అమ్మాయి ముందు అలా చేయొచ్చా.. దానికి చాలా ఏడ్చాను: అభిజీత్‌పై మోనాల్ కంప్లైంట్స్

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభం అయిన రోజు నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో పోలిస్తే ఈ సీజన్‌లో అన్నీ కొత్తగానే కనిపిస్తుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మరీ ముఖ్యంగా ప్రస్తుత సీజన్‌లో లవ్ ట్రాకులను బాగా హైలైట్ చేస్తుండడంతో షో మరింత రంజుగా నడుస్తోంది. ఇందులో అభిజీత్ - మోనాల్ గజ్జర్ - అఖిల్ సార్థక్‌ల ట్రైయాంగిల్ లవ్ ట్రాక్ బాగా ఫేమస్ అయింది. కానీ ఆ తర్వాత అభి ఆమె నుంచి దూరమయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గ్యాప్ కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ అతడి క్యారెక్టర్‌పై ఆరోపణలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

స్టేజ్ మీద మొదలైన ప్రేమ కహానీ

స్టేజ్ మీద మొదలైన ప్రేమ కహానీ

అందరు కంటెస్టెంట్లలా కాకుండా ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే అభిజీత్‌తో స్టేజ్ మీద ఓ ఆట ఆడించాడు నాగార్జున. అదే కొంత మంది హీరోయిన్ల ఫొటోలు చూపించి ఇందులో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడిగాడు. దీనికి ఆలోచించకుడా మోనాల్ గజ్జర్ పేరు చెప్పాడు. అంతకు ముందే ఆమె హౌస్‌లోకి ప్రవేశించడంతో ఇదంతా కావాలనే ప్లాన్ చేశారన్న టాక్ వినిపించింది.

ఎంట్రీ ఇవ్వగానే అల్లుకుపోయాడు

ఎంట్రీ ఇవ్వగానే అల్లుకుపోయాడు

తన తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి కంటెస్టెంట్‌కు వాటర్ ఇచ్చి స్వాగతం చెప్పింది మోనాల్. ఆ సమయంలోనే అభిజీత్ ఆమెతో మాటలు కలిపాడు. ఆ తర్వాత స్టేజ్‌పైన జరిగిన విషయాన్ని వెల్లడించాడు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత తరచూ ఆమెతోనే కనిపిస్తూ పులిహోర కలపడానికి ట్రై చేశాడు. దీంతో ఈ జంట బాగా ఫేమస్ అయింది.

అఖిల్ రాకతో ట్రైయాంగిల్ లవ్‌గా

అఖిల్ రాకతో ట్రైయాంగిల్ లవ్‌గా

నాలుగో సీజన్ ప్రారంభంలో అభిజీత్ - మోనాల్ గజ్జర్ జంట తెగ పాపులర్ అయింది. వీళ్ల ట్రాకును కంటిన్యూ చేయించి టీఆర్పీ రాబడతారని అంతా అనుకున్నారు. కానీ, అనూహ్యంగా వీళ్ల మధ్యలోకి అఖిల్ సార్థక్ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ ట్రాక్ ట్రైయాంగిల్ లవ్‌గా మారిపోయింది. ప్రేక్షకులకు నచ్చిన కంటెంట్ కావడంతో షో నిర్వహకులు దీనిపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు.

ఆమెకు దూరం జరిగిన అభిజీత్

ఆమెకు దూరం జరిగిన అభిజీత్

మొదట్లో తనతో చనువుగా ఉండి.. అఖిల్ సార్థక్ రాగానే అతడితో క్లోజ్ అయిన మోనాల్‌కు అభిజీత్ దూరంగా జరిగాడు. ట్రైయాంగిల్ లవ్ అని అనుకుంటున్న సమయంలో అతడు తప్పుకున్నాడు. దీంతో మోనాల్ - అఖిల్ ట్రాకును కంటిన్యూ చేస్తున్నారు. ఇది వాళ్లతో పాటు షోకు కూడా బాగా ప్లస్ అయింది. దీంతో అప్పటి నుంచి వీళ్ల జంటకు ఊహించని రీతిలో క్రేజ్ ఏర్పడింది.

పేరు చెబితేనే తట్టుకోలేకపోతూ

పేరు చెబితేనే తట్టుకోలేకపోతూ

ఎప్పుడైతే తనను కాదని మోనాల్.. అఖిల్‌తో ట్రాక్ నడుపుతుందో.. అప్పటి నుంచి అభిజీత్ తట్టుకోలేకపోతున్నట్లు చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. దీనిని దృష్టిలో ఉంచుకునే అతడు ఆమెతో మాట్లాడడం మానేశాడన్న టాక్ కూడా వినిపించింది. ఇక, ఈ వారం దెయ్యం టాస్కులో సైతం మోనాల్‌తో డేట్ అనే సరికి తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నాడీ మిస్టర్ కూల్.

Recommended Video

Middle Class Melodies Team Interview Part 8
అమ్మాయి ముందు అలా చేయొచ్చా

అమ్మాయి ముందు అలా చేయొచ్చా

అభిజీత్‌తో తనకు జరిగిన విషయాలపై మోనాల్ క్లారిటీ ఇచ్చింది. హారికతో మాట్లాడుతూ ‘తాను చేసిందే కరెక్ట్ అనుకుంటాడు అభి. కానీ, అతడు చాలా సార్లు తప్పు చేశాడు. నా ముఖం ముందే నేను నచ్చట్లేదని చెప్పాడు. ఇకపై నీతో మాట్లాడను అన్నాడు. అమ్మాయితో అలా చెబితే తట్టుకుంటుందా? బిగ్ బాస్ తర్వాత అభితో ఫ్రెండ్‌షిప్ కంటిన్యూ అవడం కష్టమే' అంటూ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X