంటే బిగ్ బాస్ విజేతకు ఇచ్చే ఫ్రైజ్‌మనీ కంటే రెండితలు. గతంలో శ్రీముఖి రూ. కోటి వరకూ చార్జ్ చేసిందని ప్రచారం జరిగింది. ఈ లెక్కన ఆమె తర్వాత బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న రెండో కంటెస్టెంట్ మోనాలే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X