నా బట్టలను కూడా వదల్లేదు.. అందాలను చూపించడం వల్లే: మోనాల్ షాకింగ్ కామెంట్స్

'సుడిగాడు', 'బ్రదర్ ఆఫ్ బొమ్మాలి' వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయింది మోనాల్ గజ్జర్. ఆ సినిమాల వల్ల ఆమెకు పెద్దగా పాపులారిటీ అయితే రాలేదు. కానీ, ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనడం వల్ల మంచి గుర్తింపును అందుకుంది. ఇక, ఇటీవల ఎలిమినేట్ అయిన ఆమె.. షో గురించి, అందులో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయట పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన డ్రెస్సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

వాళ్ల వల్లే బాగా పాపులర్ అయిన బ్యూటీ

వాళ్ల వల్లే బాగా పాపులర్ అయిన బ్యూటీ

బిగ్ బాస్ హౌస్‌లోకి సాదాసీదా కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది మోనాల్ గజ్జర్. మొదటి రోజు ఫస్ట్ కంటెస్టెంట్‌గా వెళ్లిన ఆమె.. తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికీ వాటర్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, షో నడుస్తున్న కొద్దీ అభిజీత్, అఖిల్ సార్థక్‌తో లవ్ ట్రాకులు నడుపుతున్నట్లు కనిపించింది. వీటి వల్లే మోనాల్ గజ్జర్ విపరీతంగా పాపులర్ అయింది. తరచూ వార్తల్లోనూ నిలిచింది.

వాటి వల్లే ఆమెను షోలో ఉంచుతున్నారు

వాటి వల్లే ఆమెను షోలో ఉంచుతున్నారు

బిగ్ బాస్ హౌస్ నుంచి మోనాల్ గజ్జర్ ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది. ఆమెను కాదని మంచిగా ఆడేవారిని, ప్రేక్షకాదరణ ఉన్న వారిని షో నుంచి బయటకు పంపేశారు. దీంతో నిర్వహకులపై ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. లవ్ ట్రాకులు, మసాలా సన్నివేశాలు చూపించడం కోసమే మోనాల్‌ను షోలో కొనసాగిస్తున్నారని చాలా మంది రకరకాల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

మోనాల్‌పై కంటెస్టెంట్లు షాకింగ్ కామెంట్లు

మోనాల్‌పై కంటెస్టెంట్లు షాకింగ్ కామెంట్లు

సాధారణ ప్రేక్షకులే కాదు.. బిగ్ బాస్ హౌస్‌లో ఉండి వచ్చిన నాలుగో సీజన్ కంటెస్టెంట్లు కూడా మోనాల్ గజ్జర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కరాటే కల్యాణీ అయితే నేరుగా ఆమె డ్రెస్సింగ్‌పై మాట్లాడింది. గ్లామర్ షో చేయడం వల్లే ఆమెను ఉంచుతున్నారని అనేసింది. అలాగే, పలువురు కంటెస్టెంట్లు కూడా ఆమె వ్యవహార శైలిని ఎండగట్టారు. అలాగే దారుణంగా విమర్శించారు.

చివర్లో బయటకు.. ఫుల్ బిజీగా మారింది

చివర్లో బయటకు.. ఫుల్ బిజీగా మారింది

ప్రతి వారం నామినేషన్‌లో ఉన్నా సేఫ్ అవుతూ వచ్చింది మోనాల్ గజ్జర్. దీంతో ఆమెను ఫైనల్‌కు చేరుస్తారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 14వ వారమే బయటకు వచ్చేసింది. దీంతో ఫినాలేకు ఒక మెట్టు ముందు కిందకు పడిపోయినట్లైంది. ఇక, ఎలిమినేట్ అయిన తర్వాత మోనాల్ వరుస ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా చాట్‌లతో బిజీ బిజీగా గడపుతోంది.

డ్రెస్‌పై మోనాల్ గజ్జర్ షాకింగ్ కామెంట్స్

డ్రెస్‌పై మోనాల్ గజ్జర్ షాకింగ్ కామెంట్స్

నాలుగో సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక ఛానెల్ తర్వాత ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూలు ఇస్తోంది మోనాల్ గజ్జర్. ఈ సందర్భంగా బిగ్ బాస్‌లో జరిగిన ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అదే సమయంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాలనూ బయట పెడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన డ్రెస్‌ గురించి మోనాల్ గజ్జర్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

బట్టలను కూడా వదల్లేదంటూ ఆవేదన

బట్టలను కూడా వదల్లేదంటూ ఆవేదన

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ట్రోల్స్ చేసే వారు ఆఖరికి నా డ్రెస్‌ను కూడా వదల్లేదు. కొందరు నా డీప్ నెక్ డ్రెస్ గురించి విపరీతమైన కామెంట్లు చేశారు. నిజానికి నేను అందాలను చూపించడం కోసం ఆ డ్రెస్ వేసుకోలేదు. నిజానికి నాకు హెల్త్ అస్సలు బాలేదు. ఆయిల్ హెయిర్‌తో ఛోటీ వేసుకున్నా. ఇవన్నీ జనాలకు ఏం తెలియదు' అంటూ ఎమోషనల్ అయింది మోనాల్ గజ్జర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X