అరియానాకు టైటిల్ గెలిచే అర్హతే లేదు.. అక్కసు వెళ్లగక్కిన మోనాల్ గజ్జర్
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ముగింపు దశకు చేరుకొన్నది. 14వ వారంలో మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ తర్వాత ఇంటిలో టాప్ 5 కంటెస్టెంట్లు అభిజిత్, అరియానా గ్లోరి, సయ్యద్ సోహెల్ ర్యాన్, దేత్తడి హారిక మధ్య పోటీ గట్టిగానే జరుగుతున్నది. ఈ క్రమంలో ఇంటి నుంచి బయటకు వచ్చిన మోనాల్ గజ్జర్ జాతీయ చానెల్‌కు చెందిన పత్రికతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. మోనాల్ ఏం చెప్పారంటే..

అరియానాను టార్గెట్ చేస్తూ..
బిగ్‌బాస్‌లో సాగిన 14 వారాల ప్రయాణంలో అనేక రకాల ఎమోషన్స్‌ను మోనాల్ చవి చూసింది. ముఖ్యంగా అరియానాతో కొన్నిసార్లు జరిగిన వాగ్వాదం, వాదనలతో మోనాల్ విసిగిపోయింది. చివరి వరకు కొన్ని రకాల విభేదాలు కొనసాగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో కూడా అరియానాను టార్గెట్ చేస్తూ కనిపించింది.

ఆ టాస్కులను ఎందుకు గెలువలేదు
అరియానా గురించి మరోసారి మోనాల్ ఫైర్ అయ్యారు. తాను టాస్కులు గొప్పగా ఆడుతుందని చెప్పుకొంటుంది. ఆమె టికెట్ టూ ఫినాలే టాస్క్, ఎవిక్షన్ ఫ్రీ టాస్క్‌ను గెలుచుకోలేకపోయింది. ఒక్క మానవులు వర్సెస్ రాక్షసులు టాస్క్ తప్ప.. గొప్పగా ఫెర్ఫార్మ్ చేసిన మరో టాస్క్ ఏదైనా ఉందా? అంటూ మోనాల్ సెటైర్లు విసిరింది.

బయటకు మాత్రమే బోల్డుగా
అరియానా బోల్డుగా బయటకు మాత్రమే కనిపిస్తుంది. ఆమె సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్. ఉదయం వేసే పాట కోసం ముందే లేచి మేకప్ వేసుకొని రెడీ అవుతుంది. పాటకు డ్యాన్స్ చేసిన తర్వాత మళ్లీ నిద్ర పోతుంది అంటూ మోనాల్ ఓ సీక్రెట్‌ను లీక్ చేసింది.

టాస్కుల పేరుతో అలా..
బిగ్‌బాస్ ఇంటిలో టైటిల్‌కు అర్హత ఉన్న కంటెస్టెంట్లను పరిశీలిస్తే.. అరియానా చివరి స్థానంలో ఉంటుంది. టైటిల్‌ను సాధించడానికి ఆమెకు అర్హతే లేదు. టాస్కుల పేరుతో అందరిని టార్చర్‌కు గురి చేస్తుంది. దానికి మించి ఆమె గొప్పగా ఆడిన దాఖలాలు లేవు అంటూ అరియానాపై మోనాల్ ఫైర్ అయింది.
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు 4 విజేత రేసులో
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 4 ఫైనల్ ఆదివారం అంటే డిసెంబర్ 20 తేదీన జరుగనున్నది. ఈ టైటిల్ కోసం అభిజిత్, అరియానా, సోహెల్ సయ్యద్, అఖిల్, దేత్తడి హారిక పోటీ పడుతున్నారు. ఓటింగ్ లైన్లు ప్రారంభం కావడంతో ఇప్పటికే భారీగా, పోటాపోటీగా ఓట్లు సాధిస్తున్నారు.


Click it and Unblock the Notifications











