twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోనాల్‌కు లవరే కాదు.. బ్రదర్‌ కూడా దొరికాడు.. బిగ్‌బాస్ ఇంటిలో ఆమె తమ్ముడు ఎవరంటే!

    |

    దివి వద్యా విసిరిన బిగ్‌బాంబు ప్రబావంతో యాంకర్ లాస్య కిచెన్ పనులు చేయడంతో బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో 52వ రోజు ప్రారంభమైంది. లాస్యకు అఖిల్, అభిజిత్ ఇద్దరూ సహాయం చేస్తూ కనిపించారు. కిచెన్‌లో లాస్యకు హెల్ప్ చేస్తూ ఇంటి పనులు చేస్తుండటంతో ప్రస్తుత వారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకొన్నాయంటే..

    అఖిల్‌కు బిగ్‌బాస్ బట్టలు

    అఖిల్‌కు బిగ్‌బాస్ బట్టలు

    ఇక సమంత అక్కినేని సూచనతో అభిజిత్‌కు బిగ్‌బాస్ బట్టలు పంపించారు. తనకు బట్టలు, వస్తువులు తిరిగి పంపించేలా చేసిన సమంతకు అభిజిత్ థ్యాంక్స్ చెప్పాడు. థ్యాంక్స్ సామ్.. థ్యాంక్స్ సమంత అంటూ కెమెరా ముందు పలుమార్లు చెప్పారు. అభిజిత్‌తోపాటు అరియానా కూడా సమంతకు థ్యాంక్స్ చెప్పారు.

    మార్నింగ్ మస్తీలో మెహబూబ్‌ గురించి మోనల్

    మార్నింగ్ మస్తీలో మెహబూబ్‌ గురించి మోనల్

    మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో భాగంగా ఇంటి సభ్యులు ఇంటిలోని సభ్యుల గురించి మంచి, చెడు విషయాలను ప్రస్తావించాలి. వాటిని పేపర్‌పై రాసి ఇవ్వాలి అని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే మెహబూబ్‌ గురించి మోనాల్ చెబతూ మన మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. కానీ వాటిని మనం పరిష్కరించుకొందాం. ఇక ముందు కొన్ని విషయాలపై క్లారిటీ తీసుకొందామని నీ అక్కగా నేను కోరుకొంటున్నాను. అందుకు థ్యాంక్యూ అక్కయ్య అంటూ మెహబూబ్ సమాధానం ఇచ్చారు.

    నేను కన్నింగ్ కాదు.. యాంకర్ లాస్య

    నేను కన్నింగ్ కాదు.. యాంకర్ లాస్య

    ఇక నామినేషన్ల ప్రక్రియలో అమ్మా రాజశేఖర్‌కు గట్టిగా క్లాస్ పీకారు. నా నవ్వును కన్నింగ్ అనడం సరికాదు. అందుకే నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అని అంటే అమ్మా రాజశేఖర్ దానికి సమాధానం ఇచ్చారు. కన్నింగ్ అనేది నా దృష్టిలో చెడుగా ఊహించుకోకూడదు అంటూ అమ్మా రాజశేఖర్ తెలిపారు.

    అఖిల్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్

    అఖిల్‌పై అమ్మా రాజశేఖర్ ఫైర్

    ఇక నామినేషన్ల ప్రక్రియలో అఖిల్, అమ్మా రాజశేఖర్ మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. అమ్మా రాజశేఖర్ సింపతి అనే పదం వాడుతుండటంపై అఖిల్ అభ్యంతరం తెలిపారు. అదే విషయంపై అమ్మా రాజశేఖర్ వివరణ ఇస్తున్న సమయంలో అఖిల్ ఘాటుగా స్పందించారు. కాసేపు వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. అలాగే సోహైల్, లాస్య కూడా అమ్మా రాజశేఖర్ తీరును తప్పుపట్టి.. పద్దతి మార్చుకోవాలని సూచించారు.

    Recommended Video

    Bigg Boss Telugu 4: అభిజీత్, మోనాల్ మధ్య ట్రాక్ క్రియేట్ చేసిన బిగ్ బాస్... ఓ ప్రేమదేశం, ఓ ఆర్య 2
    8వ వారంలో నామినేట్ అయిన వారు

    8వ వారంలో నామినేట్ అయిన వారు

    తాజా సమాచారం ప్రకారం.. 8వ వారానికి నామినేట్ అయిన సభ్యుల్లో.. అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా, అమ్మా రాజశేఖర్ ఉన్నారు. అభిజిత్, హారిక, సోహైల్, అవినాష్‌ నామినేషన్ కాకుండా మిగిలిపోయారు. ఈ ఎపిసోడ్ సోమవారం రాత్రి ప్రసారం కానున్నది. ఈ నామినేషన్‌లో జరిగిన వాడివేడి వాగ్వాదాలు ప్రేక్షకులకు ఆసక్తికరంగా మారాయి.

    English summary
    Bigg Boss Telugu 8th weekend show: Nominations for Eight week eliminations goes very furious. Ariana, Akhil, Lasya, Monal, Mehaboob were nominated in the shows. In this house, Monal finds the brother in the form of Mehaboob Dilse.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X