వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్ గజ్జర్: వాళ్లంతా కావాలనే ఇలా చేశారు.. పెద్ద తప్పు జరిగిపోయిందంటూ!

చాలా ఏళ్ల క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఈ మధ్య కాలంలోనే పాపులారిటీని సంపాదించుకుంది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడం.. అందులో అఖిల్ సార్థక్‌తో కలిసి రచ్చ రచ్చ చేయడం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బయటకు వచ్చిన తర్వాత ఆమె తరచూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ షోలో మోనాల్ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అంతేకాదు, కొందరిపై సంచలన ఆరోపణలు చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

అల్లరి నరేష్ వల్ల ఎంట్రీ... గుర్తింపు రాలేదు

అల్లరి నరేష్ వల్ల ఎంట్రీ... గుర్తింపు రాలేదు

అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు చిత్ర సీమకు హీరోయిన్‌గా పరిచయం అయింది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి'తో పాటు పలు చిత్రాల్లో లీడ్ రోల్ చేసింది. కానీ, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. అప్పటి నుంచి గుజరాతీ సహా ఇతర భాషల్లో సినిమాలు చేసుకుంటూ తన హవాను చూపించింది.

బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. రావడమే లవ్ ట్రాక్

బిగ్ బాస్‌లోకి ప్రవేశం.. రావడమే లవ్ ట్రాక్

తెలుగులో పెద్దగా పాపులర్ కాకున్న గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఆమెకు అవకాశం వచ్చింది. కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే హీరో అభిజీత్‌తో లవ్ ట్రాక్ నడిపినట్లు కనిపించిన ఈ అమ్మడు.. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ క్లోజ్‌గా మూవ్ అయింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తుందన్న టాక్ వినిపించడంతో విమర్శలు వచ్చాయి.

హౌస్‌లో అతడితో రచ్చ.. ఫినాలేకు ముందు

హౌస్‌లో అతడితో రచ్చ.. ఫినాలేకు ముందు

కొద్ది రోజులకు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ప్రేమలో పడిపోయింది. అప్పటి నుంచి హౌస్‌లో వీళ్లిద్దరూ రచ్చ రచ్చ చేశారు. ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. త్యాగాలు చేసుకోవడం వంటి వాటితో ప్రేమను బయట పెట్టుకున్నారు. అదే సమయంలో తరచూ హగ్గులు, ముద్దులు ఇచ్చుకుంటూ హల్‌చల్ చేశారు. ఇక, అఖిల్ రన్నరప్‌గా నిలవగా.. మోనాల్ ఫినాలే ముందే వచ్చేసింది.

బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చింది

బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చింది

బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. ఇందులో భాగంగానే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది. ఆ తర్వాత అఖిల్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. వీటితో పాటు కొన్ని సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేస్తోంది. అలాగే, ఓంకార్ నడిపించే 'డ్యాన్స్ ప్లస్' షోకు జడ్జ్‌గానూ ఎంట్రీ ఇచ్చింది.

ఆమె పైనే ఫోకస్... ట్రాకులు కూడా హైలైట్

ఆమె పైనే ఫోకస్... ట్రాకులు కూడా హైలైట్

'డ్యాన్స్ ప్లస్' షోలో మోనాల్ జడ్జ్‌గా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటోంది. అలాగే, ఆమె డ్రెస్సింగ్ కూడా మెప్పించే విధంగా ఉంది. మొదట్లో అందాలను కనిపించేలా అలంకరించుకున్న ఈ భామ... ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు షో నిర్వహకులు. అదే సమయంలో కొన్ని ట్రాకులతో ఆమెను మరింత హైలైట్ చేస్తున్నారు.

షోలో వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్ గజ్జర్

షోలో వెక్కి వెక్కి ఏడ్చిన మోనాల్ గజ్జర్

ఆదివారం 'డ్యాన్స్ ప్లస్' షోలో ఎలిమినేషన్ రౌండ్ జరిగింది. ఇందులో మోనాల్ గజ్జర్‌కు చెందిన టీమ్ వెలాసిటీ, MMK జట్లు నామినేట్ అయ్యాయి. ఎలిమినేషన్ రౌండ్‌లో ఈ రెండు టీమ్‌లు ప్రదర్శన చేశాయి. ఆ తర్వాత ఎవరు మంచిగా చేశారో వాళ్లు ఉండి.. మరో టీమ్ బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో మోనాల్ గజ్జర్ చాలా సేపు వెక్కి వెక్కి ఏడ్చేసింది.

Recommended Video

Ek Mini Katha Film బోల్డ్ గా కొత్తగా | Santosh Shoban And Kavya Fun Moments | Filmibeat Telugu
కావాలనే ఇలా చేశారు.. తప్పు జరిగిందంటూ

కావాలనే ఇలా చేశారు.. తప్పు జరిగిందంటూ

ఎలిమినేషన్ రౌండ్‌లో మిగిలిన జడ్జ్‌లు అందరూ టీమ్ వెలాసిటీ మంచిగా చేసిందని చెప్పారు. దీంతో MMK టీమ్ ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు స్టేజ్‌ పైకి వచ్చిన మోనాల్ గజ్జర్.. 'ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. జడ్జ్‌లు అందరూ స్టార్లు ఇవ్వలేదు. వాళ్లలా చేయడం వల్లే ఈరోజు నా టీమ్‌లకు ఈ పరిస్థితి వచ్చింది. తప్పు జరిగిపోయింది' అంటూ మరోసారి బోరుమని ఏడ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X