ఇది బీ గ్రేడ్ షూటింగ్ అనుకుంటున్నావా?.. ఆ ఒక్క విషయంతో మోనాల్ ఇమేజ్ డ్యామేజ్
బిగ్ బాస్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ లో కూడా మొదలైంది. షో యొక్క రేటింగ్స్ పెంచడానికి ఒక వైపు నిర్వహకుల టాస్క్ లు.. మరోవైపు టైటిల్ గెలవాలని కంటెస్టెంట్స్ జిమ్మికులు చాలానే హైలెట్ అవుతున్నాయి. బిగ్ బాస్ లో టాలెంట్ ఉన్నవాళ్లే టైటిల్ విన్నర్ గా నిలబడతారాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక కొంతమంది నటీమణులు వారి అందాలతో క్రేజ్ అందుకోవాలని చూస్తారు గాని డోస్ పెరిగితే మొదటికే మోసం వస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ షోలో మోనాల్ గజ్జర్ కూడా అదే తరహాలో డోస్ పెంచుకుంటూ ఇబ్బందుల్లో పడుతోంది.
Recommended Video

ఆ హాట్ బ్యూటీలు ఎక్కువగా రెచ్చిపోలేదు
ఇంతవరకు బిగ్ బాస్ తెలుగు సీజన్స్ లలో చాలా మంది హాట్ బ్యూటీలు దర్శనమిచ్చారు. ఐటెమ్ సాంగ్స్ తో రచ్చ చేసిన ముమైత్ ఖాన్ నుంచి అప్పుడప్పుడు గ్లామర్ తో హీటెక్కించె తేజస్వి వరకు అందరు కంటెస్టెంట్స్ గా అదృష్టాన్ని పరీక్షించుకున్న వారే. అయితే ఎవరు కూడా గ్లామర్ తో పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భం రాలేదు. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా బిగ్ బాస్ షోకు బాగా అలవాటు పడ్డారు.

ఛానెల్ కూడా మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది
ఇప్పటికే బిగ్ బాస్ షోపై అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇక గ్లామర్ తో టీవీలలో కూడా రెచ్చిపోతే సెన్సార్ టీమ్ ను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. గతంలో ఎవరి వల్ల అలాంటి ఇబ్బంది రాలేదు గాని ఇప్పుడు మోనాల్ కారణంగా బిగ్ బాస్ షో ఇబ్బందుల్లో పడుతున్నట్లు టాక్ వస్తోంది. ఆదివారం మోనాల్ వేసుకున్న డ్రెస్ పై ఒక్కసారిగా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దెబ్బకు ఛానెల్ కూడా మార్చాల్సి వచ్చిందట.

బీ గ్రేడ్ షూటింగ్ అనుకుంటున్నావా
క్లివెజ్ షోతో ఆమె చేసిన రచ్చ నిజంగానే ఫ్యామిలీ ఆడియెన్స్ కి షాక్ కి గురి చేసింది. పిల్లలతో కలిసి తల్లిదండ్రులు చూసే టీవీ షోలో ఇలాంటి క్లోవెజ్ మసాలా డోస్ పెంచితే ఛానెల్ మార్చకుండా ఎలా ఉంటారు. గట్టిగా చెప్పాలంటే మరోసారి షోను చూడడానికి కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపరు. ఇప్పటికే బిగ్ బాస్ అనుకుంటున్నావా? లేక బీ గ్రేడ్ షూటింగ్ అనుకుంటున్నావా అంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. పైగా మోనాల్ వ్యవహరిస్తున్న తీరు కూడా జనాలకు చాలా తప్పుగా కనెక్ట్ అవుతోంది.

ఇలానే కొనసాగితే ఎఫెక్ట్ తప్పదు
ఒకేరోజు అబిజిత్ తో ముచ్చట్లు మరో రోజు అఖిల్ తో హగ్గులు, కిస్సులతో హ్యాపీగా ఉంటుంది. ఆ తరువాత వాళ్లిద్దరూ గొడవ పడితే టీవీ షోలో నా పరువు తీస్తారా అంటూ గట్టిగా అరవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. చూస్తుంటే ఆమె ఓట్లను ఆమెనే పోగొట్టుకుంటోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలానే కొనసాగితే అమ్మడు త్వరలోనే ఎలిమినెట్ అయ్యే అవకాశం లేకపోలేదని కూడా అంటున్నారు.


Click it and Unblock the Notifications











