అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్: అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులు.. ఊహించని ఘటనకు షాక్

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. అప్పటి వరకూ ఉన్న రికార్డులన్నీంటినీ తిరగరాస్తూ ఘనమైన ఆరంభాన్ని దక్కించుకున్న ఈ షో.. ఏకంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రియాలిటీ షో సక్సెస్ వెనుక ఎన్నో కారణాలు ఉన్నా.. అందులో జరిగే లవ్ ట్రాకులు ప్రధాన భూమికను పోషించాయి. ఇక, తాజాగా ముగిసిన సీజన్‌లో తమ వ్యవహార శైలితో హాట్ టాపిక్ అయ్యారు మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్. బయట కూడా రచ్చ చేస్తోందీ జంట. ఈ నేపథ్యంలోనే తాజాగా లైవ్‌లో ముద్దులిచ్చుకుని మరోసారి హైలైట్ అయ్యారు. ఆ వివరాలు మీకోసం!

ఆ యవ్వారంతో ఫేమస్ అయిన జోడీ

ఆ యవ్వారంతో ఫేమస్ అయిన జోడీ

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కొన్ని లవ్ ట్రాకులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వీటిలో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ జోడీ ఒకటి. వాస్తవానికి వీళ్లిద్దరూ షో ఆరంభంలో పెద్దగా కలిసింది లేదు. దీనికి కారణం మోనాల్.. మొదట్లో అభిజీత్‌తో సన్నిహితంగా ఉండేది. అప్పుడే అఖిల్‌తోనూ సన్నిహితంగా ఉంది. దీంతో ట్రయాంగిల్ లవ్‌గా ఇది ప్రచారం జరగడంతో బాగా ఫేమస్ అయ్యారు.

ఒకరికి ఒకరై ఉంటూ... జంటగానే ఆట

ఒకరికి ఒకరై ఉంటూ... జంటగానే ఆట

బిగ్ బాస్ షో అనేది ఒంటరిగా ఆడే రియాలిటీ గేమ్. కానీ, హౌస్‌లో లవ్ ట్రాకు మొదలైన తర్వాత ఎంతో మంది జంటగా ఆడుతూ వార్తల్లో నిలిచారు. గత సీజన్‌లో మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్ కూడా ఇదే ఫాలో అయ్యారు. హౌస్‌లో ఒంటరిగా కాకుండా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వ్యవహరించేవారు. టాస్కుల్లో సహాయం చేసుకోవడం, నామినేషన్స్‌లో త్యాగాలు చేయడం వంటివి చేశారు.

ప్రేమను చూపిస్తూ.. ముద్దులు, హగ్స్

ప్రేమను చూపిస్తూ.. ముద్దులు, హగ్స్

హోస్ట్ అక్కినేని నాగార్జున సహా కంటెస్టెంట్లు అందరూ అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్ మధ్య ప్రేమాయణం గురించే మాట్లాడుకునేవారు. దీంతో అప్పటి నుంచి వీళ్లిద్దరూ మరింతగా రెచ్చిపోయారు. ఈ క్రమంలోనే హగ్గులిచ్చుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి చేస్తూ తరచూ హైలైట్ అయ్యేవారు. అలాగే, రొమాంటిక్‌గా మాట్లాడుకుంటూ.. ఒకరి కోసం ఒకరు బాధ పడుతూ వచ్చారు.

అక్కడే కాదు.. ఇక్కడ కూడా హల్‌చల్

అక్కడే కాదు.. ఇక్కడ కూడా హల్‌చల్

బిగ్ బాస్ హౌస్‌లో కలిసే ఉన్న చేసిన అఖిల్ సార్థక్.. మోనాల్ గజ్జర్ విపరీతమైన క్రేజ్‌ను అందుకున్నారు. అదే కంటిన్యూ చేస్తూ బయట కూడా రచ్చ రచ్చ చేస్తున్నారు. షో అయిపోయిన వెంటనే అఖిల్ ఇంటికి వెళ్లి సర్‌ప్రైజ్ చేసింది మోనాల్. దానికి సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఓ పార్టీకి వెళ్లారు. అలాగే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్

అందరి ముందే రెచ్చిపోయిన మోనాల్

బిగ్ బాస్ షో వల్ల ఎంతగానో పాపులర్ అయ్యారు అఖిల్ సార్థక్ - మోనాల్ గజ్జర్. దీంతో వీళ్ల క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వీళ్లిద్దరినీ జంటగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌తో వీళ్లిద్దరూ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మోనాల్ గజ్జర్.. అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులిచ్చింది.

అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులిచ్చింది

అఖిల్‌కు ముద్దుల మీద ముద్దులిచ్చింది

ఈ ఇంటర్వ్యూలో మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్‌కు ఓ విషయంలో పంచ్ వేసింది. ఆ వెంటనే అతడికి కెమెరాల ముందే ఫ్లైయింగ్ కిస్‌లు ఇచ్చింది. దీంతో అతడు సిగ్గు పడిపోయాడు. అంతేకాదు, తలదించుకుని కూర్చుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను అఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టోరీగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి యూట్యూబ్‌లో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X