అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్: తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్.. మొత్తం రివీల్ చేసింది!

అప్పుడెప్పుడో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్‌గా పరిచయం అయింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. రెండు మూడు సినిమాలు మాత్రమే చేసిన తర్వాత టాలీవుడ్‌కు దూరమైపోయింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ నాలుగో సీజన్ కోసం మరోసారి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అందులో ఆటతీరు, గ్లామర్ షో, లవ్ ట్రాకులతో విపరీతమైన క్రేజ్‌ను అందుకుంది. షో ముగిసిన తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో అఖిల్‌తో ట్రాక్, అసలు లవర్ ఇలా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే..

మోనాల్ ఫేమస్ అవడానికి కారణం అదే

మోనాల్ ఫేమస్ అవడానికి కారణం అదే

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. షో ఆరంభంలో యంగ్ హీరో అభిజీత్‌తో చనువుగా ఉంటూ వచ్చిన ఆమె.. అదే సమయంలో మరో యంగ్‌స్టర్ అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్ అయింది. దీన్నే అదునుగా చేసుకున్న బిగ్ బాస్ నిర్వహకులు.. వీళ్ల మధ్య ట్రయాంగిల్ లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చూపించారు. దీంతో ఆమెకు చెడ్డపేరు వచ్చింది.

PICS: Srilanka Actress Piumi Hansamali Photos goes viral on internet Photos

అతడితోనే లవ్వాట... చనువుగా ఉంటూ

అతడితోనే లవ్వాట... చనువుగా ఉంటూ


రోజులు గడిచిన కొద్దీ మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌తో మరింత క్లోజ్ అయిపోయింది. అతడిపై ప్రేమను చూపిస్తూ తరచూ హైలైట్ అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే తన మనసులో A ఉన్నాడని కూడా చెప్పింది. అంతేకాదు, అప్పటి నుంచి మరింత రెచ్చిపోయిన ఈ గుజరాతీ భామ.. అఖిల్‌కు ముద్దులు, హగ్గులు ఇస్తూ హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో ఆమెపై విమర్శలు వచ్చాయి.

షోలో ఊహించని విధంగా... చివర్లో ఇలా

షోలో ఊహించని విధంగా... చివర్లో ఇలా

ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చింది మోనాల్ గజ్జర్. కానీ, ఊహించని విధంగా ఆమె చాలా రోజుల పాటు షోలో కొనసాగింది. చక్కగా ఆడుతూ, ప్రేక్షకాదరణ ఉన్న సభ్యులు ఎలిమినేట్ అయినా.. ఆమె మాత్రం సేఫ్ అవుతూనే వచ్చింది. అయితే, ఫినాలేకు ఒక వారం ముందు అంటే పద్నాలుగో వారంలో మోనాల్ బయటకు వచ్చేసింది.

వరుస ఆఫర్లతో దూకుడు.. ఫుల్ బిజీగా

వరుస ఆఫర్లతో దూకుడు.. ఫుల్ బిజీగా

బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్ తెలుగులో మరోసారి తన హవా చూపిస్తోంది. ఇప్పటికే 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో ఐటం సాంగ్ చేసిన ఈ అమ్మడు.. ఓంకార్ నిర్వహిస్తున్న 'డ్యాన్స్+' అనే షోలోనూ జడ్జ్‌గా వ్యవహరిస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. అలాగే, వరుస ఇంటర్వ్యూలు, లైవ్ చాట్‌లతో బిజీ బిజీగా గడుపుతోంది.

అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్ గజ్జర్

అఖిల్‌కు భారీ షాకిచ్చిన మోనాల్ గజ్జర్


తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌తో ఉన్న బంధంపై క్లారిటీ ఇచ్చింది. 'నేను ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్లంతా గుర్తుపడుతున్నారు. అలాగే, అఖిల్ గురించి కూడా అడుగుతున్నారు. వాస్తవానికి అందరూ అనుకుంటున్నట్లు మా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడవడం లేదు. అతడు నాకు స్నేహితుడు మాత్రమే. అలాగే, ఉన్నాం కూడా' అంటూ షాకిచ్చింది.

తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్

తన అసలు లవర్ పేరు చెప్పి ఎమోషనల్

ఇదే ఇంటర్వ్యూలో తన మాజీ లవర్ గురించి వివరిస్తూ.. 'నేను సౌతిండియాకు చెందిన ఆర్యన్ అనే వ్యక్తితో నాలుగేళ్ల పాటు ప్రేమలో ఉన్నా. తర్వాత మా ఇద్దరి మధ్యా విభేదాలు రావడంతో విడిపోయాం. అందుకే తెలుగు సినిమాలతో పాటు దక్షిణాదికి దూరమైపోయా. ఆ సమయంలో గుజరాత్‌లో మూవీలు చేశా. మళ్లీ ఇప్పుడు మీ ముందుకు వచ్చాను' అని చెప్పుకొచ్చింది మోనాల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X