నేనేమీ తప్పు చేయలేదు.. ఎందుకలా చేస్తున్నారు: సెల్ఫీ వీడియోలో షాకింగ్ విషయాలు చెప్పిన మోనాల్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా గుర్తింపును దక్కించుకోలేకపోయింది గుజరాతీ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్. దీంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన ఈ భామ.. బిగ్ బాస్ షో ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో ఆమె వ్యవహరించిన తీరుతో రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఊహించని విధంగా ముందుకు సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో షేర్ చేసింది. అందులో నేనేమీ తప్పు చేయలేదంటూ షాకింగ్ విషయాలు చెప్పింది. ఆ వివరాలు మీకోసం!

అలా ఎంటరైంది.. ఇలా రీఎంట్రీ ఇచ్చింది

అలా ఎంటరైంది.. ఇలా రీఎంట్రీ ఇచ్చింది

అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. ఆ తర్వాత 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి'తో పాటు పలు చిత్రాల్లోనూ నటించింది. ఇక్కడ సరైన గుర్తింపు రాకపోవడంతో టాలీవుడ్‌ను వీడింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం మళ్లీ హైదరాబాద్‌లో అడుగు పెట్టిందీ గుజరాతీ ముద్దుగుమ్మ.

ఒకేసారి ఇద్దరితో.. మోనాల్ తీరుతో షాక్

ఒకేసారి ఇద్దరితో.. మోనాల్ తీరుతో షాక్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో యంగ్ హీరో అభిజీత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది మోనాల్. ఇలా చాలా రోజులు అతడితో క్లోజ్‌గా కనిపించింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా వ్యవహరించింది. దీంతో ఇద్దరితో ఒకేసారి ట్రాక్ నడుపుతుందని అప్పట్లో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో మోనాల్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

అతడితో హల్‌చల్.. ముద్దులు, హగ్గులు

అతడితో హల్‌చల్.. ముద్దులు, హగ్గులు

క్రమంగా మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్ ప్రేమలో మునిగిపోయింది. ఎప్పుడూ అతడితోనే ఉంటూ.. అతడి కోసమే ఆడుతూ హాట్ టాపిక్ అయింది. అంతేకాదు, తరచూ ప్రేమను వ్యక్తపరచుకోవడంతో పాటు పొగుడుకోవడం వంటివి చేసింది. అదే సమయంలో ముద్దులు, హగ్గులు ఇస్తూ వార్తల్లో నిలిచింది. ఇలా బిగ్ బాస్ హౌస్‌లో చాలా రోజులు పాటు ప్రేమాయణం సాగిస్తున్నట్లు కనిపించింది.

బిగ్ బాస్ వల్లే లాభం... ఇప్పటికే రెండు

బిగ్ బాస్ వల్లే లాభం... ఇప్పటికే రెండు

మామూలు కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. పద్నాలుగు వారాల పాటు షోలో కొనసాగింది. దీని ద్వారా రూ. 50 లక్షలు పైగానే సంపాదించింది. ఈ షో వల్ల క్రేజ్‌ను కూడా భారీగానే అందుకున్న ఈ అమ్మడు.. వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. ఓంకార్ 'డ్యాన్స్+' అనే షోకు జడ్జ్‌గా ఎంపికవడంతో పాటు 'అల్లుడు అదుర్స్'లో ఐటమ్ సాంగ్ కూడా చేసింది.

అఖిల్‌తో కలిసిన మోనాల్.. ప్రకటించింది

అఖిల్‌తో కలిసిన మోనాల్.. ప్రకటించింది

ప్రేమికుల రోజును పురస్కరించుకుని అఖిల్ సార్థక్‌తో చేస్తున్న వెబ్ సిరీస్‌ను ప్రకటించింది మోనాల్ గజ్జర్. 'తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే టైటిల్‌తో వస్తున్న దీన్ని సరస్వతి క్రియేషన్స్ బ్యానర్‌పై భాస్కర్ బంతుపల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అంతేకాదు, ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

 నేనేమీ తప్పు చేయలేదంటూ సెల్ఫీ వీడియో

నేనేమీ తప్పు చేయలేదంటూ సెల్ఫీ వీడియో

తన కొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించిన మోనాల్ గజ్జర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియోను స్టోరీగా పోస్ట్ చేసింది. 'నా గురించి మీరు ఆలోచించే దానికి ధన్యవాదాలు. నేనేమీ తప్పు చేయలేదు. దయచేసి నా నిర్ణయాన్ని గౌరవించండి. ఈ విషయంలో ఎవరినీ నిందించవద్దు. నన్ను ట్రోల్ చేసినా పట్టించుకోకండి. నాకు ఫైట్స్ అంటే ఇష్టం ఉండదు' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X