ప్రముఖ షోలో మోనాల్‌కు చేదు అనుభవం: ఆ విషయంలో మొదలైన గొడవ.. ఆయన అలా కొట్టడంతో తట్టుకోలేక!

అల్లరి నరేష్ నటించిన 'సుడిగాడు' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది గుజరాతీ బ్యూటీ మోనాల్ గజ్జర్. ఆ తర్వాత టాలీవుడ్‌లో మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును తీసుకు రాలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇండస్ట్రీకి బైబై చెప్పేసింది. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ కోసం మళ్లీ వచ్చింది. అయితే, ఈ సారి ఆమె భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీంతో వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ షోలో మోనాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆ వివరాలు మీకోసం!

మొదటిసారి ఘాటుగా దర్శనమిచ్చిన శివాత్మిక రాజశేఖర్

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ... అలా ఫేమస్

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ... అలా ఫేమస్

తెలుగులో పెద్దగా సినిమాలు చేయకున్నా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది మోనాల్ గజ్జర్. ఆరంభంలోనే ట్రైయాంగిల్ లవ్ స్టోరీతో ఫేమస్ అయిందామె. ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో కలిసి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో మరింత పాపులర్ అయింది. ఇలా గేమ్ పరంగా కంటే లవ్ ట్రాకుల కారణంగానే ఈ అమ్మడు ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

స్విమ్మింగ్ పూల్‌లో అర్ధనగ్నంగా.. హాట్ హాట్‌గా యువ హీరోయిన్ అందచందాలు

అతడితో మాత్రం అక్కడా.. ఇక్కడ రచ్చ

అతడితో మాత్రం అక్కడా.. ఇక్కడ రచ్చ

బిగ్ బాస్ హౌస్‌లో అఖిల్ సార్థక్‌తో కలిసి మోనాల్ గజ్జర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. చుట్టూ ఎంతో మంది ఉన్నా.. వీళ్లిద్దరే జంటగా కనిపిస్తూ ఉండేవారు. అదే సమయంలో హగ్గులు, ముద్దులతో హల్‌చల్ చేసేవారు. ఇలా హౌస్‌లో మాత్రమే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా తరచూ కలుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తద్వారా జంటగా ఉంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

హాట్ హాట్‌గా నిధి అగర్వాల్ క్లీవేజ్ షో.. పొట్టి దుస్తుల్లో గ్లామర్ షో!

వరుస ఆఫర్లు.. అందులో పర్మినెంట్‌గా

వరుస ఆఫర్లు.. అందులో పర్మినెంట్‌గా

బిగ్ బాస్ షో పుణ్యమా అని మోనాల్ గజ్జర్‌కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఒక్క దెబ్బతో ఆమె సెన్సేషన్ అయిపోయింది. దీంతో ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో ఓంకార్ నడిపిస్తోన్న 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో పర్మినెంట్ జడ్జ్‌గా చేస్తోంది.

ఎక్కువగా ఆమెనే హైలైట్ చేస్తున్నారు

ఎక్కువగా ఆమెనే హైలైట్ చేస్తున్నారు

'డ్యాన్స్ ప్లస్' షోలో మోనాల్ జడ్జ్‌గా వ్యవహరించే తీరు ఆకట్టుకుంటోంది. అలాగే, ఆమె డ్రెస్సింగ్ కూడా మెప్పించే విధంగా ఉంది. మొదట్లో అందాలను కనిపించేలా అలంకరించుకున్న ఈ భామ... ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు షో నిర్వహకులు. అదే సమయంలో కొన్ని ట్రాకులతో ఆమెను మరింత హైలైట్ చేస్తున్నారు.

షోలో గొడవలు కూడా... మోనాల్ ఫైర్

షోలో గొడవలు కూడా... మోనాల్ ఫైర్

ఇటీవల మోనాల్ గజ్జర్ మెంటర్‌గా వ్యవహరిస్తోన్న MMK టీమ్ తక్కువ స్టార్లు రావడంతో షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు స్టేజ్‌ పైకి వచ్చిన మోనాల్ గజ్జర్.. 'ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. జడ్జ్‌లు అందరూ స్టార్లు ఇవ్వలేదు. వాళ్లలా చేయడం వల్లే ఈరోజు నా టీమ్‌లకు ఈ పరిస్థితి వచ్చింది. తప్పు జరిగిపోయింది' అంటూ ఏడుస్తూ గొడవకు దిగింది.

ఆ షోలో మోనాల్‌కు చేదు అనుభవం

ఆ షోలో మోనాల్‌కు చేదు అనుభవం

డ్యాన్స్ ప్లస్ షో వచ్చే వారం జరగనున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం.. ఇందులో మోనాల్ గజ్జర్ టీమ్ మరోసారి ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చింది. దీంతో ఆమె జడ్జ్‌లు అందరితోనూ గొడవకు దిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వెక్కి వెక్కి ఏడుస్తూ తన బాధను వ్యక్త పరిచినట్లు కూడా చూపించారు.

Recommended Video

#HappyBirthdaySamanthaAkkineni : Samantha Birthday Special Story | Filmibeat Telugu
ఆయన అలా కొట్టడంతో తట్టుకోలేక

ఆయన అలా కొట్టడంతో తట్టుకోలేక

మోనాల్ గొడవ పడుతోన్న సమయంలో యశ్వంత్ మాస్టర్ కలుగజేసుకుని కౌంటర్ ఇచ్చాడు. దీనికి బాబా భాస్కర్ మాస్టర్ చప్పట్లు కొట్టాడు. దీంతో ఆమెకు మరింతగా కాలిపోయింది. అప్పుడు 'ఎందుకు చప్పట్లు కొడుతున్నారు? ఇప్పుడు ఏమైందని అలా చేస్తున్నారు? దయచేసి అందరూ సైలెంట్‌గా ఉండండి. నేను చెప్పింది మాత్రమే వినండి' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోయిందామె.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X