అఖిల్‌ను మోసం చేసిన మోనాల్: అతడికి ఒకలా చెప్పి.. ఈ కంటెస్టెంట్‌తో మరోలా అనడంపై డౌట్స్

అప్పుడెప్పుడో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. అయితే, బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత మాత్రం ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. మరీ ముఖ్యంగా అఖిల్ సార్థక్‌తో ట్రాకు వల్ల ఫేమస్ అయింది. ఇటీవలే ఎలిమినేట్ అయిన ఆమె.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా అతడిపై ఉన్న ఇష్టాన్ని బహిరంగంగానే వెల్లడిస్తోంది. అయితే, తాజాగా చెప్పిన ఓ మాటతో అఖిల్‌ను మోసం చేస్తుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

లవ్ ట్రాకులే ఆమెను హైలైట్ చేశాయి

లవ్ ట్రాకులే ఆమెను హైలైట్ చేశాయి

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి మొదటి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. మొదటి రోజు నుంచే అభిజీత్‌కు దగ్గరై లవ్ ట్రాకు నడుపుతున్నట్లు కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ నడుస్తుందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత అభికి దూరమై అఖిల్‌కు దగ్గరైంది. ఇలా ఆమె బాగా పాపులర్ అయిపోయింది.

 బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరు వచ్చింది

బిగ్ బాస్ దత్తపుత్రికగా పేరు వచ్చింది

బిగ్ బాస్ హౌస్‌లో లవ్ ట్రాకులు.. ముద్దులు.. హగ్గులు.. స్కిన్ షో మినహా మోనాల్ గజ్జర్ చేసిందేమీ లేదన్న అభిప్రాయాలు బాగా వ్యక్తం అయ్యాయి. ఆ సమయంలోనే టాస్కుల్లో సరిగా ఆడదన్న చెడ్డ పేరు కూడా వచ్చింది. అయినప్పటికీ ఎన్నో సార్లు నామినేట్ అయినా.. ఆమె మాత్రం సేఫ్ అవుతూనే వచ్చింది. దీంతో మోనాల్‌కు బిగ్ బాస్ దత్తపుత్రిక అనే బిరుదు వచ్చింది.

టాప్-5కు చేరకుండానే షో నుంచి ఔట్

టాప్-5కు చేరకుండానే షో నుంచి ఔట్

మోనాల్ గజ్జర్ విషయంలో బిగ్ బాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. ప్రజాధరణ ఉన్న కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేసి ఆమెను షోలో కొనసాగించడంతో ఫినాలేకు కూడా తీసుకెళ్తారన్న టాక్ బాగా వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఆమెను ఎలిమినేట్ చేశారు. దీంతో టాప్-5కు చేరకుండానే ఆమె షో నుంచి బయటకు వచ్చేసింది.

 ఎలిమినేట్ అయినా లాభమే జరిగింది

ఎలిమినేట్ అయినా లాభమే జరిగింది

బిగ్ బాస్ హౌస్‌లో పద్నాలుగు వారాలు కొనసాగింది మోనాల్ గజ్జర్. అసలేమాత్రం అంచనాలు లేకున్నా ఆమె అన్ని రోజులు షోలో ఉండడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక, ఈ షో వల్ల మోనాల్‌కు లాభమే జరిగింది. బయట టాక్ ప్రకారం.. మొత్తగా రూ. 90 లక్షల పైచిలుకు రెమ్యూనరేషన్ అందుకున్న ఆమె.. షో తర్వాత సినిమా ఆఫర్లు కూడా దక్కించుకుంటుందట.

అఖిల్‌ను మోనాల్ మోసం చేసినట్లేనా

అఖిల్‌ను మోనాల్ మోసం చేసినట్లేనా


గత వారమే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన మోనాల్ గజ్జర్.. తాజాగా షోలోకి రీఎంట్రీ ఇచ్చింది. మాజీ కంటెస్టెంట్ల రీయూనియన్ నిర్వహించడంతో హౌస్‌లోకి వచ్చిన ఆమె.. తనదైన శైలి మాటలతో ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌తో ఎక్కువ సమయం గడిపింది. ఈ క్రమంలోనే తన ప్రియ కంటెస్టెంట్‌ను మోసం చేసినట్లు అనిపించింది.

అక్కడలా చెప్పి.. ఇక్కడిలా అనడంతో

అక్కడలా చెప్పి.. ఇక్కడిలా అనడంతో

మోనాల్ మాట్లాడుతూ.. ‘మూడు రోజుల నుంచి నిద్ర పట్టడం లేదు అఖిల్.. ప్రతి రోజు 3-4 అవుతుంది. ఈరోజు ఇక్కడికి రావాలని నిద్రపోయా' అంటూ చెప్పింది. అంతకు ముందే సోహెల్‌తో ‘రోజూ ఇష్టం ఉన్న ఐటమ్స్ అన్నీ ఫుల్‌గా తింటున్నా.. బిర్యానీ కూడా.. హాయిగా నిద్రపోతున్నా' అని చెప్పింది. అతడికి ఒకలా.. ఇతడికి ఒకలా చెప్పడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X