Just In
- 39 min ago
నా పేరు రంగడు వీడి పేరు.. హద్దులు దాటుతోన్న హైపర్ ఆది డబుల్ మీనింగ్
- 1 hr ago
అది కంట్రోల్ చేయడమే నా పేరుకు అర్థం.. ఎద అందాలతో చిచ్చుపెట్టిన ఊర్వశీ
- 2 hrs ago
ఇదెక్కడి వింతరా బాబు.. సుత్తితో కొట్టేసుకుంటోన్న హీరో.. వీడియో వైరల్
- 2 hrs ago
నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
Don't Miss!
- Finance
ఆనంద్ మహీంద్ర గిప్ట్: ఆరుగురు టీమిండియా ప్లేయర్లకు కార్లు బహుమానం..
- News
ఎవరి ప్రాపకం కోసం ఎన్నికలు .. ఎస్ఈసీ నిమ్మగడ్డపై విరుచుకుపడిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- Sports
ఏదైనా చేసుకోండి.. మేం మాత్రం అక్కడికి వెళ్లం! బీసీసీఐకి రవిశాస్త్రి హెచ్చరిక!
- Automobiles
డిసెంబర్లో ఫర్వాలేదనిపించిన బజాజ్; ఏ మోడల్ ఎక్కువగా అమ్ముడైందంటే..
- Lifestyle
సెక్స్ సమయంలో మీరు ఈ పని చేస్తే ఏమి జరుగుతుంది?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మరోసారి బయటపడ్డ మోనాల్ ప్రేమ: అఖిల్‌తో అలా.. అర్ధరాత్రి అభిజీత్‌తో ఇలా!
మోనాల్ గజ్జర్.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరు. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఒక కంటెస్టెంట్‌గా ఈమె అడుగు పెట్టడమే. ఈ సీజన్‌లో మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఆమె... మిగిలిన అందరితో చక్కగా మెలుగుతూ మంచి పేరు తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత అభిజీత్, అఖిల్ సార్థక్‌తో ట్రైయాంగిల్ లవ్ నడుపుతుందన్న టాక్‌తో విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎవరిని ప్రేమిస్తుందో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో మరొకరితో ఉన్న బంధంపైనా స్పందించింది. వివరాల్లోకి వెళ్తే...

ఆ కంటెస్టెంట్‌కు దగ్గరైన మోనాల్
గుజరాత్‌కు చెందిన మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచే ఆమె అభిజీత్‌తో చనువుగా ఉంటూ కనిపించింది. దీంతో షో నిర్వహకులు సైతం వీళ్లిద్దరినే బాగా హైలైట్ చేశారు. అప్పటి నుంచి ఈ జంట ప్రేమాయణం సాగిస్తుందన్న ప్రచారం జోరందుకుంది. ఇదే షో మొత్తం కొనసాగుతుందని అంతా అనుకున్నారు.

అతడు ఎంట్రీతో మొత్తం మారింది
అభిజీత్ - మోనాల్ జోడీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌కే హైలైట్ అవుతుందని అనుకుంటున్న సమయంలో.. వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. ఎప్పుడైతే అతడు వచ్చాడో.. అప్పటి నుంచి మోనాల్ పూర్తిగా మారిపోయింది. ఒక్కోసారి అభిజీత్‌తో.. ఒక్కోసారి అఖిల్‌తో మాట్లాడుతూ వచ్చింది. దీంతో ఈ బంధాన్ని ట్రైయాంగిల్ లవ్ అని అనుకునేలా చేసింది బిగ్ బాస్ యూనిట్.

క్యారెక్టర్‌ను తనే బ్యాడ్ చేసుకుంది
కొద్దిసేపు అభిజీత్‌తో కొద్దిసేపు అఖిల్‌తో చనువుగా ఉండడంతో మోనాల్ గజ్జర్‌పై విమర్శలు చెలరేగాయి. ఒకానొక సందర్భంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా ఆమె గురించి వివాదాస్పద కామెంట్లు చేశారు. దీనికితోడు తన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలిచింది మోనాల్. అఖిల్ సార్థక్‌కు ముద్దులు, హగ్గులు ఇచ్చి తనను తానే బ్యాడ్ చేసుకుంది కూడా.

సొంతంగా ఆడడంతో దూరమైంది
ఇటీవల జరిగిన కెప్టెన్సీ టాస్క్ వరకు మోనాల్ గజ్జర్ ఆట బయటకు రాలేదు. అందులో హారికను గెలిపించేందుకు ఆమె ఎంతగానో శ్రమించింది. ఈ విషయంలో అఖిల్‌ను ఎదురించడంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. దీనికితోడు నామినేషన్ ప్రక్రియలో అఖిల్ చేసిన కామెంట్లకు మోనాల్ కూడా గట్టిగానే బదులిచ్చింది. దీంతో ఈ జంట మధ్య దూరం బాగా పెరిగిపోయంది.

ప్రేమను బయటపెట్టిన మోనాల్
తనను అఖిల్ ఎంతగా ద్వేషిస్తున్నాడో మోనాల్ గజ్జర్‌కు అర్థం అయింది. దీనిపై ఎంతగానో బాధ పడిపోయిన ఆమె.. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో హారికతో తనలోని భావాలను పంచుకుంది. ‘అఖిల్ నన్ను ఫ్రెండ్‌లానే చూస్తున్నాడేమో.. నాకు ఆయన ఫ్యామిలీ మెంబర్‌లాంటోడు. ఈ విషయం ఎప్పుడో చెప్పా. అతడిపై ఉన్న లవ్‌ను ఇంతకంటే ఎలా చెప్పాలి' అంటూ కన్నీటి పర్యంతం అయింది.

మిడ్‌నైట్‌లో అభిజీత్‌తో కబుర్లు
అఖిల్ సార్థక్‌తో దూరం పెరిగిన సమయంలోనే మోనాల్ గజ్జర్.. అభిజీత్‌తో కలిసి చాలా సమయం మాట్లాడడం హాట్ టాపిక్ అవుతోంది. మిడ్ నైట్ అందరూ పడుకున్న సమయంలో వీళ్లిద్దరూ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సమయంలో అభీకి మోనాల్ సారీ చెప్పింది. అప్పుడు అతడు కూడా ‘మీ అమ్మకు అర్థం అయింది నీకింకా కావడం లేదం'టూ నవ్వేశాడు.