అవినాష్‌కు మోనాల్ మళ్లీ ముద్దు.. బిగ్‌బాస్ ఇంటిలో ముద్దుల గోల.. కౌగిలింతల కలకలం!
బిగ్‌బాస్ ఇంటిలో ఆదివారం రోజున ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభిస్తూ... ఇంటి సభ్యులతో వినోద కార్యక్రమాలను హోస్ట్ నాగార్జున చేపట్టారు. శనివారం ఎపిసోడ్‌లో కామెడీ విషయంలో అవినాష్, నోయల్ సీన్ మధ్య గొడవను మరిచిపోయేలా ఇంటిలోని వ్యక్తుల హావభావాలను అనుకరించాలనే ఓ కామెడీ స్కిట్‌ను ప్లాన్ చేయగా.. ఇంటి సభ్యులు ఎవరు ఎలా చేస్తారో అలా చూపించారు. ఆ వివరాల్లోకి వెళితే..

అవినాష్‌కు మోనాల్ ముద్దు
అవినాష్‌కు మోనాల్ ముద్దు పెట్టినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు అనే అంశంపై యాక్టింగ్ చేయాలని చెప్పగా.. అరియానా, మోనాల్ ఆ స్కిట్‌ను చేశారు. అవినాష్‌గా అరియానా నటించారు. ఒక్క ముద్దు ఇవ్వమని మోనాల్‌ను అడుగుతూ వెంటపడింది. దాంతో అరియానాకు మోనాల్ ముద్దు ఇచ్చింది. దాంతో అవినాష్ పాత్రలో ఉన్న అరియానా గట్టిగా అరుస్తూ అరియానా.. మోనాల్ నాకు ముద్దు ఇచ్చింది అంటూ నటించింది. ఈ సీన్ మంచి ఫన్ క్రియేట్ చేసింది.

నీకు పెళ్లి ఇక కాదంటూ నాగ్
అదే సీన్‌ను అవినాష్‌ను చేయమనగా.. మోహబూబ్‌ను మోనాల్‌గా నటించమని కోరాడు. ఆ క్రమంలో అవినాష్‌కు మోనాల్‌గా యాక్ట్ చేస్తున్న మెహబూబ్ ముద్దు పెట్టాడు. దాంతో అవినాష్ సంతోషంలో మునిగిపోతూ యస్.. నాకు ఇదే కావాలి అంటూ ఎగిరి గంతులు వేశాడు. దాంతో నాగార్జున స్పందిస్తూ.. ఇలా చేస్తే నీకు పెళ్లి కావడం కష్టమే అంటూ కామెంట్ చేయగా.. అవినాష్ లబోదిబో అన్నాడు.

మోనాల్, అఖిల్ కౌగిలింతలపై
ఇక మోనాల్, అఖిల్ మధ్య జరిగే సంఘటనల గురించి అభిజిత్‌తో స్కిట్ చేయించాడు. ఎలిమినేషన్ సందర్భంలో అఖిల్ సేవ్ అయితే మోనాల్ ఎలా ఉంటుందనే అంశంపై మోనాల్‌గా అభిజిత్ నటించాడు. అఖిల్ కోసం పడే తాపత్రయం చూపిస్తూ ఆకట్టకొన్నాడు. అఖిల్ సేవ్ అయిన తర్వాత ఎలా కౌగిలించుకొంటారనే విషయాన్ని అవినాష్, అభిజిత్ చూపించగా.. నాగార్జున నవ్వుల్లో మునిగిపోయారు.
Recommended Video

అభిజిత్, హారిక ఎలా కౌగిలించుకొంటుందంటే..
ఇక అభిజిత్, హారిక మధ్య కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటారు అనే విషయంపై స్కిట్ ప్రదర్శించారు. నా డ్రస్ ఎలా ఉంది మచ్చా అంటూ అభిజిత్‌ను కౌగిలించుకొనే తీరును ప్రదర్శించారు. ఆ సీన్ కూడా ఇంటి సభ్యులను, నాగార్జున, ప్రేక్షకులకు వినోదాన్ని పంచింది. అలా ఎపిసోడ్‌ను సరదా సరదాగా ముగించారు


Click it and Unblock the Notifications











