హాట్ ఫొటోతో మోనాల్ గజ్జర్ రచ్చ . నాటు ఫోజుపై అఖిల్ రియాక్షన్ ఇలా

మోనాల్ గజ్జర్.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోన్న పేరిది. అంతలా ఈ బ్యూటీ విపరీతంగా రచ్చ రచ్చ చేస్తోంది. వాస్తవానికి గతంలోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇక్కడ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసింది. సుదీర్ఘ విరామం తర్వాత బిగ్ బాస్ షో కోసం రీఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మోనాల్ గజ్జర్ తన సోషల్ మీడియాలో ఓ హాట్ ఫొటోను వదిలి రచ్చ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోపై మీరూ లుక్కేయండి!

మోనాల్ గజ్జర్ కెరీర్ సాగుతుందిలా

మోనాల్ గజ్జర్ కెరీర్ సాగుతుందిలా

చిన్న వయసులోనే హీరోయిన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన మోనాల్ గజ్జర్.. 'సుడిగాడు' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో మరో రెండు మూడు చిత్రాల్లో నటించింది. అయితే, ఇవేమీ ఆమెకు అంతగా గుర్తింపును, ఆఫర్లను తీసుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె టాలీవుడ్‌కు దూరమైంది. అయితే, వేరే భాషల్లో మాత్రం నటిస్తూనే ఉంది.

 బిగ్ బాస్ ఆఫర్.. లవ్ ట్రాకుతో బ్రేక్

బిగ్ బాస్ ఆఫర్.. లవ్ ట్రాకుతో బ్రేక్

తెలుగులో మరుగున పడిపోయిన మోనాల్ గజ్జర్‌కు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌లో ఫస్ట్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిందామె. ఆరంభంలోనే ట్రయాంగిల్ లవ్ వల్ల బాగా ఫేమస్ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే తేరుకుని దాని నుంచి బయట పడింది. అయితే, ఆ తర్వాత అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగించడం మొదలు పెట్టింది.

 అందులోనే కాదు.. బయటా అలానే

అందులోనే కాదు.. బయటా అలానే

అఖిల్ సార్థక్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు ప్రారంభం అయినప్పటి నుంచి మోనాల్ గజ్జర్ మరింతగా రెచ్చిపోయింది. ఈ క్రమంలోనే తరచూ అతడికి హగ్గులు, ముద్దులు ఇస్తూ రచ్చ చేసింది. అదే సమయంలో ఎప్పుడూ ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంది. షోలోనే కాదు.. బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేస్తోంది. ఫలితంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

బిగ్ బాస్ క్రేజ్‌.. వరుస ఆఫర్లతో సత్తా

బిగ్ బాస్ క్రేజ్‌.. వరుస ఆఫర్లతో సత్తా

బిగ్ బాస్ షోలో విజయం సాధించకున్నా మోనాల్ గజ్జర్‌కు విపరీతమైన క్రేజ్ దక్కింది. దీంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అదే సమయంలో ఆఫర్లు కూడా చాలానే వస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన 'అల్లుడు అదుర్స్'లో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. ప్రముఖ ఛానెల్‌లో 'డ్యాన్స్ ప్లస్' అనే షోలో పర్మినెంట్ జడ్జ్‌గా చేసింది.

 అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న భామ

అక్కడ మాత్రం రచ్చ చేస్తోన్న భామ

చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నా.. మోనాల్ గజ్జర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేస్తోంది. తద్వారా ఫాలోవర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోందీ బ్యూటీ.

హాట్ పిక్‌తో షాకిచ్చిన మోనాల్ గజ్జర్

హాట్ పిక్‌తో షాకిచ్చిన మోనాల్ గజ్జర్

సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక ఫొటోను వదులుతూ ఉండే మోనాల్ గజ్జర్.. తాజాగా ఓ హాట్ క్లీవేజ్ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు ఎద అందాలతో చూపరులకు కనువిందు చేస్తోంది. ఈ పిక్‌లో ఎంతో అందంగా కనిపిస్తోన్న ఈ అమ్మడు చూపు తిప్పుకోకుండా చేస్తుంది. ఫలితంగా ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది వైరల్ అవుతోంది.

Recommended Video

Bigg Boss ని కోర్టుకు ఈడుస్తా.. వాళ్ళు రాజకీయాల్లో ఫెయిల్ అవుతారు - CPI Narayana
ఘాటు ఫోజుపై అఖిల్ రియాక్షన్ ఇలా

ఘాటు ఫోజుపై అఖిల్ రియాక్షన్ ఇలా

మోనాల్ గజ్జర్ షేర్ చేసే ప్రతి ఫోటోకు అఖిల్ సార్థక్ నుంచి స్పందన వస్తూనే ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా వదిలిన పిక్‌కు అతడు స్పందించాడు. ఈ మేరకు ఆ పోస్టుకు 'ఖుబ్‌సూరత్' (అందంగా ఉంది) అని కామెంట్ చేశాడు. దీంతో AKHINAL ఫ్యాన్స్ దీన్ని తెగ హైలైట్ చేస్తూ పండుగ చేసుకుంటున్నారు. ఇలా మరోసారి ఈ జంట హైలైట్ అవడంతో పాటు హాట్ టాపిక్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X