twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీకు దండం పెడుతున్నా.. అఖిల్, అభిజిత్ విషయంలోకి లాగకండి.. భోరున ఏడ్చిన మోనాల్

    |

    బిగ్‌బాస్ ఇంటిలో 8 వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్‌లో మోనాల్ గజ్జర్ పాల్గొంటూ మెహబూబ్ దిల్‌సేను నామినేట్ చేసింది. తాను ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందనే విషయంపై మెహబూబ్‌కు క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత యాంకర్ లాస్యను నామినేట్ చేసి.. భావోద్వేగానికి గురైంది. మెనాల్ అలా ఎమోషనల్‌ కావడానికి కారణమేమిటంటే..

    అభిజిత్‌తో జరిగిన సంభాషణ

    అభిజిత్‌తో జరిగిన సంభాషణ

    వాష్ రూమ్‌లో అభితో నాకు సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. అభి దగ్గరకు వెళ్లి.. నేను నిన్ను మ్యానుపులేటర్ అని అన్నాను. నాకు, అభికి జరిగిన ఫైట్‌ను నీవు మరో విధంగా చెప్పావు. ఆ విషయాన్ని 50 రెట్లు పెంచి వివాదాస్పదం చేశావు. అందుకే అభిపై చేసిన కామెంట్ గురించి నేను క్లారిటీ ఇవ్వాలనుకొంటున్నాను అని మోనాల్ ఎమోషనల్‌గా మాట్లాడింది.

    నీవు చేసిన పనికి అలా వివాదంగా

    నీవు చేసిన పనికి అలా వివాదంగా

    అభితో జరిగిన ఫైట్ గురించి ఎవరికి ఇబ్బంది కాలేదు. కానీ నీవు చేసిన పనికి ఇది మరింత సమస్యగా మారింది. అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను. నీకు ఏదైనా అభ్యంతరం ఉంటే దానిపై మాట్లాడు అంటూ మెహబూబ్‌కు మోనాల్ సూచించింది. దాంతో అభితో ఫైట్ విషయంపై మెహబూబ్ క్లారిటీ ఇచ్చాడు.

    స్వాతికి మాత్రమే చెప్పాను

    స్వాతికి మాత్రమే చెప్పాను

    అభితో జరిగిన విషయాన్ని నేను స్వాతి, సోహైల్‌తో చెప్పిన విషయం నిజమే. స్వాతి వెళ్లి అభిజిత్‌కు చెబుతుందని అనుకొన్నాను. సోహైల్ కూడా ఉన్నాడు ఆ సమయంలో. స్వాతితో మాత్రమే ఈ విషయాన్ని షేర్ చేసుకొన్నాను అంటూ మెహబూబ్ వివరించాడు. దాంతో మోనాల్ స్పందిస్తూ.. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ చెబుతున్నావనే ఫీలింగ్ ఏర్పడింది అని అన్నారు.

    లాస్య అక్క.. నీవు వంట చేసి పెట్టలే

    లాస్య అక్క.. నీవు వంట చేసి పెట్టలే

    ఆ తర్వాత యాంకర్ లాస్యను నామినేట్ చేస్తూ.. చాలా వారాలు నీవు చేసిన నాన్‌వెజ్ తిన్నాం. ఆరో వారంలో నాకు ఆరోగ్యం సరిగా లేదు. హారిక నన్ను బాగా చూసుకొన్నది. అందుకు చాలా థ్యాంక్స్. ఆ సమయంలో మీరు అంతా నవరాత్రి సందర్భంగా శాఖాహారం తీసుకొన్నారు. నాకు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బంది ఏర్పడింది. అక్క నాకు వంట చేసి పెట్టమని అడిగితే నాకు చేసి పెట్టలేదు అంటూ మోనాల్ పేర్కొన్నారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
    ఆ ఇద్దరి విషయంలోకి లాగకండి

    ఆ ఇద్దరి విషయంలోకి లాగకండి

    ఆ తర్వాత తన గురించి నామినేషన్ ప్రక్రియలో మాట్లాడుకోవడం నాకు చాలా ఇబ్బందిగా మారుతున్నది. అఖిల్, అభిజిత్ విషయంలో నన్ను లాగకండి. నామినేషన్ కోసం నా పేరు వాడొద్దు. నా రిలేషన్స్ విషయంలో ఎవరికైనా అనుమానాలు ఉంటే ఈ నామినేషన్‌తో పూర్తవ్వాలి. దయ చేసి ఇంకోసారి వారితో ముడిపెట్టి నా గురించి మాట్లాడకండి. ఏదైనా క్లారిటీ కావాలంటే నాతో నేరుగా మాట్లాడండి. మీకు చేతులెత్తి దండం పెడుతున్నా అంటూ మోనాల్ భోరున విలపించింది.

    English summary
    Bigg Boss Telugu 8th weekend show: Nominations for Eight week eliminations goes very furious. Ariana, Akhil, Lasya, Monal, Mehaboob were nominated in the shows. In this house, Monal Gajjar cried a lot due to Akhil Sarthak, Abijeet Issue in Bigg Boss Telugu's 8th week Nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X