Bigg Boss Telugu రూ.50 స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి.. 9 ఏళ్ల వయసులో అలాంటి అనుభవం.. మోనాల్ కంటతడి
బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో 39వ రోజు భావోద్వేగమైన వాతావరణం నెలకొన్నది. ఇంటి సభ్యులకు తమ జీవితంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకొనే అవకాశాలను బిగ్‌బాస్ ఇచ్చారు. దాంతో చిన్నతనంలోని ఫోటోలను చూస్తూ వారు అనుభవించిన కష్టాలను చెప్పారు. ఆ నేపథ్యంలో టాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుత బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ బాల్యంలో అనుభవించిన పేదరికం గురించి చెప్పి కంటతడి పెట్టారు. మోనాల్ చెప్పిన విషయాలు వివరంగా..

9 ఏళ్ల వయసులో పేదరికం అంటే
నేను ఐదో తరగతి పూర్తి చేసిన తర్వాత మాకు ఆర్థికంగా చాలా కష్టాలు వచ్చాయి. రూ.50 స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితి. స్కూల్ ఫీజు కట్టలేదనే చెప్పొద్దనే కారణంతో నేను అప్పుడే చేతి డిజైనింగ్, కుట్లు లాంటి పనిచేయడం మొదలుపెట్టాను. మా అమ్మ ఇంటింటికి తిరిగి చీరెలు అమ్మేది. దాంతో వచ్చిన డబ్బుతో నా స్కూల్ ఫీజులు, నిత్యావసర వస్తువులు కొనుక్కొనే వాళ్లం. 9 వయసులోనే పేదరికం ఏమిటో నాకు తెలిసింది అని మోనాల్ చెప్పారు.

నాన్న మరణంతో మా పరిస్థితి దారుణంగా
నాకు నాన్న అంటే చాలా ఇష్టం. నాన్న మరణంతో మా కుటుంబ పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎన్నో కష్టాలను తట్టుకొని సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. మా నాన్నతో ఉన్న ఒకే ఒక ఫోటో ఇది. నాన్న అంటే ఇలా ఉంటారనే విషయం ఈ ఫోటో ద్వారానే తెలిసింది. ఈ ఫోటోతో నా అనుబంధం విడదీయలేనిది అని మోనాల్ అన్నారు

టాలీవుడ్ నాకు గుర్తింపునిచ్చింది
టాలీవుడ్ నన్ను ఆదరించి ఓ స్థానం కల్పించింది. అందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను. సినీ పరిశ్రమ నాకు గుర్తింపు ఇచ్చింది. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకొనే ప్రయత్నం చేశాను. కొంత ఆర్థికంగా బెటర్ అయ్యాం. సినిమా పరిశ్రమ ద్వారానే ఈ బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం లభించింది అని మోనాల్ ఎమోషనల్‌గా చెప్పారు.
Recommended Video

బిగ్‌బాస్‌తో నాకు కొత్త కుటుంబం
నాకు చాలా చిన్న ఫ్యామిలీ ఉంది. బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత నాకు మరో కుటుంబం లభించింది. నన్ను ఇష్టపడే వ్యక్తులు కుటుంబ సభ్యులుగా మిగిలిపోయారు. అందుకు చాలా హ్యాపీగా ఉంది అని మోనాల్ ఎమోషనల్ అయ్యారు. దాంతో కుటుంబ సభ్యులు కూడా భావోద్వేగానికి లోనై.. నీకు ఎప్పుడు అండగా ఉంటాం అని చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











